వికీమీడియా కామన్స్
స్వేచ్ఛా-వినియోగ మాధ్యమ కోశం / From Wikipedia, the free encyclopedia
వికీమీడియా కామన్స్ (లేదా కామన్స్) అనేది స్వేచ్ఛా-వినియోగ చిత్రాలు, శబ్దాలు, ఇతర మీడియా, జెసన్ (JSON) [1] ఫైళ్ళ యొక్క ఆన్లైన్ నిల్వ. ఇది వికీమీడియా ఫౌండేషన్ వారి ప్రాజెక్టు .
త్వరిత వాస్తవాలు Type of site, Owner ...
Type of site | ఫైళ్ల నెలవు |
---|---|
Owner | వికీమీడియా ఫౌండేషన్ |
Created by | వికీమీడియా సముదాయం |
Commercial | No |
Registration | ఐచ్ఛికం (ఫైళ్ళు ఎక్కించాలంటే అవసరం) |
Launched | సెప్టెంబరు 7, 2004; 19 సంవత్సరాల క్రితం (2004-09-07) |
Current status | ఆన్లైన్ |
Content license | స్వేఛ్ఛాయుత |
మూసివేయి
వికీమీడియా కామన్స్ లోని ఫైళ్ళను అన్ని వికీమీడియా ప్రాజెక్టులలోను - వికీపీడియా, విక్షనరీ, వికీబుక్స్, వికీవాయేజ్, వికీస్పెసిస్, వికీసోర్స్, వికీన్యూస్ మొదలైన ప్రాజెక్టుల్లో - అన్ని భాషల లోనూ ఉపయోగించవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. 2019 నాటికి, ఈ నిల్వలో ఐదున్నర కోట్లకు పైగా ఫైళ్ళు ఉన్నాయి.[2] 2013 జూలైలో, కామన్స్‌లో మార్పుచేర్పుల సంఖ్య 10 కోట్లకు చేరుకుంది.[3]