మాహె జిల్లా
పాండిచెర్రీ లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
పాండిచెర్రీ లోని జిల్లా From Wikipedia, the free encyclopedia
మాహె జిల్లా, భారత కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోని నాలుగు జిల్లాలో ఇది ఒక జిల్లా.దీనిని ఫ్రెంచ్ పరిపాలనలో డి మహే జిల్లా అనేవారు.ఈ జిల్లా వైశాల్యం 9 చదరపు కిలోమీటర్లు.[1] మాహే జిల్లా మొత్తం కేరళ లోని ఉత్తర మలబార్ మద్యలో ఉపస్థితమై ఉంది.మూడు దిశలలో కన్నూర్ (కేరళ) జిల్లా ఉంది. ఒక దిశలో మాత్రం కేరళ రాష్ట్రానికి చెందిన కోళికోడు జిల్లా ఉంది. అత్యల్ప జనసంఖ్య కలిగిన జిల్లాలలో మాహె జిల్లా 6 వ స్థానంలో ఉంది.[2] విస్తీర్ణ పరిమాణం ప్రకారం ఇది భారతదేశంలో అతిచిన్న జిల్లా.[3]మహే జిల్లాలో హిందూ మతానికి చెందిన ప్రజలు మెజారిటీ సంఖ్యలో ఉన్నారు.ఆ తరువాత ముస్లిం మతానికి చెందిన వారు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు.
Mahé | |
---|---|
District | |
Coordinates: 11°42′N 75°32′E | |
Country | భారతదేశం |
Union territory | Puducherry |
విస్తీర్ణం | |
• Total | 8.69 కి.మీ2 (3.36 చ. మై) |
జనాభా (2011) | |
• Total | 41,816 |
• జనసాంద్రత | 4,800/కి.మీ2 (12,000/చ. మై.) |
Languages | |
• Official | Malayalam, English |
• Additional | French |
Time zone | UTC+5:30 (IST) |
Telephone code | +91 490 |
Vehicle registration | PY-03 |
Website | http://mahe.gov.in/ |
మాహే జిల్లా వైశాల్యం 8.69 చదరపు కిలోమీటర్లు.[4][5]
2011 భారత జనాభా లెక్కల అనుసరించి మాహే జిల్లా జనసంఖ్య 41,934.[2] ఇది దాదాపు లిక్తెన్స్తీన్ దేశ జనసంఖ్యతో సమానం.[6]భారతీయ జిల్లాలు (640) లలో మాహే జిల్లా 635వ స్థానంలో ఉంది.[2] జిల్లా జనసాంద్రత చదరపు కిలోమీటరుకు 4,659.[2] గా ఉంది. జిల్లా కుటుంబనియంత్రణ శాతం 13.86%.[2] జిల్లా స్త్రీపురుష శాతం 1176:1000.[2] అలాగే జిల్లా అక్షరాస్యతా శాతం 98.35% గా ఉంది.[2]
2011 భారత జనాభా లెక్కల ప్రకారం మాహే జిల్లాలో హిందూ మతానికి చెందిన వారు 66.82% మంది, ఇస్లాం మతానికి చెందిన వారు 30.74% మంది, క్రైస్తవ మతానికి చెందిన వారు 2.29% మంది, ఇతర లేదా ఏ మతం గుర్తించని వారు 0.55% మంది ఉన్నారు.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.