భారతదేశ నటి, హిందీ చిత్రాల్లో ప్రముఖంగా నటించింది. From Wikipedia, the free encyclopedia
డింపుల్ కపాడియా (జననం 8 జూన్ 1957)[1] ఒక భారతీయ సినిమా నటి. ప్రముఖ హిందీ నటుడు రాజ్ కపూర్ 1973లో తానే నిర్మించి, దర్శకత్వం వహించిన "బాబీ" చిత్రంలో ఈమెను పరిచయం చేశాడు. అప్పుడు ఆమె వయసు 16 సంవత్సరాలు. అదే సంవత్సరం ఈమె హిందీ సినిమా నటుడు రాజేష్ ఖన్నాను వివాహం చేసుకుని సినిమాల నుండి విరమించింది. 1984లో రాజేష్ ఖన్నాతో విడాకులు తీసుకున్న తర్వాత తిరిగి సినిమా రంగప్రవేశం చేసింది. తొలి చిత్రం బాబీ, 1985లో విడుదలైన "సాగర్" చిత్రాలలో ఈమె నటనకు ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ పురస్కారం లభించింది.[2]
డింపుల్ కపాడియా | |
---|---|
జననం | డింపుల్ చున్నీబాయ్ కపాడియా 1957 జూన్ 8 |
వృత్తి | సినిమా నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1973; 1984–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | రాజేష్ ఖన్నా (1973–1982; విడిపోయారు) |
పిల్లలు | ట్వింకిల్ ఖన్నా రింకే ఖన్నా |
బంధువులు | సింపుల్ కపాడియా (సోదరి) అక్షయ్ కుమార్ (అల్లుడు) |
డింపుల్ కపాడియా గుజరాతీ పారిశ్రామికవేత్త చున్నీభాయ్ కపాడియా, బెట్టీ దంపతుల నలుగురు సంతానంలో పెద్ద కుమర్తె. ఈమెకు సింపుల్ కపాడియా, రీమ్ కపాడియా అనే చెల్లెళ్ళు, మున్నా అనే తమ్ముడు ఉన్నారు.[3][4] వీరి కుటుంబం ముంబయి లోని శాంతాక్రజ్ అనే ప్రాంతంలో నివసించేది. ఈమె సెయింట్ జోసెఫ్స్ కాన్వెంట్ హైస్కూలులో చదువుకుంది.[5][6]. ఈమె తన తొలి సినిమా బాబీ విడుదల కావడానికి ఆరు నెలల క్రితమే 1973లో సినీ నటుడు రాజేష్ ఖన్నా ను వివాహం చేసుకుంది.[7] ఆ తర్వాత ఈమె 12 సంవత్సరాల కాలం సినిమాలకు దూరంగా ఉంది. ఈమెకు ట్వింకిల్ (జ.1973), రింకీ (జ.1977) లు జన్మించారు.[7]
ఈమె రాజేష్ ఖన్నాతో 1982 ఏప్రిల్‌లో విడాకులు పుచ్చుకుంది. తన కుమార్తెలను తన తల్లిదండ్రుల వద్ద వదిలివేసింది.[8] రెండేళ్ల తరువాత సినిమా రంగంలో పునఃప్రవేశం చేసింది.[7]
ఈమె కుమార్తెలు ఇద్దరూ సినిమా నటులుగా రాణించి జీవితంలో స్థిరపడ్డారు. పెద్ద కుమార్తె ట్వింకిల్ ఖన్నా సినిమా నటుడు అక్షయ్ కుమార్ ను వివాహం చేసుకుంది.[9]
