తాడ్వాయి (ములుగు జిల్లా)
తెలంగాణ, జయశంకర్ భూపాలపల్లి జిల్లా లోని తాడ్వాయి మండలానికి కేంద్రం / From Wikipedia, the free encyclopedia
తాడ్వాయి, తెలంగాణ రాష్ట్రం, ములుగు జిల్లా,తాడ్వాయి మండలానికి చెందిన గ్రామం.[1]
ఇది సమీప పట్టణమైన వరంగల్ నుండి 91 కి. మీ. దూరంలో ఉంది. 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత వరంగల్ జిల్లాలో, ఇదే మండలంలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో దీన్ని కొత్తగా ఏర్పాటు చేసిన జయశంకర్ జిల్లా లోకి చేర్చారు.[2] ఆ తరువాత 2019 లో, కొత్తగా ములుగు జిల్లాను ఏర్పాటు చేసినపుడు ఈ గ్రామం, మండలంతో పాటు కొత్త జిల్లాలో భాగమైంది.[3]