చంద్రపూర్ జిల్లా
మహారాష్ట్ర లోని జిల్లా / From Wikipedia, the free encyclopedia
చంద్రపూరు జిల్లా (మహారాష్ట్ర:चंद्रपूर जिल्हा) భారతదేశ మహారాష్ట్రలోని నాగ్పూరు విభాగంలోని జిల్లా. ఈ జిల్లాను గతంలో చందా జిల్లాగా పిలిచేవారు. 1964 లో దీనికి చంద్రపూరు అని పేరు మార్చారు. గాడ్చిరోలి ప్రత్యేక జిల్లాగా విభజించబడే వరకు ఇది భారతదేశంలో అతిపెద్ద జిల్లాగా ఉండేది. జిల్లా జనసంఖ్య 2,071,101, వీరిలో 32.11% (2001 నాటికి) పట్టణ ప్రజలు ఉన్నారు.[1]
చంద్రపూర్ జిల్లా
चंद्रपूर जिल्हा | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మహారాష్ట్ర |
డివిజను | నాగపూర్ |
ముఖ్య పట్టణం | Chandrapur |
మండలాలు | 1. చంద్రపూర్, 2. భద్రావతి, 3. వరోరా, 4. చిమూర్, 5. నాగ్భీడ్, 6. బ్రహ్మపురి, 7. సిందేవాహి, 8. మూల్, 9. సవోలి, 10. గోండ్పింప్రి, 11. రాజూరా, 12. కోర్పానా, 13. పంబూర్నా, 14. బలార్పూర్, 15. జివాటి |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | 1. Chandrapur (shared with Yavatmal district), 2. Gadchiroli-Chimur (shared with Gadchiroli district) |
• శాసనసభ నియోజకవర్గాలు | 6 |
Area | |
• మొత్తం | 10,690 km2 (4,130 sq mi) |
Population (2001) | |
• మొత్తం | 20,71,101 |
• Density | 190/km2 (500/sq mi) |
• Urban | 32.11% |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 59.41% |
సగటు వార్షిక వర్షపాతం | 1398 మి.మీ. |
Website | అధికారిక జాలస్థలి |
ఈ ప్రసిద్ధి చెందిన " సూపరు థర్మల్ పవరు ప్లాంటు " ఉంది. వార్ధా వ్యాలీ కోల్ఫీల్డులోని బొగ్గు నిల్వలు ఉన్న కారణంగా ఇది ఆసియాలో అతిపెద్దదిగా గుర్తించబడింది. చంద్రపూరులో పెద్ద సున్నపురాతిజలాశయాలు కూడా ఉన్నాయి. సున్నపురాయి, బొగ్గు సమృద్ధిగా ఉన్న ఈ జిల్లాలో " లార్సను అండ్ ట్యూబరో " (ఎల్ అండ్ టి, ఇప్పుడు అల్ట్రాటెక్ సిమెంట్), గుజరాతు అంభుజా (మరాఠా సిమెంటు వర్క్సు), మణిక్గడు, ముర్లి సిమెంటు, ఎసిసి సిమెంటు వంటి అనేక సిమెంటు కర్మాగారాలు ఉన్నాయి. చంద్రపూరు సమీపంలోని తడోబా నేషనల్ పార్కు భారతదేశంలోని 28 ప్రాజెక్టు టైగరు రిజర్వులలో ఒకటి. జిల్లా రాజధాని చంద్రపూరు నగరంలో పురాతన దేవాలయాలైన అంకాలేశ్వరు (శివుడు), మహాకాళి (దేవత మహాకాళి) ఆలయాలు ఉన్నాయి.