ఈమెకు చిన్నతనం నుండే సినిమాలలో నటించాలన్న కోరిక ఉండేది. [10] 1973లో రాజ్ కపూర్ ఈమెను తన చిత్రం "బాబీ"లో పరిచయం చేశాడు. ఆ చిత్రం రాజ్ కపూర్ కుమారుడు రిషీ కపూర్‌కు కూడా తొలి చిత్రం. ఈ చిత్రంలో డింపుల్ గోవాకు చెందిన మధ్యతరగతి క్రిస్టియన్ అమ్మాయి 'బాబీ బ్రగాంజా' పాత్రను పోషించింది.[7] ఈ కథలో బాబీ, ధనవంతుల బిడ్డయైన రాజ్ (రిషీ కపూర్) ను ప్రేమిస్తుంది. ఇరువైపుల తల్లిదండ్రులు వీరి ప్రేమను అంగీకరించరు. ఈ సినిమా, ముఖ్యంగా డింపుల్ నటన సినీ విమర్శకుల ప్రశంసలను అందుకుంది. ఈ చిత్రంలోని నటనకు గాను ఈమె ఉత్తమనటిగా ఫిల్మ్‌ఫేర్ పురస్కారాన్ని "అభిమాన్" చిత్రంలో నటించిన జయబాధురితో కలిసి పంచుకుంది.[11] 2008లో రీడిఫ్.కామ్ ఈమె నటనకు స్త్రీలలో ఆల్ టైమ్ హిందీ సినిమా నాలుగవ అత్యుత్తమ తొలి నటనగా ఎంపిక చేసింది.[12] ఈమె సినిమాలలో 1982లో రి ఎంట్రీ ఇచ్చిన తర్వాత అతి తక్కువ వ్యవధిలోనే శ్రీదేవి, మాధురీ దీక్షిత్, మీనాక్షి శేషాద్రి, జయప్రదల తర్వాత బాలీవుడ్లో టాప్ కమర్షియల్ నటిగాఅ ఐదవ స్థానాన్ని ఆక్రమించింది.[13] ఈమె రమేష్ సిప్పి, నజీర్ హుసేన్, ముకుల్ ఆనంద్, ఫిరోజ్ ఖాన్, మహేష్ భట్, రాజ్ కుమార్ కొహ్లీ, సుభాష్ ఘాయ్, గోవింద్ నిహ్లానీ, గుల్జార్ వంటి దర్శకుల చిత్రాలలో కమల్ హసన్, సన్నీ డియోల్, అనిల్ కపూర్, జాకీ ష్రాఫ్, మిథున్ చక్రవర్తి, ధర్మేంద్ర, వినోద్ ఖన్నా,శేఖర్ కపూర్, నానా పటేకర్, అమితాబ్ బచ్చన్, సైఫ్ అలీ ఖాన్, నసీరుద్దీన్ షా మొదలైన నటుల సరసన నటించింది. కొన్ని తమిళ, మలయాళ చిత్రాలలో కూడా నటించింది.
సంవత్సరం | సినిమా పేరు | పాత్ర | వివరాలు |
---|---|---|---|
1973 | బాబీ | బాబీ జె. బ్రగాంజా | ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ పురస్కారం |
1984 | జక్మి షేర్ | అను గుప్తా | |
1984 | మంజిల్ మంజిల్ | సీమా మల్హోత్రా | |
1985 | ఐత్బార్ | నేహా ఖన్నా | |
1985 | లావా | రింకూ దయాల్ | |
1985 | అర్జున్ | గీతా సహాని | |
1985 | పాతాళ్ భైరవి | యక్షకన్య | |
1985 | సాగర్ | మోనా డిసిల్వా | ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ పురస్కారం |
1986 | విక్రమ్ | రాకుమారి | తమిళ సినిమా |
1986 | జాన్బాజ్ | రేష్మా రాయ్ | |
1986 | అల్లారఖా | జూలీ ఖేరా | |
1987 | ఇన్సానియత్ కె దుష్మన్ | శిల్ప | |
1987 | ఇన్సాఫ్ | సోనియా / డా.సరిత | |
1987 | కాష్ | పూజ | |
1988 | సాజిష్ | మీనా | |
1988 | మేరా షికార్ | బిజ్లి | |
1988 | గునావోఁ కా ఫైస్లా | షాను / దుర్గ | |
1988 | బీస్ సాల్ బాద్ | నిషా | |
1988 | ఆఖ్రీ అదాలత్ | రీమా కపూర్ | |
1988 | కబ్జా | డా.స్మిత | |
1988 | మహావీర | డాలీ | |
1988 | జక్మీ ఔరత్ | కిరణ్ దత్ | |
1988 | గంగా తేరే దేశ్ మే | రాకుమారి | |
1989 | రామ్ లఖన్ | గీతా కశ్యప్ | |
1989 | యాక్షన్ | ||
1989 | తౌహీన్ | దీపికా శ్రీవాత్సవ | |
1989 | బట్వారా | జిన్నా | |
1989 | సిక్కా | శోభా | |
1989 | షహజాదే | ఆర్తి | క్రెడిట్ ఇవ్వలేదు |
