నాగార్జునసాగర్
ఆనకట్ట / From Wikipedia, the free encyclopedia
నాగార్జున సాగర్ ప్రస్తుత తెలంగాణ లోని నల్గొండ జిల్లా, ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా సరిహద్దుల్లో కృష్ణా నదిపై నిర్మింపబడిన ఆనకట్ట వల్ల ఏర్పడిన జలాశయం. ఇది దేశంలోని జలాశయాల సామర్థ్యంలో రెండవ స్థానంలో , ఆనకట్ట పొడవులో మొదటి స్థానంలో ఉంది. కృష్ణా నదిపై నిర్మించబడ్డ ఆనకట్టల్లో నాగార్జునసాగర్ అతి పెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్టు. ఈ ప్రాంతానికున్న చారిత్రక ప్రాధాన్యం వలన ఈ ప్రాజెక్టుకు నాగార్జునసాగర్ ప్రాజెక్టు అని పేరుపెట్టారు. నాగార్జునసాగర్ ప్రముఖ బౌద్ధ చారిత్రక స్థలం. శాతవాహనుల కాలమునాటి శ్రీ పర్వతమే నాగార్జున కొండ. ఆచార్య నాగార్జునుడు ఈ ప్రాంతంలో బోధనలు చేసినట్లుగా చారిత్రక ఆధారాలు ఉన్నాయి. జలాశయం నిర్మాణ సమయంలో ఇక్కడ లభించిన అమూల్యమయిన చారిత్రక కట్టడాల శిథిలాలను జలాశయం మధ్యలో నాగార్జునకొండ ప్రదర్శనశాలలో భద్ర పరచారు. ఈ జలాశయానికి 11,560 మిలియన్ ఘనపు మీటర్ల నీటిని నిలువ చేయగల సామర్థ్యం ఉంది. దీని ద్వారా నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, కృష్ణా, గుంటూరు జిల్లాలకు సాగునీరు అందించ బడుతున్నది. ఇక్కడ జల విద్యుత్ కేంద్రాలున్నాయి.
నాగార్జునసాగర్ ఆనకట్ట | |
---|---|
ప్రదేశం | నల్గొండ జిల్లా, తెలంగాణా; పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్ |
అక్షాంశ,రేఖాంశాలు | 16°34′32″N 79°18′42″E |
నిర్మాణం ప్రారంభం | డిసెంబరు 10 1955 |
ప్రారంభ తేదీ | 1960 |
నిర్మాణ వ్యయం | 1300 కోట్ల రూపాయలు |
ఆనకట్ట - స్రావణ మార్గాలు | |
నిర్మించిన జలవనరు | కృష్ణా నది |
Height | 124 metres (407 ft) from river level |
పొడవు | 1,550 metres (5,085 ft) |
జలాశయం | |
సృష్టించేది | నాగార్జున సాగర్ రిజర్వాయరు |
మొత్తం సామర్థ్యం | 11,560,000,000 m3 (9,371,845 acre⋅ft) |
క్రియాశీల సామర్థ్యం | 5,440,000,000 m3 (4,410,280 acre⋅ft)[1] |
పరీవాహక ప్రాంతం | 215000 km² (83012 sq mi) |
ఉపరితల వైశాల్యం | 285 km2 (110 sq mi) |
విద్యుత్ కేంద్రం | |
Commission date | 1978-1985 |
టర్బైన్లు | 1 x 110 MW Francis turbines, 7 x 100.8 MW reversible Francis turbines |
Installed capacity | 816 MW |
Website https://irrigation.telangana.gov.in/icad/projectsMajUp# https://irrigationap.cgg.gov.in/wrd/projects |