![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/8/86/Turlapati_Kutumba_Rao.jpg/640px-Turlapati_Kutumba_Rao.jpg&w=640&q=50)
తుర్లపాటి కుటుంబరావు
ప్రముఖ పాత్రికేయుడు, రచయిత, వక్త / From Wikipedia, the free encyclopedia
తుర్లపాటి కుటుంబరావు (ఆగస్టు 10, 1933 - జనవరి 11, 2021) పాత్రికేయుడు, రచయిత, వక్త. చిన్నప్పడే నార్ల వేంకటేశ్వరరావు గారి సంపాదకీయాలకు ప్రభావితుడై పత్రికారచన ప్రారంభించాడు. 2002 లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో పాటు మరెన్నో పురస్కారాలు పొందాడు. తన 60ఏళ్ల పైబడిన పాత్రికేయవృత్తిలో 30, 40, 50, 60 వార్షికోత్సవాలను ప్రముఖుల చేతులమీదుగా జరుపుకొన్న వ్యక్తి. 1993 నాటికి పదివేలకు పైబడి బహిరంగసభలకు అధ్యక్షోపన్యాసాలు చేసి మంచి వక్తగా పేరుతెచ్చుకున్నాడు. అర్ధశతాబ్ది కాలంలో ఏ పదవి లేకుండా కేవలం ఉపన్యాసకుడుగా సభలకు అధ్యక్షునిగా వ్యవహరించిన వ్యక్తి తుర్లపాటి కుటుంబరావే నని గిన్నిస్ బుక్ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అధ్యక్షుడు పేర్కొన్నాడు. అవిభక్త ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్ర ప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ చివరి అధ్యక్షునిగా పనిచేశాడు.[1]
త్వరిత వాస్తవాలు తుర్లపాటి కుటుంబరావు, జననం ...
తుర్లపాటి కుటుంబరావు | |
---|---|
![]() తుర్లపాటి కుటుంబరావు | |
జననం | (1933-08-10)1933 ఆగస్టు 10 విజయవాడ |
మరణం | 2021 జనవరి 11(2021-01-11) (వయసు 87) విజయవాడ |
మరణ కారణం | గుండెపోటు |
నివాస ప్రాంతం | విజయవాడ |
వృత్తి | పాత్రికేయత |
పదవి పేరు | అధ్యక్షుడు, ఆంధ్ర ప్రదేశ్ గ్రంథాలయ పరిషత్ |
పదవీ కాలం | 2010-06-21 --2014-05-31 |
భార్య / భర్త | కృష్ణకుమారి |
పిల్లలు | ప్రేమజ్యోతి, జవహర్లాల్ నెహ్రూ |
తండ్రి | సుందర రామానుజరావు |
తల్లి | శేషమాంబ |
పురస్కారాలు | పద్మశ్రీ ప్రతిభా పురస్కార్ కళాప్రపూర్ణ గార్డియన్ ఆఫ్ తెలుగు ఇంటర్నేషనల్ మేన్ ఆఫ్ ది ఇయర్ వరల్డ్ లైఫ్ టైమ్ అఛీవ్మెంట్ అవార్డ్ నేషనల్ సిటిజన్ అవార్డ్ ప్రసిడెంట్స్ గోల్డ్ మెడల్ |
మూసివేయి