బెంగళూరు
భారతీయ నగరం / From Wikipedia, the free encyclopedia
బెంగళూరు (బెంగుళూరు) (కన్నడ: ಬೆಂಗಳೂರು), భారతదేశం లోని మహా నగరాలలో ఒకటి. ఇది కర్ణాటక రాష్ట్రానికి రాజధాని. బెంగుళూరును "హరిత నగరం" (ఆంగ్లములో "గ్రీన్ సిటీ") అని కూడా అంటారు. ఇక్కడ వృక్షాలు అధికంగా ఉండటం వలన దానికాపేరు వచ్చింది. ప్రస్తుతము వివిధ అభివృద్ధి కార్యక్రమాల వలన పెద్ద సంఖ్యలో వృక్షాలు తొలగించటం జరుగుతుంది. తద్వారా ఈ నగరంలో కాలక్రమేణ వాతావరణంలో వేడి బాగా పెరిగిపోతోంది. ఇక్కడ అధికంగా సరస్సులుండటం వలన దీనిని "సరస్సుల నగరం" అని కూడా అంటారు. బెంగుళూరు భారతదేశంలో సాఫ్ట్వేర్ కార్యకలాపాలకు కేంద్రం. అందుకే దీనిని "సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా" అంటారు. ఇది మెట్రోపాలిటన్ ప్రాంతం.
బెంగళూరు పేరుతో ఇతర వ్యాసాలున్నాయి. వాటి లింకుల కోసం బెంగళూరు (అయోమయ నివృత్తి) చూడండి. |
?బెంగుళూరు ಬೆಂಗಳೂರು కర్ణాటక • భారతదేశం | |
అక్షాంశరేఖాంశాలు: 12.970214°N 77.56029°E / 12.970214; 77.56029 | |
కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
విస్తీర్ణం • ఎత్తు |
741 కి.మీ² (286 sq mi)[1] • 920 మీ (3,018 అడుగులు) |
జిల్లా (లు) | బెంగుళూరు జిల్లా జిల్లా |
జనాభా • జనసాంద్రత |
52,80,000 (3rd) (2007 నాటికి) • 7,126/కి.మీ² (18,456/చ.మై) |
మేయర్ | సంపత్ రాజ్ |
కోడులు • పిన్కోడ్ • ప్రాంతీయ ఫోన్ కోడ్ • UN/LOCODE • వాహనం |
• 560 0xx • +91-(0)80 • IN BLR • KA-01; KA-02; KA-03; KA-04; KA-05; KA-41; KA-51; KA-53 |
1537 వరకు పలు దక్షిణ భారత రాజ వంశీకులు బెంగుళూరుని పాలించారు. విజయనగర సామ్రాజ్యంనకు చెందిన కేంపె గౌడ అను పాలేగాడు మొట్ట మొదటి సారిగా ఇక్కడ మట్టితో ఒక కోటని నిర్మించాడు. ఇతడు ఒక్కలిగ జాతికి చెందిన వ్యక్తి. అదే ఇప్పటి ఆధునిక నగరానికి పునాది. కాలక్రమేణా మరాఠీలు, మొఘల్ ల చేతుల నుండి మైసూరు రాజ్యం క్రిందకు వచ్చింది. బ్రిటీషు వారి కంటోన్మెంటుగా మైసూరు రాజ్యంలో ఒక ముఖ్య పట్టణంగా బెంగుళూరు కొనసాగింది. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం సిధ్ధించిన తర్వాత మైసూరు రాజ్యానికి కేంద్రంగా నిర్ధారింపబడి, 1956లో కొత్తగా ఏర్పడ్డ కర్ణాటక రాష్ట్రానికి రాజధానిగా విలసిల్లినది. 83 బిలియను డాలర్ల జీడీపీతో భారతదేశానికి స్థూల దేశీయోత్పత్తి సంపాదించే మొదటి 15 నగరాలలో 4వ స్థానాన్ని కైవసం చేసుకొంది.
కళాశాలలు, పరిశోధనా సంస్థలు, భారీ పరిశ్రమలు, సాంకేతిక సంస్థలు, విమానయాన సంస్థలు, టెలికమ్యూనికేషన్స్, రక్షణా దళాలకు బెంగుళూరు కేంద్రం.