స్వాతి తిరునాళ్
From Wikipedia, the free encyclopedia
శ్రీ స్వాతి తిరునాళ్ రామవర్మ (ఏప్రిల్ 16, 1813 - డిసెంబరు 25, 1846) కేరళలోని తిరువంకూరు మహారాజు, గొప్ప భక్తుడు, రచయిత. ఇతడు మహారాజా రామవర్మకు, మహారాణి గౌరీ లక్ష్మీబాయిలకు జన్మించాడు. స్వాతి నక్షత్రాన జన్మించినందు వలన కుమారునికి స్వాతి తిరునాళ్ అని నామకరణం చేశారు. యువరాజు జన్మించిన నాలుగు నెలలలోనే (29 జూలై, 1813న) రాజ్యానికి అధిపతిగా ప్రకటించారు. తిరువాన్కూరు సంస్థానాన్ని (కేరళ) పరిపాలించిన రాణి లక్ష్మీ బాయికి లేక లేక కలిగిన కుమారుడే స్వాతి తిరునాళ్ రామ వర్మ. అది బ్రిటిష్ వారు భారత దేశంలో రాజ్య విస్తరణ చేస్తున్న కాలం. బ్రిటిష్ వారి రాజ్య విస్తరణలో భాగంలో తెచ్చిన చట్ట ప్రకారం రాణిగారి మగ సంతానమే రాజ్యాధికారానికి అర్హులగుదురు. రాణిగారికి మగ సంతానం కొరకు రాజ్యమంతా ఎదురు చూస్తున్న సమయంలో రాణి గారికి కలిగిన మగ సంతానమే స్వాతి తిరునాళ్ రామ వర్మ.
త్వరిత వాస్తవాలు Svāti Tirunāḷ Rāma Varmaస్వాతి తిరునాళ్ రామ వర్మ, Reign ...
Svāti Tirunāḷ Rāma Varmaస్వాతి తిరునాళ్ రామ వర్మ | |||||
---|---|---|---|---|---|
Maharaja of Travancore | |||||
Reign | 1829-1846 | ||||
Coronation | 1813 | ||||
Investiture | 1829 | ||||
Predecessor | Gowri Parvati Bayi గౌరి పార్వతి బాయి | ||||
Successor | Uthram Thirunalఉత్రం తిరునాళ్ | ||||
జననం | (1813-04-16)1813 ఏప్రిల్ 16 Travancore తిరువాన్కూరు | ||||
మరణం | 1846 డిసెంబరు 27(1846-12-27) (వయసు 33) Travancore/తిరువాన్కూరు | ||||
| |||||
House | Travancore royal family తిరువాన్కూరు రాజ కుటుంబము | ||||
రాజవంశం | Kulasekhara కులశేఖర | ||||
తండ్రి | Changanassery Laxmipuram Palace Raja Raja Varma Koil Thampuran చంగనచెర్రి లక్ష్మీపురం పాలెస్ రాజ రాజ వర్మ కోయిల్ తంపురన్ | ||||
తల్లి | Gowri Lakshmi Bayi గౌరి లక్ష్మి బాయి | ||||
మతం | Hinduism హిందు |
మూసివేయి