వికీపీడియా:ఆధారం కావాలి
From Wikipedia, the free encyclopedia
వికీపీడియా లోని సమాచారం ధృవీకరించదగినదని నిర్ధారించుకోవడానికి, మూలాల్లేని సమాచారాన్ని ఎవరైనా ప్రశ్నించడానికీ వికీపీడియా ఒక మార్గాన్ని అందిస్తోంది. మీరు చేర్చిన సమాచారానికి మూలం కావాలనే మూసను ఎవరైనా చేర్చితే, దయచేసి నమ్మదగిన మూలాన్ని ఇవ్వండి. అవసరమైతే చర్చించండి.
ఇదొక సమాచారం పేజీ. ఇది వికీపీడియా విధానం గానీ, మార్గదర్శకం గానీ కాదు. ఇది Wikipedia:Verifiability policy. ఇందులో ఏకాభిప్రాయం, అర్థ స్వీకరణ లలో విభిన్న స్థాయిలు ఉండవచ్చు. |
సవరణ పెట్టె ఎగువన ఉండే మెనూ నుండి అనే డ్రాప్-డౌన్లో తగు అంశాణ్ని ఎంచుకుని మూలాన్ని చేర్చవచ్చు. మార్కప్లో, ref ట్యాగ్లను ఉపయోగించి మానవీయంగా జోడించవచ్చు. మూలాలను ఉదహరించడానికి మరింత విస్తృతమైన మార్గాలు కూడా ఉన్నాయి.
వికీ మార్కప్లో, ఒక సాధారణ {{Citation needed}} అనే
మూసను గానీ, లేదా మరింత సమగ్రమైన {{Citation needed|reason=Your explanation here|date=ఫిబ్రవరి 2024}}
గానీ చేర్చి మీరు, పాఠ్యం లోని సమాచారాన్ని ప్రశ్నించవచ్చు. ఇందుకు {{ఆధారం}}
, {{fact}},
{{cn}}
అనే మూసలను కూడా వాడవచ్చు. ఇవన్నీ కూడా కిందివిధంగా చూపిస్తాయి:
ఉదాహరణ: 87 శాతం గణాంకాలన్నీ అప్పటికప్పుడు సృష్టించినవే.[citation needed]
వ్యాసాలలో మూలాలను జోడించడం గురించిన సమాచారం కోసం, సహాయం:ప్రారంభకుల కోసం రెఫరెన్సింగ్ చూడండి. ఈ టెంప్లేట్ సందేశాలను ఎప్పుడు తీసివేయాలి అనే సమాచారం కోసం, సహాయం:నిర్వహణ మూసల తొలగింపు చూడండి.