డేవిడ్ ధావన్ (జననం 1955 ఆగస్టు 16[1]) ప్రముఖ భారతీయ దర్శకుడు. ఆయన అసలు పేరు రాజిందర్ ధావన్. పూణె లోని ఫిలిం  అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో నటన నేర్చుకునేందుకు ప్రయత్నించి, ఎడిటింగ్ నేర్చుకున్నారు.

Thumb
డేవిడ్ ధావన్

తొలినాళ్ళ జీవితం

డేవిడ్ పంజాబ్ అగర్తలలోని పంజాబీ హిందూ కుటుంబంలో జన్మించారు.  తన తండ్రి యూకో బ్యాంక్ మేనేజర్ కావడంతో వారి కుటుంబ కాన్పూర్ కు ట్రాన్స్ ఫర్ పై వెళ్ళింది. 12వ తరగతి వరకు క్రైస్ట్ చర్చ్ కళాశాలలోనే చదువుకున్నారు. ఆ తరువాత పుణే లోని ఫిలిం ఇన్స్టిట్యూట్ లో నటన నేర్చుకునేందుకు చేరారు. కానీ సతీష్ షా, సురేష్ ఒబెరాయ్ వంటి వారిని చూసి, నటన తన వల్ల అవ్వదని భావించి, ఎడిటింగ్ నేర్చుకున్నారు డేవిడ్.

కెరీర్

దర్శకత్వంలోకి రాకముందు ధావన్ ఎడిటర్ గా తన కెరీర్ ను మొదలు పెట్టారు. కామెడీ సినిమాలు దర్శకత్వం చేయడంలో సిద్ధహస్తుడు ఆయన.[2] 1993లో విడుదలైన ఆంఖే ఆయన కెరీర్ లోనే అతి పెద్ద హిట్.[2] పార్టనర్ (2007) సినిమా కూడా మంచి విజయం సాధించింది.[3]

ఆసియా ఫిలిం & టెలివిజన్ అకాడమీ, ఆసియా స్కూల్ ఆఫ్ మీడియా స్టడీస్ బోర్డలలో డేవిడ్ సభ్యునిగా ఉన్నారు. ఆసియా స్కూల్ ఆఫ్ మీడియా స్టడీస్ నుండి సందీప్ మార్వా ధావన్ కు అకాడమీ అవార్డు ఇచ్చి గౌరవించారు. 2008లో స్టార్ ప్లస్ లో వచ్చే నచ్ బలియా 3 లోనూ, హన్స్ బలియా షోలలోనూ న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు ఆయన.

గోవిందా తో కలసి..

గోవిందా తో ఎన్నో సినిమాలు తీశారు డేవిడ్. తాకత్వర్ (1989) వీరీ కాంబినేషన్ లో మొదటి సినిమా. వీరిద్దరూ దాదాపు 17  కామెడీ సినిమాలు చేశారు. తాకత్వర్ (1989), స్వర్గ్ (1990), షోలాఔర్ షబ్నమ్ (1992), ఆంఖే (1993), రాజా బాబు (1996), కూలీ నెం.1 (1995), సాజన్ చలే ససురాల్ (1996), బనారసీబాబు (1997), దీవానా మస్తానా (1997), హీరో నెం.1 (1997), బడే మియాన్ చోటే మియాన్ (1998), హసీనా మాన్ జాయేగి (1999), కున్వారా (2000), జోడి నెం.1 (2001), ఏక్ ఔర్ ఏఖ్ గ్యారాహ్ (2003), పార్ట్ నర్ (2007),  డు నాట్ డిస్టర్బ్ (2009) సినిమాలు వీరి కాంబినేషన్లో వచ్చాయి. ఇందులో పార్ట్ నర్ సినిమాలో సల్మాన్ ఖాన్ కూడా నటించారు. ఈ సినిమా 300 మిలియన్లు వసూలు చేసింది.[4] అదే సంవత్సరంలో  ధావన్ ను, గోవిందాను తన షో 10 కా దమ్ కు అతిధులుగా పిలిచారు సల్మాన్. 

వ్యక్తిగత జీవితం

ధావన్ భార్య కరుణ.[5] [6] వీరికి ఇద్దరు కుమారులు రోహిత్ ధావన్, వరుణ్ ధావన్. నటుడు అనిల్ ధావన్ డేవిడ్ సోదరుడు. అతని మేనల్లుడు సిద్దార్ధ్ ధావన్ కూడా నటుడే.[7]

సినిమాలు

మరింత సమాచారం సంవత్సరం, చిత్రం ...
సంవత్సరంచిత్రం
1989 ఆంధియాన్
తాకత్వార్
గోలా బరోడ్
1990 స్వర్గ్
ఆగ్ కా గోలా
జర్రత్
1992 షోలా ఔర్ షబ్నమ్
బోల్ రాధా బోల్
1993 ఆంఖే
1994 రాజా బాబు
ఏనా మీనా డీకా
అందాజ్
1995 యరానా
కూలీ నెం.1
1996 లోఫర్
సాజన్ చలే ససురాల్
1997 మిస్టర్ & మిసెస్ ఖిలాడి
బనారసీ బాబు
జుద్వా
దీవానా మస్తానా
హీరో నెం.1
1998 ఘర్ వాలీ భర్ వాలీ
బడే మియాన్ చోటే మియాన్
1999 బీవీ నెం.1
హసీనా మాన్ జాయేగా
2000 దుల్హన్ హమ్ లే జాయేంగే
కున్వారా
చల్ మేరే భాయ్
2001 జోడి నెం.1
2002 చోర్ మచాయే షోర్
యే హై జ్వాలా
హమ్ కసీ సే కమ్ నహీ
2003 ఏక్ ఔర్ ఏక్ గ్యారహ్
2004 ముజ్సే షాదీ కరోగీ
2005 షాదీ నెం.1
మైనే ప్యార్ క్యూ కియా
2007 పార్ట్ నర్
2009 డు నాట్ డిస్టర్బ్
2011 రాస్కెల్స్
2013 చష్మే బుడ్డోర్
2014 మై తేరా హీరో
2020 కూలీ నెం. 1
మూసివేయి

అవార్డులు, నామినేషన్లు

మరింత సమాచారం సంవత్సరం, చిత్రం ...
సంవత్సరం చిత్రం పురస్కారాలు కేటగిరి ఫలితం
1994 ఆంఖే ఫిలింఫేర్ అవార్డులు ఫిలింఫేర్ ఉత్తమ దర్శకుడు అవార్డు నామినేషన్
2000 బీవీ నెం.1 ఫిలింఫేర్ అవార్డులు ఫిలింఫేర్ ఉత్తమ దర్శకుడు అవార్డు నామినేషన్
ఫిలింఫేర్ ఉత్తమ చిత్రం అవార్డు నామినేషన్
2005 ముజ్సే షాదీ కరోగీ అంతర్జాతీయ ఇండియన్ ఫిలిం అకాడమీ అవార్డులు ఐఫా ఉత్తమ దర్శకుడు అవార్డు నామినేషన్
2014 మై తేరీ హీరో స్టార్ డస్ట్ అవార్డులు స్టార్ డస్ట్ అవార్డ్ ఫర్ డ్రీం డైరెక్టర్ నామినేషన్
బిగ్ స్టార్ ఎంటర్ టైన్మెంట్ అవార్డులు బిగ్ స్టార్ మోస్ట్ ఎంటర్టైనింగ్ కామెడీ ఫిలిం గెలుచుకుంది
మూసివేయి

మూలాలు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.