From Wikipedia, the free encyclopedia
తిరునెళ్ళై నారాయణ అయ్యర్ శేషన్ (టి.ఎన్.శేషన్ గా సుపరిచితుడు) పదవీవిరమణ చేసిన భారతదేశానికి చెందిన తమిళనాడు కేడరులోని 1955 బ్యాచ్ ఐ.ఎ.ఎస్ అధికారి. అతను భారత ఎన్నికల వ్యవస్థలో భారీ సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తిగా సుపరిచితుడు.[1][2] అతను 10వ భారత ప్రధాన ఎన్నికల కమీషనరుగా (1990–96) ఉన్నాడు.[3][4][5] ఐ.ఎ.ఎస్ అధికారిగా అతను 1989 లో 18వ భారత కేబినెట్ సెక్రటరీగా కూడా పనిచేసాడు. అతను ప్రతిష్ఠాత్మక రామన్ మెగసెసె అవార్డు గ్రహీత.[6] ఆయన తీసుకున్న కొన్ని అసాధారణ నిర్ణయాలు భారత ఎన్నికల వ్యవస్థనే మార్చేశాయి. ఎన్నికల్లో డబ్బు ప్రవాహానికి శేషన్ చెక్ పెట్టాడు.
టి.ఎన్.శేషన్ | |||
10వ భారత ప్రధాన ఎన్నికల కమీషనర్ | |||
పదవీ కాలం 12 డిసెంబరు 1990 – 11 డిసెంబరు 1996 | |||
ప్రధాన మంత్రి | వి.పి.సింగ్ చంద్రశేఖర్ పి.వి.నరసింహరావు అటల్ బిహారీ వాజపేయి హెచ్.డి.దేవెగౌడ | ||
---|---|---|---|
ముందు | వి.ఎస్.రమాదేవి | ||
తరువాత | ఎం.ఎస్.గిల్ | ||
18వ భారత కేబినెట్ సెక్రటరీ | |||
పదవీ కాలం 27 మార్చి 1989 – 23 డిసెంబరు 1989 | |||
ప్రధాన మంత్రి | రాజీవ్ గాంధీ | ||
ముందు | బి.జి.దేశ్‌ముఖ్ | ||
తరువాత | వి.సి.పాండే | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | పాలక్కాడు, మద్రాసు ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుతం కేరళ, భారతదేశము) | 1932 డిసెంబరు 15||
మరణం | 2019 నవంబరు 10 86) | (వయసు||
నివాసం | చెన్నై, తమిళనాడు, భారతదేశం | ||
పూర్వ విద్యార్థి | మద్రాసు క్రిస్టియన్ కళాశాల హార్వార్డ్ విశ్వవిద్యాలయం | ||
వృత్తి | ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ | ||
పురస్కారాలు | రామన్ మెగసెసే పురస్కారం (in 1996) |
తిరునెళ్ళై నారాయణ అయ్యర్ శేషన్ 1932 డిసెంబరు 15న కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్ జిల్లాకు చెందిన తిరునెళ్ళై గ్రామంలో జన్మించాడు. అతను "బేసెల్ ఎవాంజెలిచల్ మిషన్ హయ్యర్ సెకండరీ పాఠశాల"లో పాఠశాల విద్యను పూర్తిచేసాడు. ఇంటర్మీడియట్ ను పాలక్కాడ్ లోని ప్రభుత్వ విక్టోరియా కళాశాలలో చదివాడు. అతను మద్రాసు క్రిస్టియన్ కళాశాల నుండి భౌతిక శాస్త్రంలో గ్రాడ్యుయేషన్ చేసాడు. అతను ఐ.ఎ.ఎస్ పరీక్ష పాసయినప్పుడు మద్రాసు క్రిస్టియన్ కళాశాలలో మూడు సంవత్సరాలు డిమానిస్ట్రేటర్ గా పనిచేసాడు. తరువాత అతను హార్వార్డ్ విశ్వవిద్యాలయానికి వెళ్లి ఎడ్వర్డ్ ఎస్. మాసన్ ఫెలోషిప్ పొందాడు. అక్కడ పబ్లిక్ ఎడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్ డిగ్రీని పొందాడు.
