భారతదేశ జిల్లాల జాబితా
భారతదేశం లోని పరిపాలనా యంత్రాంగంలో ఒక విభాగం / From Wikipedia, the free encyclopedia
భారతదేశ జిల్లా , అనేది భారతదేశం లోని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాలలో పరిపాలనా యంత్రాంగం కల ఒక భూ భాగం.ప్రస్తుతం భారతదేశం ఇరవై ఎనిమిది రాష్ట్రాలు, ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలతో కూడిన సమాఖ్య వ్యవస్థగా ఉంది.కొన్ని సందర్భాల్లో, జిల్లాలు ఉపవిభాగాలుగా, మరికొన్నింటిలో నేరుగా తహసీల్లు లేదా తాలూకాలుగా విభజించబడ్డాయి.
- 2001 భారత జనాభా లెక్కల ప్రకారం 593 జిల్లాలు నమోదయ్యాయి.
- 2011 భారత జనాభా లెక్కల ప్రకారం 640 జిల్లాలు నమోదయ్యాయి.
- 2023 అక్టోబరు నాటికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు లోని జిల్లాలు కలిపి (733 +45) 778 జిల్లాలు ఉన్నాయి.[1][2]
భారతదేశ జిల్లాలు | |
---|---|
రకం | Second-level administrative division |
స్థానం | States and union territories of India |
సంఖ్య | 766 (as of 1 August 2022) |
జనాభా వ్యాప్తి | Greatest: North 24 Parganas, West Bengal—10,082,852 (2011 census) Least: Dibang Valley, Arunachal Pradesh—8,004 (2011 census) |
విస్తీర్ణాల వ్యాప్తి | Largest: Kutch, Gujarat—45,652 km2 (17,626 sq mi) Smallest: Mahé, Puducherry—8.69 km2 (3.36 sq mi) |
జనసాంద్రత వ్యాప్తి | Largest: Central Delhi, Delhi Smallest: Lower Dibang Valley, Arunachal Pradesh |
ప్రభుత్వం | District Administration |
ఉప విభజన | Tehsil, Taluka, Mandal Blocks |
రాష్ట్ర ప్రభుత్వంలో, ముఖ్యమంత్రికి విశేష అధికారాలు ఉంటాయి. గవర్నరు అనే ఇంకో పదవి కూడా రాష్ట్రంలో ముఖ్యమైంది. కేంద్రపాలిత ప్రాంతాలలో కేంద్ర ప్రభుత్వం నియమించిన లెఫ్టనెంట్ గవర్నరు చేతిలో అన్ని ముఖ్య అధికారాలు ఉంటాయి.
అలా కాకుండా కేంద్ర ప్రభుత్వం ఒక శాసనం జారీచేసి నియమిత అధికారాలున్న ప్రజాప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేయవచ్చు. ప్రస్తుతానికి రెండు కేంద్రపాలిత ప్రాంతాలలో (ఢిల్లీ, పుదుచ్చేరి) మాత్రమే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ఉన్నాయి.
ప్రతి రాష్ట్రం లేదా కేంద్ర పాలిత ప్రాంతాన్ని పరిపాలనా అధికార వికేంద్రీకరణకై జిల్లాలుగా విభజించడమైంది. ప్రతి జిల్లాకు ప్రభుత్వం ఒక ఐ.ఏ.ఎస్.గా అర్హతగల వ్యక్తిని జిల్లా కలెక్టరుగా నియమిస్తుంది.
ఈ అధికారికి జిల్లాకు సంబంధించిన అన్ని శాఖలపరిపాలన, ఆర్థిక వ్యవహారాలపై నియంత్రాణాధికారం ఉంటుంది. కలెక్టరును జిల్లా మెజిస్ట్రేటు అని కూడా పిలుస్తారు, జిల్లాకు సంబంధించిన శాంతిభద్రతలను కూడా ఈ అధికారే పర్యవేక్షిస్తారు.
పెద్ద పెద్ద రాష్ట్రాలలో కొన్ని జిల్లాలను కలిపి ఒక విభాగం సృష్టించి, దానికి ఒక కమీషరుని నియమిస్తారు. ముంబై లాంటి నగరాలు జిల్లాలు కాకపోయినా కూడా వాటికి ప్రత్యేకంగా కలెక్టరులను నియమిస్తారు.
జిల్లా కేంద్రాలలో అధికార యంత్రాంగం ఉంటుంది. ఇది జిల్లా పరిపాలనా నిర్వహణ, శాంతి భద్రతలను పర్వవేక్షిస్తుంది. జిల్లాలను పరిపాలనా సౌలభ్యం కోసం తాలూకాలు లేదా తహసీల్లు, మండలాలుగా విభజింపబడ్డాయి.
వీటిని పాశ్చాత్య దేశాలలో కౌంటీలుగా వ్యవహరించే పాలనా విభాగాలకు సమాంతరమైనవిగా భావించవచ్చు.