ములుగు జిల్లా
తెలంగాణ లోని జిల్లాల్లో ఒకటి / From Wikipedia, the free encyclopedia
తెలంగాణలో ములుగు కేంద్రంగా ములుగు జిల్లా ఏర్పాటైంది. 2019 ఫిబ్రవరి 16న నారాయణపేట జిల్లాతో పాటు ఈ జిల్లా ఏర్పాటైంది.[1] జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్న ములుగు రెవెన్యూ డివిజన్ను విడదీసి, మొత్తం 9 మండలాలతో ఈ జిల్లాను ఏర్పాటుచేశారు.[2] జిల్లా జనాభా 2.94 లక్షలు.