టి.ఎన్.శేషన్, ఎ.శ్రీధరన్ లు బి.ఇ.ఎం పాఠసాల, విక్టోరియా కళాశాలలో సహాద్యాయులు. వీరిద్దరూ కాకినాడ లోని ఇంజనీరింగ్ (జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ విశ్వవిద్యాలయం) కు ఎంపిక కాబడ్డారు. అయినప్పటికీ ఇ.శ్రీధరన్ దానిని అనుసరించాలని నిర్ణయించుకున్నాడు కానీ శేషన్ మద్రాస్ క్రిస్టియన్ కళాశాలలో చేరాలని నిర్ణయించుకున్నాడు.[7]
1959లో దిండిగల్ సబ్ కలెక్టరుగా సేవలనందించే సమయంలో అతను జయలక్ష్మిని వివాహమాడాడు. ఆమె కేరళ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ అయిన ఆర్.ఎస్. కృష్ణన్ కుమార్తె. పదవీ విరమణ చేసిన తరువాత శేషన్ పిల్లలు లేని కారణంగా కొద్దికాలంగా తన భార్యతో సహా వృద్ధాశ్రమంలోనే నివసిస్తూ వచ్చాడు. ఆమె 2018 మార్చి 31 న మరణించింది.[8]
శేషన్ తన సోదరుడు టి.ఎన్.లక్ష్మీనారాయణన్ (ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసుకు మొదటి బ్యాచ్ వ్యక్తి) వలెనే సివిల్ సర్వీసులలో చేరాలని అనుకున్నాడు. 1953లో శేషన్ ఐ.ఎ.ఎస్ కు హాజరగుటకు తక్కువ వయస్సు కలిగి ఉన్నాడు. తన సామర్ధ్యాలను పరీక్షించేందుకు, అతను ఇండియన్ పోలీస్ సర్వీస్ కోసం పరీక్షకు హాజరయ్యాడు. 1954 బ్యాచ్ భారతదేశంలో మొదటి స్థానం పొందాడు. తరువాత సంవత్సరం అతను 1955 బ్యాచ్ ఐ.ఎ.ఎస్ కు హాజరయ్యాడు మంచి ర్యాంకు సంపాదించాడు.
ఐ.ఎ.ఎస్ అధికారిగా అతను తమిళనాడు, కేంద్ర ప్రభుత్వాలలో వివిధ శాఖలలో సెక్రటరీగా తన సేవలనందించాడు. అతను కేబినెట్ సెక్రటరీగా, సివిల్ సర్వీసులో సీనియర్ గా, భారత దేశ ప్లానింగ్ కమిషన్ సభ్యునిగా కూడా పనిచేసాడు. తరువాత భారత ప్రధాన ఎన్నికల అధికారిగా తన సేవలనందించాడు. అతను 1997 రాష్ట్రపతి ఎన్నికలలో కె.ఆర్. నారాయణన్‌కు ప్రత్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.[9]
2012 అక్టోబరు 17 న మద్రాసు హైకోర్టు అతనిని చెన్నై లోని పచ్చయప్ప ట్రస్టుకు తాత్కాలిక నిర్వాహకునిగా ఉండవలసినదిగా నియమించింది.[10]
10 వ ముఖ్య ఎన్నికల కమిషనరుగా శేషన్ పేరు పారదర్శకత, సమర్థతకు పర్యాయపదంగా మారింది.[3] స్వచ్ఛమైన ఎన్నికలను నిర్వహించడం ద్వారా అతను దేశ ఎన్నికల వ్యవస్థపై తన అధికారాన్ని ముద్రించగలిగాడు. "చట్టాన్ని ఉల్లంఘించడానికి ఎవరూ సాహసించరు."[11][12] అతనిచే ప్రవేశపెట్టిన ఎన్నికలలో మార్పులు రాజకీయ వర్గాలు, వారి మీడియా మధ్య పరస్పరం వ్యతిరేకించాయి, అతనిని కూడా వ్యతిరేకించారు, "ఎలక్షన్ వాచ్ డాగ్"గా పేరుపెట్టాయి. తరువాత "Al-Seshan (Alsatian)" [13][14] అభివర్ణించాయి. ఎంతగా అంటే, ఎన్నికల 'పోరాటాలు' గా "శేషన్ వెర్సస్ నేషన్"గా పిలవబడేటంతగా పేరు పొందాడు.[15]
ఎన్నికల ప్రక్రియలో చట్టం అమలు :
అంతకు ముందు గల అనేక దుష్పరిమాణాల తొలగింపు :[17]
ఎన్నికల సంస్కర్తగా పేరు గడించిన టి.ఎన్.శేషన్ తన 87వయేట 2019, నవంబర్ 10 ఆదివారం చెన్నై నగరం అడయార్ లోని తన స్వగృహంలో తుది శ్వాస విడిచాడు[18].
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.