సోక్రటీసు
గ్రీకు తత్వవేత్త / From Wikipedia, the free encyclopedia
సోక్రటీస్ (ఆంగ్లం : Socrates: గ్రీకు | Σωκράτης ), Sōkrátēs; c. 469 BC–399 BC[1]) ( క్రీ.పూ 470 -క్రీ.పూ 399) గ్రీకు దేశంలోని ఏథెన్సుకు చెందిన తత్వవేత్త. పాశ్చాత్య తత్వానికి ఆద్యునిగా భావిస్తారు. ఈయన సృష్టించిన సోక్రటీసు విధి/పద్ధతి చాలా ప్రాచుర్యం చెందినది. ఈయన సృష్టించిన తత్వశాస్త్ర విధానంలో సాగే బోధనా విధానంలో ఉపాధ్యాయుడు అడిగే ప్రశ్న విద్యార్థి మనసులోని మంచి సమాధానాన్ని, ప్రాథమిక భావనల్ని బయల్పరిచేదిగా ఉండాలి.
త్వరిత వాస్తవాలు పాశ్చాత్య తత్వము ప్రాచీన తత్వము, పేరు: ...
పాశ్చాత్య తత్వము ప్రాచీన తత్వము | |
---|---|
సోక్రటీసు | |
పేరు: | Socrates (Σωκράτης) |
జననం: | c. 469 / 470 BC[1] |
మరణం: | 399 BC |
సిద్ధాంతం / సంప్రదాయం: | Classical Greek |
ముఖ్య వ్యాపకాలు: | en:epistemology, en:ethics |
ప్రముఖ తత్వం: | en:Socratic method, en:Socratic irony |
ప్రభావితమైనవారు: | ప్లేటో, అరిస్టాటిల్, en:Aristippus, en:Antisthenes en:Western philosophy |
మూసివేయి
సోక్రటీసు పాశ్చాత్య తత్వశాస్త్రం పై బలమైన ముద్ర వేశాడు. ముఖ్యంగా ప్లేటో, అరిస్టాటిల్ పై ఈయన ప్రభావం ఎంతో ఉంది. నీతి నియమాలు, తర్క శాస్త్రంలో ఈయన ఎనలేని కృషి చేశాడు.