![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/b/bc/Prabhupada_singing_%2528Germany_1974%2529.jpg/640px-Prabhupada_singing_%2528Germany_1974%2529.jpg&w=640&q=50)
ఎ.సి. భక్తివేదాంత స్వామి ప్రభుపాద
From Wikipedia, the free encyclopedia
అభయ్ చరణారవింద భక్తివేదాంత స్వామి ప్రభుపాద (1896 సెప్టెంబరు 1 - 1977 నవంబరు 14[1] ) ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ (ISKCON) [2][2] సంస్థాపకాచార్యులు.[1][3][4] ఇస్కాన్ అనుచరులు భక్తివేదాంత స్వామి ప్రభుపాదను చైతన్య మహాప్రభు ప్రతినిధిగా, దూతగా చూస్తారు.[5] ఈ సంఘం "హరేకృష్ణ ఉద్యమం"గా ప్రసిద్ధి పొందింది.[6]
ఎ.సి. భక్తివేదాంత స్వామి ప్రభుపాద | |
---|---|
![]() 1974లో జర్మనీలో ప్రభుపాదులు | |
శీర్షిక | అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం సంస్థాపకాచార్యులు. |
వ్యక్తిగతం | |
జననం | అభయ్ చరణ్ దే (1896-09-01)1896 సెప్టెంబరు 1 కలకత్తా, బెంగాల్ ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా. |
మరణం | 1977 నవంబరు 14(1977-11-14) (వయసు 81) బృందావన్, భారతదేశము |
చివరి మజిలీ | భక్తి వేదాంతస్వామి సమాధి, బృందావనం |
మతం | గౌడీయ వైష్ణవం, హిందూమతము |
జాతీయత | భారతీయుడు |
ఇతర పేర్లు | అభయ చరణారవింద,అభయ చరణ్ దే |
Senior posting | |
Based in | బృందావన్, భారతదేశము |
Period in office | 1966 - 1977 |
Predecessor | భక్తిసిద్ధాంత సరస్వతీ ఠాగూరు |
Initiation | దీక్ష–1932, సన్యాసం–1959 |
Post | గురువు, సన్యాసి, ఆచార్యుడు |
Website | Official Website of ISKCON |
కలకత్తాలోని ఓ వ్యాపారస్తుల కుటుంబంలో జన్మించిన ఈయన స్కాటిష్ చర్చ్ కళాశాలలో చదివాడు. ఒక చిన్న మందుల సంస్థలో పనిచేస్తూ భక్తిసిద్ధాంత సరస్వతి స్వామిని కలిసి ఆయన శిష్యుడైనాడు. 1959 లో పదవీ విరమణ చేశాక సంసారాన్ని విడిచిపెట్టి సన్యాసి అయ్యాడు. వైష్ణవ గ్రంథాలపైన వ్యాఖ్యానాలు రాయడం మొదలుపెట్టాడు. వైష్ణవ సన్యాసిగా దేశ విదేశాలు తిరుగుతూ 1966 లో ఇస్కాన్ ను స్థాపించి, దాని ద్వారా గౌడీయ వైష్ణవ సిద్ధాంతాన్ని వ్యాప్తి చేశాడు. ఈయనను చాలామంది అమెరికన్ మత పండితులు అంగీకరించినా, కల్ట్ ను వ్యతిరేకించే వారు మాత్రం విమర్శించారు. నల్లవారిపై ఆయన అభిప్రాయాలు, నిమ్నకులాల వారు, యూదుల పట్ల వివక్ష, హిట్లర్ నేరాలపై ఆయన ధృక్పథం విమర్శలకు గురయ్యాయి.[7][8][9]