శ్రీలంక నటి మరియు మోడల్ (జననం 1985) From Wikipedia, the free encyclopedia
జాక్వెలిన్ ఫెర్నాండేజ్ (జననం 11 ఆగస్టు 1985) ప్రముఖ సినీ నటి, మోడల్. ప్రముఖంగా శ్రీలంకకు చెందిన ఈమె, 2006లో మిస్ యూనివర్స్ శ్రీలంకగా ఎంపికైంది. శ్రీలంక తరఫున 2006లో ఆమె మిస్ యూనివర్స్ పోటీకి కూడా వెళ్ళింది.[1] సిడ్నీ విశ్వవిద్యాలయంలో మాస్ కమ్యూనికేషన్ లో డిగ్రీ పూర్తి చేసింది జాక్వెలిన్. శ్రీలంకలో టీవీ రిపోర్టర్ గా కూడా పని చేసింది ఆమె. 2009లో భారతదేశంలో అలాడిన్ అనే ఫాంటసీ డ్రామా కోసం ఆడిషన్ చేసింది ఆమె. ఈ ప్రాజెక్టు ద్వారానే ఆమె నటిగా కెరీర్ ప్రారంభించింది. 2011లో ఆమె నటించిన మర్డర్2 ద్వారా ఆమె మొట్టమొదటి సక్సెస్ అందుకుంది. ఈ సినిమా విజయవంతం కావడంతో వరసగా ఆమెకు గ్లామర్ పాత్రలే ఎక్కవగా వచ్చాయి. ఆ తరువాత ఆమె నటించిన హౌస్ ఫుల్ 2(2012), రేస్ 2(2013) సినిమాలు 1 బిలియన్ వసూళ్ళు దాటాయి.[2] హౌస్ ఫుల్ 2 సినిమాలోని నటనకుగానూ ఆమెకు ఐఫా పురస్కారాల్లో ఉత్తమ సహాయ నటి పురస్కారానికి నామినేషన్ లభించింది. ప్రధాన కథానాయిక పాత్రలో ఆమె నటించిన కిక్(హిందీ) సినిమా భారతదేశంలో అత్యంత ఎక్కువ వసూళ్ళు సాధించిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఆ తరువాత ఆమె నటీంచిన హౌస్ ఫుల్ 3, డిషూం, ఏ ఫ్లయింగ్ జట్(అన్నీ 2006లోనే విడుదలయ్యాయి.) సినిమాలు వరుసగా విజయం సాధించడం విశేషం.[3][4] 2020 సంవత్సరంలో ఈవిడ పై చిత్రీకరించిన గెంద ఫూల్ పాట భారతదేశంలో అత్యధిక మంది యూట్యూబ్ లో వీక్షించిన పాట గా నిలిఛింది.
జాక్వెలిన్ ఫెర్నాండేజ్ Jacqueline Fernandez | |
---|---|
జననం | మనమా, బహ్రయిన్ | 1985 ఆగస్టు 11
జాతీయత | శ్రీలంక |
విద్యాసంస్థ | సిడ్నీ విశ్వవిద్యాలయం |
వృత్తి | నటి, మోడల్ |
క్రియాశీల సంవత్సరాలు | 2009–ప్రస్తుతం |
200 కోట్ల మనీలాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడైన సుఖేశ్ చంద్రశేఖర్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణ ఎదుర్కొంటున్న అతడు తీహార్ జైల్లో ఉన్నాడు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా అతని నుంచి ఖరీదైన బహుమతులు అందుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్న జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు చెందిన రూ.7 కోట్లకు పైగా ఆస్తులను ఈడీ అధికారులు 2022 ఏప్రిల్ 30న అటాచ్ చేసారు.[5] గతంలో విదేశాలకు వెళ్లకుండా ఆమెను ముంబై విమానాశ్రయంలో ఈడీ నిలిపివేసింది. పైగా 2021 డిసెంబర్ 8న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు విచారణకు హాజరుకావాలని ఆమెను ఆదేశించింది.[6]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.