కార్బన్ మొనాక్సైడ్
From Wikipedia, the free encyclopedia
కార్బన్ మొనాక్సైడ్ రంగు, వాసన, రుచి లేనటువంటి, గాలికన్న బరువైన వాయువు. వాతావరణంలో 35ppm మించి ఉన్నచో మనుష్యులకు ప్రమాదకరం. జీవుల, జీవ ప్రక్రియ సమయంలో అల్ప ప్రమాణంలో కార్బన్ మొనాక్సైడ్ ఉత్పత్తి అగును. కార్బన్ మొనాక్సైడ్ ఒక కార్బన్ పరమాణువు, మరో ఆక్సిజన్ పరమాణువుతో త్రిబంధ సంయోగం ఏర్పరచు కొనుట వలన ఏర్పడును. అణువు లోని త్రిబంధాలలో రెండు సమయోజనీయ బంధాలు కాగా మూడవది ద్విధ్రువ సమయోజనీయ బంధం.ఇది అతి సాధారణంగా ఆక్సోకార్బన్, సైయనైడ్ అయానులతో, నైట్రోసోనియం కేటయాన్తో,, నత్రజని అణువుతో ఐసో ఎలెక్ట్రానిక్ గా ప్రవర్తించును. సమన్వయ సంక్లిష్ట సమ్మేళనాలలో కార్బన్ మొనాక్సైడ్ లిగండ్ (ligand) ను కార్బోనైల్ అంటారు.
| |||
పేర్లు | |||
---|---|---|---|
Preferred IUPAC name
Carbon monoxide | |||
ఇతర పేర్లు
Carbon monooxide Carbonous oxide Carbon(II) oxide Carbonyl Flue gas Monoxide | |||
గుర్తింపు విషయాలు | |||
సి.ఎ.ఎస్. సంఖ్య | [630-08-0] | ||
పబ్ కెమ్ | 281 | ||
యూరోపియన్ కమిషన్ సంఖ్య | 211-128-3 | ||
కెగ్ | D09706 | ||
వైద్య విషయ శీర్షిక | Carbon+monoxide | ||
సి.హెచ్.ఇ.బి.ఐ | CHEBI:17245 | ||
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య | FG3500000 | ||
SMILES | [C-]#[O+] | ||
| |||
బైల్ స్టెయిన్ సూచిక | 3587264 | ||
జి.మెలిన్ సూచిక | 421 | ||
ధర్మములు | |||
CO | |||
మోలార్ ద్రవ్యరాశి | 28.010 g/mol | ||
స్వరూపం | colorless gas | ||
వాసన | odorless | ||
సాంద్రత | 789 kg/m3, liquid 1.250 kg/m3 at 0 °C, 1 atm 1.145 kg/m3 at 25 °C, 1 atm | ||
ద్రవీభవన స్థానం | −205.02 °C (−337.04 °F; 68.13 K) | ||
బాష్పీభవన స్థానం | −191.5 °C (−312.7 °F; 81.6 K) | ||
నీటిలో ద్రావణీయత |
27.6 mg/L (25 °C) | ||
ద్రావణీయత | soluble in chloroform, acetic acid, ethyl acetate, ethanol, ammonium hydroxide, benzene | ||
kH | 1.04 atm-m3/mol | ||
వక్రీభవన గుణకం (nD) | 1.0003364 | ||
ద్విధృవ చలనం |
0.122 D | ||
ఉష్ణగతిక రసాయన శాస్త్రము | |||
నిర్మాణము మారుటకు కావాల్సిన ప్రామాణిక ఎంథ్రఫీ ΔfH |
−110.5 kJ·mol−1 | ||
దహనక్రియకు కావాల్సిన ప్రామాణీక ఎంథ్రఫీ ΔcH |
−283.4 kJ/mol | ||
ప్రామాణిక మోలార్ ఇంథ్రఫీ S |
197.7 J·mol−1·K−1 | ||
విశిష్టోష్ణ సామర్థ్యం, C | 29.1 J/K mol | ||
ప్రమాదాలు | |||
ఇ.యు.వర్గీకరణ | {{{value}}} | ||
R-పదబంధాలు | R61 R12 R26 మూస:R48/23 | ||
S-పదబంధాలు | S53 S45 | ||
జ్వలన స్థానం | {{{value}}} | ||
స్వయం జ్వలన ఉష్ణోగ్రత |
609 °C (1,128 °F; 882 K) | ||
విస్ఫోటక పరిమితులు | 12.5–74.2% | ||
Lethal dose or concentration (LD, LC): | |||
LC50 (median concentration) |
8636 ppm (rat, 15 min) 5207 ppm (rat, 30 min) 1784 ppm (rat, 4 hr) 2414 ppm (mouse, 4 hr) 5647 ppm (guinea pig, 4 hr)[1] | ||
LCLo (lowest published) |
4000 ppm (human, 30 min) 5000 ppm (human, 5 min)[1] | ||
US health exposure limits (NIOSH):[2] | |||
PEL (Permissible) |
TWA 50 ppm (55 mg/m3) | ||
REL (Recommended) |
TWA 35 ppm (40 mg/m3) C 200 ppm (229 mg/m3) | ||
IDLH (Immediate danger) |
1200 ppm | ||
సంబంధిత సమ్మేళనాలు | |||
Related {{{label}}} | {{{value}}} | ||
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa). | |||
Y verify (what is YN ?) | |||
Infobox references | |||
కార్బన్ కలిగిన పదార్థాలను పాక్షికంగా ఆక్సీకరణం చెయ్యడం వలన కార్బన్ మొనాక్సైడ్ వాయువును ఉత్పత్తి చెయ్యవచ్చును. కార్బన్ కలిగిన పదార్థాల లేదా సేంద్రియపదార్థాల దహనసమయంలో కార్బన్ డయాక్సైడ్ను ఉత్పత్తి చెయ్యుటకు ఆక్సిజన్ అందుబాటులో లేనప్పుడు కార్బన్ మొనాక్సైడ్ ఏర్పడును.మూసి వుంచిన/ సంవృత ఆవరణలో, తక్కువ గాలి అందుబాటు ఉన్న ప్రదేశాలలో స్టవ్ వెలుగుతున్నప్పుడు, లేదా అంతర్గత దహన యంత్రాలు పనిచేయునపుడు కార్బన్ మొనాక్సైడ్ అధిక ప్రమాణంలో ఉత్పత్తి అగును. కార్బన్ మొనాక్సైడ్ను ఆక్సిజన్ సమక్షంలోలేదా వాతావరణం లోని గాలిలో నీలి జ్వాల వెలువరిస్తూ మండి కార్బన్ డయాక్సైడ్ను వెలువరించును.
1960కు ముందు కాలంలో ఇళ్ళలో దీపాలను వెలిగించుటకు, వంట వండుటకు,, వేడి చెయ్యుటకు ఉపయోగించిన కోల్ గ్యాస్, అధిక శాతం కార్బన్ మొనాక్సైడ్ను కలిగి యుండెడిది. ప్రస్తుత ఆధునిక కాలంలో ఇనుప ఖనిజాన్ని కరిగించి ఇనుమును ఉత్పత్తి చెయ్యునపుడు కార్బన్ మొనాక్సైడ్ ఉపఉత్పత్తిగా ఏర్పడు చున్నది.