![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/2/20/Sonia_Gandhi_2014_%2528cropped%2529.jpg/640px-Sonia_Gandhi_2014_%2528cropped%2529.jpg&w=640&q=50)
సోనియా గాంధీ
రాజకీయ నాయకురాలు / From Wikipedia, the free encyclopedia
సోనియా గాంధీ ( pronunciation) ; అసలు పేరు అడ్విగె ఆంతోనియా మాయినో[2][3][4]. ఇటలీకి చెందిన ఈమె భారతదేశానికి చెందిన రాజకీయ నాయకురాలు. 1946 డిసెంబరు 9న జన్మించారు సోనియా. 1998 - 2017 నుండి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి సోనియా అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు.
సోనియా గాంధీ[1] | |
---|---|
![]() సోనియా గాంధీ | |
జననం | డిసెంబరు 9 1946 లూసియానా, ఇటలీ. |
పౌరసత్వం | ఇటలీ (1946 - 1983) భారతదేశం (1983 - ప్రస్తుతం) |
వృత్తి | రాజకీయ నాయకురాలు |
పదవీ కాలం | 1998 - 2017 |
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ |
భాగస్వాములు | రాజీవ్ గాంధీ |
పిల్లలు | రాహూల్ గాంధీ, ప్రియాంక గాంధీ |
బంధువులు | నెహ్రూ-గాంధీ కుటుంబం |
భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ భార్య ఈమె. 1991లో రాజీవ్ గాంధీ హత్యతరువాత కాంగ్రెస్ నాయకులు ఆమెను ప్రధాని పదవి తీసుకోమని అడుగగా ఆమె నిరాకరించారు[5].1997లో రాజకీయ రంగప్రవేశం చేసిన సోనియా 1998లో కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలిగా ఎన్నికయారు.
2004 నుంచి సోనియా గాంధీ లోక్ సభలోని యునైటెడ్ ప్రాగ్రెసివ్ ఎలియస్స్ కు అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. సెప్టెంబరు 2010లో వరుసగా నాలుగోసారి కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలిగా ఎంపికవడంతో 125 ఏళ్ళ చరిత్రగల కాంగ్రెస్ పార్టీకి అతి ఎక్కువ కాలం అధ్యక్షురాలిగా వ్యవహరించిన వారిగా ఆమె చరిత్ర సృష్టించారు[6]. ఆమె విదేశీయురాలు కావడం ఎన్నో వివాదాలకు కారణమైంది[7][8]. ఇటలీకి చెందిన వ్యాపారవేత్త ఒట్టివో కాట్రొచితో స్నేహం కూడా వివాదాలకు కారణమైంది. ఒట్టొవో బోఫోర్స్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్నారు[9]. ఈమెకు ముందు కాంగ్రెస్ కు కొంతమంది విదేశీయులు అధ్యక్షులుగా ఉన్నా స్వాతంత్ర్యం తరువాత ఈమే మొదటి విదేశీ అధ్యక్షురాలు.[10]