ఫుట్‌బాల్
From Wikipedia, the free encyclopedia
కాల్బంతి లేదా ఫుట్‌బాల్ (ఆంగ్లం: Football) అనునుది ఒక జట్టుక్రీడ. దీని అసలు పేరు అసోషియేషన్ ఫుట్‌బాల్. ఇందులో జట్టుకు 11 మంది ఆటగాళ్లు ఉంటారు. ప్రపంచంలో అతి విరివిగా అడే ఆట ఇది .[1] ఇది ఒక బంతి ఆట. దీర్ఘచతురస్రాకార మైదానాల మీద ఆడుతారు. మైదానం గడ్డిదైనా, మట్టి లేదా కృత్రిమమైనదైనా కావచ్చు. మైదానానికి రెండు చివర్ల గోల్పోస్టులుంటాయి. బంతిని గోల్‌పోస్టులోకి చేర్చి స్కోరు చెయ్యడం ఆట లక్ష్యం. బంతిని చేతితో తాకే హక్కు గోలుకీపరుకు మాత్రమే ఉంటుంది. మిగిలిన ఆటగాళ్ళందరూ, బంతిని కాలితో తన్నడం, తలతో కొట్టడం, లేక ఛాతీతో నియంత్రించడం చేస్తుంటారు. నియంత్రిత సమయంలో ఎక్కువ గోల్లు చేసిన జట్టు విజేత అవుతుంది. ఇఱు జట్లు సమాన సంఖ్యలో గోలులు చేస్తే పోటీ బట్టి ఆట డ్రాగా పరిగణించబడడం, లేక అధిక సమయంలోకి తీసుకు వెళ్ళడం జరుగుతుంది.
ఫుట్‌బాల్ నూతన అవతారం ఇంగ్లాండులో ఫుట్‌బాల్ ఆసోషియేషన్ 1863 వారిచే లిఖించబడింది. దీనిని అంతర్జాతీయ స్థాయిలో ఫీఫా (Fédération Internationale de Football Association - అంతర్జాతీయ అషోషియేషన్ ఫుట్‌బాల్ సంఘం), నియంత్రిస్తుంది.