22 ఆగ, 2025, శుక్ర

Remove ads
Most read
Thumbnail
Thumbnail

చిరంజీవి

తెలుగు సినీ నటుడు, రాజకీయ నాయకుడు

చిరంజీవి తెలుగు చలన చిత్ర నటుడు, రాజకీయ నాయకుడు. అతని అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్. మెగాస్టార్‌గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. కేంద్ర ప్రభుత్వంలో 2012 ఆగస్టు 27 నుంచి 2014 మే 26 దాకా పర్యాటక శాఖా మంత్రి గా పనిచేశాడు. తన బ్రేక్ డ్యాన్స్ కు పేరు పొందిన చిరంజీవి 150కి పైగా చిత్రాల్లో నటించాడు. వీటిలో ఎక్కువభాగం తెలుగు చిత్రాలు. మిగతావి తమిళ, కన్నడ, హిందీ చిత్రాలు. 39 ఏళ్ళకు పైబడ్డ నట ప్రస్థానంలో మూడు సార్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నంది పురస్కారాలు, రఘుపతి వెంకయ్య బహుమతి, తొమ్మిది ఫిల్మ్ ఫేర్ సౌత్ బహుమతులు గెలుచుకున్నాడు. 2006 లో చిరంజీవికి చలన చిత్ర రంగంలో చేసిన సేవలకు గాను పద్మభూషణ్ బహుమతి, 2024లో పద్మ విభూషణ్ పురస్కారం లభించింది. అదే సంవత్సరం ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటు ఇచ్చింది. మొత్తం దేశంలో చిరంజీవికి మూడు వేలకు పైగా అభిమాన సంఘాలున్నాయని ఒక అంచనా.
539 views
Thumbnail
Thumbnail

గిడుగు వెంకట రామమూర్తి

తెలుగు వాడుక భాషోద్యమ పితామహుడు

గిడుగు వెంకట రామమూర్తి తెలుగు వాడుక భాషా ఉద్యమ పితామహుడు. గ్రాంథికభాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుకభాషలోకి తీసుకు వచ్చి, నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్నీ, వీలునూ తెలియజెప్పిన మహనీయుడు. ఆంధ్రదేశంలో వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడు. బహుభాషా శాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘసంస్కర్త, హేతువాది. శిష్టజన వ్యవహారికభాషను గ్రంథరచనకు స్వీకరింపజేయడానికి చిత్తశుద్ధితో కృషిచేసిన అచ్చతెలుగు చిచ్చర పిడుగు గిడుగు. గిడుగు ఉద్యమం వల్ల ఏ కొద్దిమందికో పరిమితమైన చదువు వ్యావహారికభాషలో సాగి, అందరికీ అందుబాటులోకి వచ్చింది. పండితులకే పరిమితమైన సాహిత్యసృష్టి, సృజనాత్మకశక్తి ఉన్న ప్రతి ఒక్కరికీ వీలైంది. గిడుగు రామ్మూర్తి జయంతి ఆగష్టు 29 ని “తెలుగు భాషా దినోత్సవం”గా జరుపుకుంటున్నాము.
499 views
Show more