వికీపీడియా:ఈ వారపు వ్యాసం
From Wikipedia, the free encyclopedia
తెలుగు వికీపీడియాలో ఉన్న మంచి మంచి వ్యాసాలను వెలికితీసి, పదిమందికీ చూపించాలనేదే "ఈ వారపు వ్యాసాల" లక్ష్యం. ఈ విధానం 2007 జూన్ లో(23 వారంలో) మొదటిగా సుడోకు వ్యాసంతో ప్రారంభమైంది. అంతకు ముందు విశేష వ్యాసం అనే శీర్షికతో అప్పుడప్పుడు మొదటిపేజీలో మంచి వ్యాసాన్ని ప్రదర్శించేవారు. విశేష వ్యాస ప్రక్రియ ఆగష్టు 2005న మొదలయింది. నవంబర్ 14 2005న గోదావరి వ్యాసంతో విశేష వ్యాసాల పరంపర మొదలయింది. ఈ వారం వ్యాసం శీర్షిక 2012 జూన్ 4 తో 6 వ సంవత్సరంలోకి అడుగిడింది
- తొలి ఈ వారపు వ్యాసం
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/f/ff/Sudoku-by-L2G-20050714.svg/320px-Sudoku-by-L2G-20050714.svg.png)
![]() | ఈ పేజీ వికీపీడియా మార్గదర్శకాలలో ఒకటి. సర్వామోదం పొందిన ప్రమాణాలను వివరించే పేజీ ఇది. చాలామంది వీటిని ప్రామాణికంగా స్వీకరించారు. అయితే ఇవి శిలాక్షరాలేమీ కాదు. ఈ పేజీలో మార్పులు అవసరమని భావిస్తే చొరవగా ముందుకు వచ్చి తగు మార్పులు చెయ్యండి. కాకపోతే, ఆ మార్పులు విస్తృతంగా ఆమోదిస్తారని మీరు భావిస్తేనే చెయ్యండి. సందేహాస్పదంగా ఉంటే, ముందుగా ఆ మార్పులను చర్చా పేజీ లో ప్రస్తావించండి. |
సుడోకు ఒక లాజిక్-భరితమైన గళ్ళ లో ఆంకెలు నింపే ప్రహేళిక. ఈ ప్రహేళికను సాధించడము ఎలాగ అంటే ఒక 9x9 గళ్ళ చతురస్రము లో ప్రతీ అడ్డు వరస, నిలువు వరుస, అందులో ఉన్న తొమ్మిది 3x3 చతురస్రాలలో 1 నుండి 9 వరకు నింపడము. ప్రశ్న ప్రహేళికలో కొన్ని అంకెలు అక్కడక్కడా నింపబడి ఉంటాయి. పూర్తయిన పజిలు ఒక రకమైన లాటిన్ చతురస్రము. లియొనార్డ్ ఆయిలర్ అభివృద్ది చేసిన ఈ లాటిన్ చతురస్రాల నుండి ఈ ప్రహేళిక పుట్టింది అంటారు కాని, ఈ ప్రహేళికను కనుగొన్నది మాత్రము అమెరికాకు చెందిన హావర్డ్ గార్నస్. ఈ ప్రహేళికను 1979లో డెల్ మ్యాగజిన్లో నంబర్ ప్లేస్ మొదటి సారి ప్రచురితమైనది. 1986లో నికోలాయి దీనిని సుడోకు అనే పేరుతో ప్రాచుర్యాన్ని తీసుకొచ్చాడు. 2005లో ఈ పజిలు అంతర్జాతీయంగా ఖ్యాతిని గడించింది. "సుడోకు" జపనీసు వాక్యానికి సంక్షిప్త నామము, "సూజీ వ డొకుషిన్ ని కగీరూ", అనగా "ఒక్కొక్క అంకె ఒక్కొక్క సారి మాత్రమే రావలెను" పూర్తివ్యాసం : పాతవి