విషువత్తు
రాత్రి, పగలు సమానంగా ఉండే రోజు / From Wikipedia, the free encyclopedia
భూమి భ్రమణాక్షం దాని పరిభ్రమణ కక్ష్య తలానికి లంబంగా కాక 23.4° కోణంలో వాలుగా ఉంటుంది. అంటే భూమి కక్ష్యా తలం, జ్యోతిశ్చక్ర (ఎక్లిప్టిక్) తలానికి 23.4° కోణంలో ఉంటుంది.[2] భూమధ్య రేఖను ఖగోళానికి పొడిగిస్తే ఆ ఖగోళ మధ్య రేఖ జ్యోతిశ్చక్రాన్ని రెండు స్థానాల వద్ద ఖండిస్తుంది. వీటినే విషువత్తులు అంటారు. ఇంగ్లీషులో ఈక్వినాక్స్ అంటారు. జ్యోతిశ్చక్రం వెంట ప్రయాణిస్తున్నట్లుగా కనిపించే సూర్యుడు ఖగోళ భూమధ్య రేఖను ఈ విషువత్తుల వద్దనే దాటుతాడు.[3] సంవత్సరంలో ఇది రెండు సార్లు జరుగుతుంది. దక్షిణం నుండి ఉత్తర దిశగా దాటే బిందువును వసంత విషువత్తు (వెర్నల్ ఈక్వినాక్స్) అని అంటారు. ఉత్తరం నుండి దక్షిణానికి దాటే బిందువును శరద్ విషువత్తు (ఆటమల్ ఈక్వినాక్స్) అనీ అంటారు.[4]
భూమిపై విషువత్తులు, ఆయనములు వచ్చు UT తేదీ, సమయం[1] | ||||||||
---|---|---|---|---|---|---|---|---|
సంఘటన | విషువత్తు | ఆయనము | విషువత్తు | ఆయనము | ||||
నెల | మార్చి | జూన్ | సెప్టెంబరు | డిసెంబరు | ||||
సంవత్సరం | ||||||||
రోజు | సమయం | రోజు | సమయం | రోజు | సమయం | రోజు | సమయం | |
2010 | 20 | 17:32 | 21 | 11:28 | 23 | 03:09 | 21 | 23:38 |
2011 | 20 | 23:21 | 21 | 17:16 | 23 | 09:04 | 22 | 05:30 |
2012 | 20 | 05:14 | 20 | 23:09 | 22 | 14:49 | 21 | 11:12 |
2013 | 20 | 11:02 | 21 | 05:04 | 22 | 20:44 | 21 | 17:11 |
2014 | 20 | 16:57 | 21 | 10:51 | 23 | 02:29 | 21 | 23:03 |
2015 | 20 | 22:45 | 21 | 16:38 | 23 | 08:20 | 22 | 04:48 |
2016 | 20 | 04:30 | 20 | 22:34 | 22 | 14:21 | 21 | 10:44 |
2017 | 20 | 10:28 | 21 | 04:24 | 22 | 20:02 | 21 | 16:28 |
2018 | 20 | 16:15 | 21 | 10:07 | 23 | 01:54 | 21 | 22:23 |
2019 | 20 | 21:58 | 21 | 15:54 | 23 | 07:50 | 22 | 04:19 |
2020 | 20 | 03:50 | 20 | 21:44 | 22 | 13:31 | 21 | 10:02 |
వసంత విషువత్తును జ్యోతిశ్చక్రపు ఎసెండింగ్ నోడ్ అని, మేషపు తొలి బిందువు అనీ కూడా అంటారు. అలాగే శరద్ విషువత్తును డిసెండింగ్ నోడ్ అని అంటారు.
సంవత్సరానికి రెండు సార్లు వచ్చే విషువత్తు రోజుల్లో (మార్చి 20/21, సెప్టెంబరు 22/23) భూమధ్యరేఖాతలంలో సూర్యుని కేంద్రం ఉంటుంది. ఆ రోజున భూఅక్షం యొక్క వంపు సూర్యునికి దగ్గరగాగానీ, దూరంగాగానీ ఉండక సమానదూరంలో ఉంటుంది. విషువత్తు రోజున భూమిపైన రాత్రీ, పగళ్ళ నిడివి సమానంగా ఉంటుంది. ఇవి రెండు రకాలు వసంత విషువత్తు (మార్చిలో), శరత్ విషువత్తు (సెప్టెంబరులో).