దక్షిణ అమెరికా
ప్రధానంగా దక్షిణార్థగోళంలో విస్తరించి ఉన్న ఒక ఖండం / From Wikipedia, the free encyclopedia
దక్షిణ అమెరికా (ఆంగ్లం :South America) ఒక ఖండము, ఇది అమెరికాల దక్షిణాన గలదు.దక్షిణ అమెరికా దక్షిణ గల మూడూ ఖండాలలో ఒకటీ. ఈ ఖండం ఉత్తర భాగంలో భూమద్యరేఖ దక్షిణభాగంలో మకర రేఖ పోతున్నవి.దక్షిణ అమెరికా, మద్యఅమెరికా'మెక్సికో లను కలిపి లాటీన్ అమెరికా అంటారు. ఈ ప్రాంతంలో గల భాషలకు మూలం లాటీన్ భాష.ఈ ఖండం ఉత్తరం వేపు వెడల్పుగా ఉండీ దక్షిణం వేపు పొయేకొలది సన్నబడూతుంది. ఈ ఖండం 12° ఉత్తరఅక్షాంశం నుండి 55° దక్షిణఅక్షాంశాల వరకు,35° తూర్పు రేఖాంశం నుండి 81° పడమర రేఖాంశాల వరకు విస్తరించిఉంది. ఇది పసిఫిక్, అట్లాంటిక్ మహాసముద్రాలు మద్య ఒక ఆకు వలె కనిపించును. ఇది మొత్తం పశ్చిమార్థగోళంలో గలదు. దీని పశ్చిమాన పసిఫిక్ మహాసముద్రం, ఉత్తరం, తూర్పున అట్లాంటిక్ మహాసముద్రం; వాయువ్యాన ఉత్తర అమెరికా, కరీబియన్ సముద్రం గలవు. దీని విస్తీర్ణం 17,840,000 చ.కి.మీ. లేదా భూభాగపు 3.5% గలదు. 2005 లో, దీని జనాభా 371,090,000 కన్నా ఎక్కువ.
విస్తీర్ణం | 17,840,000 చ.కి.మీ |
---|---|
జనాభా | 382,000,000 |
జనసాంద్రత | 21.4 / చ.కి.మీ. |
దేశాలు | 12 |
ఆధారితాలు | 3 |
ప్రాదేశికత | సౌత్ అమెరికన్ |
భాషలు | స్పానిష్, పోర్చుగీసు, ఫ్రెంచ్, డచ్, ఆంగ్లం, కెఛ్వా, ఐమారా, గ్వారానీ, మొదలగునవి. |
టైమ్ జోన్ | UTC -2:00 (బ్రెజిల్) నుండి UTC -5:00 (ఈక్వెడార్) |
పెద్ద నగరాలు | సావోపాలో బ్యూనస్ ఎయిర్స్ రియో డి జనీరో బొగాటా లీమా శాంటియాగో కారకస్ |