మూల కణం
From Wikipedia, the free encyclopedia
మూల కణం (ఆంగ్లం: Stem cell) అనేది బహుకణ జీవుల్లో అనంతంగా పెరుగుతూ ఉండే కణాలు. ఒక మూల కణం నుంచి కణ విచ్ఛిత్తి ప్రక్రియ ద్వారా మరిన్ని మూలకణాలు ఉత్పత్తి అవుతూ ఉంటాయి.[1]
1960వ దశకంలో కెనడా లోని టొరంటో విశ్వవిద్యాలయం, ఒంటారియో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చెందిన పరిశోధకులు జీవకణాల మీద చేసిన ప్రయోగాలతో మూలకణాల మీద పరిశోధనలు ప్రారంభం అయ్యాయి.[2][3] 2016 నాటికి బాగా గుర్తింపు పొందిన మూలకణ చికిత్స హెమటోపాయిటిక్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ మాత్రమే.[4] దీన్ని మొదటిసారిగా 1958లో ఫ్రెంచి అంకాలజిస్టు అయిన జార్జెస్ మాథే చేశాడు.