ముఖ్యమంత్రి
భారతదేశంలోని రాష్ట్రానికి లేదా, కేంద్ర పాలిత ప్రాంతానికి ప్రభుత్వాధినేత / From Wikipedia, the free encyclopedia
భారతదేశంలోని 28 రాష్ట్రాలుకు, కొన్నిసార్లు కేంద్రపాలిత ప్రాంతం (యుటి)లో ఎన్నికైన ప్రభుత్వాధినేత ముఖ్యమంత్రి. [1] ప్రస్తుతం, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్ (ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి) పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతాలలో మాత్రమే ముఖ్యమంత్రులు పనిచేస్తున్నారు. భారత రాజ్యాంగం ప్రకారం, గవర్నర్ ఒక రాష్ట్రానికి అధిపతి, కానీ వాస్తవ కార్యనిర్వాహక అధికారం ముఖ్యమంత్రిపై ఉంటుంది.
ముఖ్యమంత్రి (భారత రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు) | |
---|---|
విధం |
|
రకం | Head of State Government |
Abbreviation | CM |
సభ్యుడు | State legislature of that state |
రిపోర్టు టు |
|
అధికారిక నివాసం | Respective state capitals |
Nominator | Members of legislative assembly |
నియామకం | The Governor by convention, based on appointee's ability to command confidence in the legislative assembly |
కాల వ్యవధి | At the pleasure of the Governor No restriction on renewal |
స్థిరమైన పరికరం | Article no. 163 and 164 , Constitution of India |
ఉప | Deputy chief minister (in some states) |
జీతం | ₹4,00,000 (US$5,000) (incl. allowances) per month |
వెబ్సైటు | Chief ministers of India |
ఒక రాష్ట్రంలో రాష్ట్ర శాసనసభ లేదా విధానసభకు ఎన్నికల తరువాత, రాష్ట్ర గవర్నరు సాధారణంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అథ్యధిక స్థానాలు పొందిన పార్టీని (లేదా సంకీర్ణాన్ని) ఆహ్వానిస్తాడు. శాసనసభకు సమిష్టిగా బాధ్యత వహించే మంత్రుల మండలి ముఖ్యమంత్రిని గవర్నరు నియమిస్తాడు. అతనిచే గవర్నరు ప్రమాణం చేయిస్తాడు. వెస్ట్మిన్స్టర్ వ్యవస్థ ఆధారంగా, వారు శాసనసభ విశ్వాసాన్ని నిలుపుకున్నందున, ముఖ్యమంత్రి పదవీకాలం శాసనసభ జీవిత కాలం, గరిష్టంగా ఐదు సంవత్సరాల వరకు ఉంటుంది. ముఖ్యమంత్రి పదవీకాలానికి పరిమితులు లేవు.[2] ఎన్నిసార్లైనా ఒక ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వ మంత్రుల మండలికి నేతృత్వం వహించవచ్చు. ఉప ముఖ్యమంత్రిని మంత్రుల మండలిలో భాగంగా నియమించబడవచ్చు. ముఖ్యమంత్రి సాధారణంగా ప్రధాన కార్యదర్శిని ఎంపిక చేస్తాడు. రాష్ట్ర కేబినెట్ మంత్రులకు, రాష్ట్ర మంత్రులకు కూడా శాఖలను కేటాయించవచ్చు. వారు తమ రాష్ట్రంలోని అధికారులను బదిలీ చేయడం, సస్పెండ్ చేయడం లేదా పదోన్నతి కల్పించడం వంటివి చేయమని ప్రధాన కార్యదర్శిని కూడా నిర్దేశిస్తాడు.