![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/4/4d/Four_cigars.jpg/640px-Four_cigars.jpg&w=640&q=50)
పొగ చుట్ట
ధూమపానం కోసం పొగాకుని గట్టిగా చుట్టి వెలిగించగలిగే కట్టలుగా తాయారుచేయబడునది / From Wikipedia, the free encyclopedia
పొగ చుట్ట లేదా చుట్ట (Cigar) ఒక గట్టిగా చుట్టబడిన ఎండు పొగాకు కట్ట. పొగత్రాగేవారు ఒకవైపు చుట్టకు నిప్పు అంటించి రెండవ వైపును నోట్లో పెట్టుకొని పొగను నోటిలోకి పీల్చుకుంటారు.
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/4/4d/Four_cigars.jpg/640px-Four_cigars.jpg)
చుట్టకు ఆంగ్ల పదమైన సిగార్, స్పానిష్ పదమైన సిగారో నుండి వచ్చింది. స్పానిష్ పదానికి మూలం మయన్ భాషలో పొగాకు యొక్క పదం సియర్
చుట్టలలో ఉపయోగించే పొగాకును గణనీయంగా బ్రెజిల్, కామెరూన్, క్యూబా, డొమినికన్ రిపబ్లిక్, హోండూరస్, ఇండోనేషియా, మెక్సికో, నికరాగ్వా, అమెరికా దేశాలలో పండిస్తారు. క్యూబా చుట్టలు ప్రపంచప్రసిద్ధమైనవి.
పొగ చుట్ట యొక్క మహిమ ఆంధ్రులకు తెలియనిది కాదు. పొగ చుట్ట, బీడీ, సిగరెట్టు ఇవన్నీ ఒక కోవకే చెందినవి. మంచి పొగాకును చుట్టి షుమారుగా 5 నుంచి 6 అంగుళాల పొడుగుతో పొగ చుట్టను చేస్తారు. గుంటూరు పొగాకు చుట్టకు శ్రేష్టమైనది.