![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/3/3d/Six_Quadrilaterals.svg/langte-640px-Six_Quadrilaterals.svg.png&w=640&q=50)
చతుర్భుజి
From Wikipedia, the free encyclopedia
యూక్లిడ్ రేఖాగణితం లో, చతుర్భుజం లేదా చతుర్భుజి (Quadrilateral), నాలుగు భుజాలు కలిగిన సరళ సంవృత పటం బహుభుజి. చతుర్భుజమును ఆంగ్లంలో "quadrilateral" అంటారు. ఈ పదం quadri (అనగా నాలుగు), latus (అనగా భుజం) అనే లాటిన్ పదములతో యేర్పడింది.
చతుర్భుజం | |
---|---|
![]() | |
కుటుంబం | బహుభుజులు |
రకం | చతుర్భుజం |
భుజాలు | AB, BC, CD, DA |
శీర్షాలు | A, B, C, D |
కోణాల మొత్తం | 360 డిగ్రీలు |
వైశాల్యం | ½ d (h1 + h2) చదరపు ప్రమాణాలు |
చతుర్భుజములు సామాన్యంగా రెండురకాలు. అవి సాధారణ (భుజములు ఖండించుకొనని) లేదా సంశ్లిష్ట (భుజములు అంతరంగా ఖండించుకొన్నవి) . వాటిలో సాధారణ చతుర్భుజాలు కుంభాకార బహుభుజి లేదా పుటాకార బహుభుజి అనే రెండు రకాలుగా ఉంటాయి.
ఒక సాధారణ చతుర్భుజం యొక్క అంతర కోణముల మొత్తం 360 డిగ్రీలు, లేదా నాలుగు లంబ కోణాలు.
ఒక ప్రత్యేక సందర్భంలో n భుజములు కలిగిన బహుభుజి యొక్క అంతర కోణముల మొత్తమునకు సూత్రము (n - 2) × 180°. ఖండించుకొనే చతుర్భుజంలో ఒకవైపు గల అంతరకోణములమొత్తం 720° వరకు ఉంటుంది. [1] అన్ని కుంభాకార చతుర్భుజముల భుజముల మధ్య బిందువులను కలిపినపుడు పునరావృతమవుతాయి.