మల్కాజ్గిరి లోక్‌సభ నియోజకవర్గం
From Wikipedia, the free encyclopedia
తెలంగాణ లోని 17 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. భారతదేశంలో మాల్కాజిగిరి అతిపెద్ద లోక్‌సభ నియోజకవర్గంగా ఉంది.[1]
2002లో ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా పార్లమెంటరీ నియోజకవర్గాల పునర్విభజన అమలు చేసిన తర్వాత ఈ నియోజకవర్గం 2009లో మల్కాజిగిరి లోక్‌సభ స్థానం ఏర్పడింది.[2]
మల్కాజిగిరి లోక్‌సభ స్థానం ఓటర్ల పరంగా దేశంలోనే అతిపెద్ద లోక్‌సభ స్థానంగా గుర్తింపు పొందింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ నుండి మల్కాజిగిరి 11 కిలోమీటర్ల దూరంలో ఉంది. 1965కు ముందు మల్కాజిగిరి గ్రామ పంచాయతీగా ఉండేది. 1985లో మున్సిపల్ కార్పొరేషన్‌గా అవతరించింది. నగర విస్తీర్ణం పెరుగుతూ పోవడంతో 2007లో మళ్లీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేశారు.
దేశ రక్షణ రంగానికి చెందిన ఎయిర్ ఫోర్స్, ఆర్మీ స్థావరాలతోపాటు పారిశ్రామిక, విద్యా రంగాలకు సంబంధించిన ప్రతిష్ఠాత్మక యూనిర్శిటీలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి.