From Wikipedia, the free encyclopedia
రాజా హరిశ్చంద్ర (ఆంగ్లం :Raja Harishchandra) (హిందీ : राजा हरिश्चंद्र ), 1913 చెందిన ఒక హిందీ మూకీ సినిమా. దీని దర్శకుడు దాదాసాహెబ్ ఫాల్కే. ఇది భారతీయ పూర్తినిడివి గల మొదటి సినిమా.[1] రామాయణ మహాభారతాల్లో పేర్కొనబడిన రాజు హరిశ్చంద్రుడి గూర్చి ఈ సినిమా.
రాజా హరిశ్చంద్ర | |
---|---|
దర్శకత్వం | దాదాసాహెబ్ ఫాల్కె |
రచన | దాదాసాహెబ్ ఫాల్కె రంచోడ్బాయి ఉదయ్రామ్(కథ) |
నిర్మాత | దాదాసాహెబ్ ఫాల్కె ఫాల్కే సినిమా కొరకు |
తారాగణం | డి.డి. డబ్కె పి.జి. సానె |
ఛాయాగ్రహణం | త్ర్యంబక్ బి. తెలాంగ్ |
విడుదల తేదీ | 1913 నాటి సినిమాలు |
దేశం | బ్రిటీషు ఇండియా |
భాష | మూకీ సినిమా |
సత్యసంధుడైన హరిశ్చంద్రుడి చుట్టూ తిరిగే ఈ కథ, తన రాజ్యం, తన కుటుంబం పోగొట్టుకొని, విశ్వామిత్రుడికిచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి, హరిశ్చంద్రుడు పడే తపన, యాతన వర్ణించే చిత్రం.
ఫాల్కే, రాజా రవివర్మ చిత్రాలచే ప్రభావితుడై నిర్మించిన సినిమా. ఇందులో పనిచేసినవాళ్ళంతా పురుషులే. స్త్రీపాత్రలకు కూడా పురుషులే పోషించారు. ఆ కాలంలో సినిమాలంటే చాలా తక్కువగా, ఏహ్యంగా చూసేవారు. అందులోనూ నటీనటులను ఇంకా ఈసడించుకునే కాలం. స్త్రీలెవరూ ఈ సినిమాలో పని చేయడానికి రాలేదు.[2] ఈ సినిమా దాదాపు 40 నిముషాలపాటు నడిచే నిడివి గలది.[3]
2008 లో, 'హరిశ్చంద్రాచి ఫ్యాక్టరీ' అనే సినిమా, రాజా హరిశ్చంద్ర సినిమా నిర్మాణానికి మూలం చేసుకుని నిర్మింపబడినది. ఆ కాలంలో సినిమాలంటేనే ఒక జాడ్యంలా చూసేవారు. "సినిమాలో నటుస్తున్నారని చెప్పకండి, హరిశ్చంద్ర ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారని చెప్పండి" అని ఫాల్కే తన నటవర్గానికి నచ్చజెప్పాడు.[4]
ఈ సినిమా మొదటిసారిగా 1913, మే 3న ప్రజలకొరకు ప్రదర్శించారు.[5] బాంబే, గిర్గావ్ లోని కొరోనేషన్ సినిమా దీనికి వేదిక. హాలు బయట ప్రజలంతా బారులు తీరి నిలబడ్డారు.[2] భారత్ లో నిర్మించిన మొదటి సినిమా కాబట్టి ప్రేక్షకులకు ఇదో వింత అనుభూతి. ఈ సినిమా హిట్టయింది. ప్రజాదరణనూ పొందింది. ఈ సినిమాను గ్రామీణ ప్రాంతాలలోనూ ప్రదర్శించడానికి ఫాల్కే ఏర్పాట్లు చేసాడు. దీని విజయంతో, ఫాల్కే చరిత్ర సృష్టించాడు. నిర్మాతగా దర్శకుడిగా స్థిరపడ్డాడు. భారతీయ సినిమాలకు ఆద్యుడుగానూ నిలిచాడు.[3]
నిజానికి దీని నిడివి నాలుగు రీళ్ళు, కానీ జాతీయ సినిమా భద్రాలయం పుణే లో దీని మొదటి, ఆఖరి రీళ్ళు గలవు. కొందరు సినిమా చరిత్రకారుల ప్రకారం ఈ భద్రపరచబడిన రీళ్ళు 1917 లో ఇదే పేరుతో నిర్మించిన చిత్రానికి చెందినవి.[6][7]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.