1989 | లడాయి | బిల్లూ | |
1990 | పతి పరమేశ్వర్ | దుర్గా | |
1990 | కలి గంగా | ||
1990 | జై శివ్ శంకర్ | ||
1990 | ఆగ్ కా గోలా | ఆర్తి | |
1990 | ప్యార్ కే నామ్ ఖుర్బాన్ | రాజకుమారి దేవికా సింగ్ | |
1990 | దృష్టి | సంధ్య | |
1991 | లేకిన్... | రేవ | |
1991 | ప్రహార్ ద ఫైనల్ అటాక్ | కిరణ్ | |
1991 | నరసింహ | అనితా వి.రస్తోగి | |
1991 | మస్త్ కలందర్ | ప్రీత్ కౌర్ | |
1991 | హక్ | వర్షా బి.సింగ్ | |
1991 | ఖూన్ కా కర్జ్ | తారా కె. లెలె | |
1991 | దుష్మన్ దేవతా | గౌరి | |
1991 | అజూబా | రుక్సానా ఖాన్ | |
1991 | రణభూమి | వేశ్య | |
1992 | కర్మ యోధ | నమిత | |
1992 | అంగార్ | మిలి | |
1992 | దిల్ ఆసాన్ హై | బర్ఖా | |
1993 | రుడాలి | Shanichari | జాతీయ ఉత్తమ చలనచిత్ర నటి పురస్కారం ఫిల్మ్‌ఫేర్ క్రిటిక్స్ అవార్డ్ ఫర్ బెస్ట్ యాక్ట్రెస్ |
1993 | గునాహ్ | కవితాశర్మ | |
1993 | ఆజ్ కీ ఔరత్ | రోష్నీ వర్మా | |
1993 | గర్దిష్ | శాంతి | Nominated—Filmfare Award for Best Supporting Actress |
1994 | పథ్రీలా రాస్తా | గాయత్రి సన్యాల్ | |
1994 | క్రాంతివీర్ | మేఘా దీక్షిత్ | ఉత్తమ సహాయనటిగా ఫిల్మ్‌ఫేర్ పురస్కారం |
1994 | అంతరీన్ | బెంగాలీ సినిమా | |
1997 | షేర్ బజార్ | ప్రత్యేక పాత్రలో | |
1997 | అగ్ని చక్ర | రాణి | |
1997 | మృత్యు దాత | జానకీ గాయల్ | |
1998 | 2001:దో హజార్ ఏక్ | రోష్నీ శర్మ | |
1999 | లావారిస్ | కవితా సక్సేనా | |
1999 | హమ్ తుమ్ పే మర్తే హై | దేవయాని | |
2001 | దిల్ చాహతా హై | తారా జైస్వాల్ | |
2002 | లీలా | లీలా | |
2004 | హం కౌన్ హై? | శాండ్రా విలియమ్స్ | |
2005 | ప్యార్ మే ట్విస్ట్ | శీతల్ ఆర్య | |
2006 | బీయింగ్ సైరస్ | కేటి సేత్నా | |
2006 | బనారస్ - ఎ మిస్టిక్ లవ్ స్టోరీ | గాయత్రి | |
2008 | ఫిర్ కభీ | గంగా | |
2008 | జంబో | దేవి (వాయిస్ ఓవర్) | |
2009 | లక్ బై ఛాన్స్ | నీనా వాలియా | |
2010 | తుమ్ మిలో తో సహీ | దిల్షాద్ నాన్జీ | |
2010 | దబాంగ్ | నైని పి. పాండే | |
2011 | పాటియాలా హౌస్ | మిసెస్ ఖలోన్ | |
2012 | బొంబాయి మిఠాయి | మిసెస్ మన్సూర్ | మలయాళ సినిమా |
2012 | కాక్టెయిల్ | కవితా కపూర్ | |
2013 | వాట్ ది ఫిష్ | సుధా మిశ్రా | |
2014 | గొల్లు ఔర్ పప్పు | అమ్మ | |
2014 | ఫైండింగ్ ఫన్నీ | రోసలీనా రోసీ యూచరిస్టికా | |
2015 | వెల్కమ్ బ్యాక్ | మహారాణి | |
2019 | దబంగ్ 3 | ||
2023 | తూ ఝూతీ మైన్ మక్కర్ | ||
2024 | తేరీ బాతో మే ఐసా ఉల్జా జియా |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.