శ్రీ ముఖలింగేశ్వర దేవాలయం
హిందూ దేవాలయం / From Wikipedia, the free encyclopedia
శ్రీ ముఖలింగేశ్వర దేవాలయం శ్రీకాకుళం జిల్లాలో జలుమూరు మండలంలోని ముఖలింగం గ్రామంలో ఉంది.[1] ఇది శ్రీకాకుళం నుండి 46 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడ చరిత్ర ప్రసిద్ధినందిన ముఖలింగేశ్వరాస్వామి, భీమేశ్వరాస్వామి, సోమేశ్వరస్వామి ఆలయాలున్నాయి. ఇవి చక్కని శిల్పాలతో కనుల పండుగ చేస్తాయి. ఈ గ్రామం మామిడి తోటలు, శోభాయమానంగా అగుపించే కొబ్బరి తోటలకు ఆలవాలం. దేవాలయ పరిసరాలలో ఉన్నంతసేపూ భగవంతునిపై భక్తిప్రవత్తులతోపాటు మనసుకు ఆహ్లాదం కలుగుతుంది.
త్వరిత వాస్తవాలు శ్రీ ముఖలింగేశ్వర దేవాలయం, భౌగోళికాంశాలు : ...
శ్రీ ముఖలింగేశ్వర దేవాలయం | |
---|---|
![]() శ్రీ ముఖలింగేశ్వర దేవాలయం | |
భౌగోళికాంశాలు : | 18.6°N 83.9°E / 18.6; 83.9 |
పేరు | |
ప్రధాన పేరు : | శ్రీ ముఖలింగేశ్వర దేవాలయం |
దేవనాగరి : | श्री मुखलिम्गेश्वर देवालय |
ప్రదేశం | |
దేశం: | భారత దేశం |
రాష్ట్రం: | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా: | శ్రీకాకుళం జిల్లా |
ప్రదేశం: | శ్రీముఖలింగం |
ఆలయ వివరాలు | |
ప్రధాన దైవం: | శ్రీముఖలింగేశ్వరస్వామి |
ముఖ్య_ఉత్సవాలు: | శివరాత్రి |
నిర్మాణ శైలి, సంస్కృతి | |
వాస్తు శిల్ప శైలి : | చాణుక్య శిల్పకళ |
దేవాలయాలు మొత్తం సంఖ్య: | 3 |
శిలాశాసనం: | ఉన్నవి |
ఇతిహాసం | |
నిర్మాణ తేదీ: | సా.శ.573-1058 |
మూసివేయి
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/te/thumb/d/d1/SrimukalingamTemple.jpg/640px-SrimukalingamTemple.jpg)