ముహమ్మద్ ప్రవక్త
From Wikipedia, the free encyclopedia
ముహమ్మద్ విను (సహాయం·సమాచారం) (అరబిక్ : محمد), (మొహమ్మద్, మహమ్మద్ అని కూడా పలకవచ్చు), అరబ్బుల మత , రాజకీయ నాయకుడు , ఇస్లాం యొక్క చివరి ప్రవక్త. ముస్లింలు ఇస్లాంను, ఏకేశ్వరోపాసక మతముల ప్రకటనలో చివరి మెట్టుగా భావిస్తారు. ఇస్లాం పరంపర ఆదమ్ ప్రవక్తతో ప్రారంభమయినది. అనేక ప్రవక్తల గొలుసుక్రమంలో ముహమ్మద్ చివరివాడు. ముహమ్మద్ ప్రవక్త బోధనలకు ముందస్తుగా మూసా (మోజెస్) , ఈసా (యేసు) యొక్క బోధనలు ఉన్నాయి. ముస్లిమేతరులు సాధారణంగా ఇతనిని ఇస్లాంమత స్థాపకునిగా భావిస్తారు. కానీ ఇస్లాం మతం ప్రారంభమయినది ఆదిపురుషుడయిన ఆదమ్ ప్రవక్తతో. సాంప్రదాయిక ముస్లిం జీవితకర్తల ప్రకారము c.570 మక్కాలో జన్మించాడు , జూన్ 8, 632లో మదీనాలో మరణించారు. మక్కా , మదీనా నగరములు రెండూ అరేబియన్ ద్వీపకల్పములో ఉన్నాయి.
ముహమ్మద్ ప్రవక్తna | |
---|---|
జననం | ముహమ్మద్ ఇబ్న్ అబ్దుల్లా (అబ్దుల్లా కుమారుడైన ముహమ్మద్) సుమారు 570 |
మరణం | 8 జూన్ 632 (వయస్సు 62 లేదా 63) |
సమాధి స్థలం | Tomb under the Green Dome of మస్జిద్ ఎ నబవి at మదీనా, హిజాజ్, ప్రస్తుత సౌదీ అరేబియా |
ఇతర పేర్లు | Abu al-Qasim (Kunya), Also see Names of Muhammad |
జీవిత భాగస్వామి | భార్యలు: ఖదీజా (595–619) సౌదా బింత్ జమా (619–632) |
పిల్లలు | Sons: al-Qasim, `Abd-Allah, Ibrahim Daughters: Zainab, Ruqayyah, Umm Kulthoom, ఫాతిమా జహ్రా |
తల్లిదండ్రులు | Father: `Abd Allah ibn `Abd al-Muttalib Mother: Aminah bint Wahb |
బంధువులు | Ahl al-Bayt |