మాహె జిల్లా

పాండిచెర్రీ లోని జిల్లా From Wikipedia, the free encyclopedia

మాహె జిల్లాmap

మాహె జిల్లా, భారత కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోని నాలుగు జిల్లాలో ఇది ఒక జిల్లా.దీనిని ఫ్రెంచ్ పరిపాలనలో డి మహే జిల్లా అనేవారు.ఈ జిల్లా వైశాల్యం 9 చదరపు కిలోమీటర్లు.[1] మాహే జిల్లా మొత్తం కేరళ లోని ఉత్తర మలబార్ మద్యలో ఉపస్థితమై ఉంది.మూడు దిశలలో కన్నూర్ (కేరళ) జిల్లా ఉంది. ఒక దిశలో మాత్రం కేరళ రాష్ట్రానికి చెందిన కోళికోడు జిల్లా ఉంది. అత్యల్ప జనసంఖ్య కలిగిన జిల్లాలలో మాహె జిల్లా 6 వ స్థానంలో ఉంది.[2] విస్తీర్ణ పరిమాణం ప్రకారం ఇది భారతదేశంలో అతిచిన్న జిల్లా.[3]మహే జిల్లాలో హిందూ మతానికి చెందిన ప్రజలు మెజారిటీ సంఖ్యలో ఉన్నారు.ఆ తరువాత ముస్లిం మతానికి చెందిన వారు గణనీయమైన సంఖ్యలో ఉన్నారు.

త్వరిత వాస్తవాలు Mahé, Country ...
Mahé
District
Thumb
Map of Mahé showing the names of subdivisions.
Thumb
Mahé
Mahé
Location within Kerala, India
Coordinates: 11°42′N 75°32′E
Country భారతదేశం
Union territoryPuducherry
విస్తీర్ణం
  Total8.69 కి.మీ2 (3.36 చ. మై)
జనాభా
 (2011)
  Total41,816
  జనసాంద్రత4,800/కి.మీ2 (12,000/చ. మై.)
Languages
  OfficialMalayalam, English
  AdditionalFrench
Time zoneUTC+5:30 (IST)
Telephone code+91 490
Vehicle registrationPY-03
Websitehttp://mahe.gov.in/
మూసివేయి

భౌగోళికం

మాహే జిల్లా వైశాల్యం 8.69 చదరపు కిలోమీటర్లు.[4][5]

జిల్లాలో తాలూకాలు

  • మాహ్
  • చెరుకల్లాయ్
  • పల్లూరు
  • పాండక్కల్

గణాంకాలు

2011 భారత జనాభా లెక్కల అనుసరించి మాహే జిల్లా జనసంఖ్య 41,934.[2] ఇది దాదాపు లిక్తెన్స్తీన్ దేశ జనసంఖ్యతో సమానం.[6]భారతీయ జిల్లాలు (640) లలో మాహే జిల్లా 635వ స్థానంలో ఉంది.[2] జిల్లా జనసాంద్రత చదరపు కిలోమీటరుకు 4,659.[2] గా ఉంది. జిల్లా కుటుంబనియంత్రణ శాతం 13.86%.[2] జిల్లా స్త్రీపురుష శాతం 1176:1000.[2] అలాగే జిల్లా అక్షరాస్యతా శాతం 98.35% గా ఉంది.[2]

మతాల వారీగా ప్రజలు

2011 భారత జనాభా లెక్కల ప్రకారం మాహే జిల్లాలో హిందూ మతానికి చెందిన వారు 66.82% మంది, ఇస్లాం మతానికి చెందిన వారు 30.74% మంది, క్రైస్తవ మతానికి చెందిన వారు 2.29% మంది, ఇతర లేదా ఏ మతం గుర్తించని వారు 0.55% మంది ఉన్నారు.

పర్యాటకం

శ్రీ పుతంలం భాగవతి ఆలయం

  • మాహేలోని శ్రీ పుతంలం భాగవతి ఆలయం పురాతన చారిత్రక ఆలయం. ఈ ఆలయం పురాణం, ఫ్రెంచ్, భారతీయ సైన్యాల మధ్య ఘర్షణ జరిగిన సమయంలోని సంఘటనలను వివరిస్తుంది. [7] మాహే జిల్లాలో చారిత్రాత్మక సెయింట్ థెరిసా చర్చి ఉంది. దీనిని క్రైస్తవ మిషనరీ ఇగ్నేషియస్ ఎ.ఎస్. మహే మిషన్‌లో భాగంగా 1757 లో హిప్పోలైట్స్ నిర్మించాడు.[8]

మూప్పెంకును (చిన్న కొండ)

  • ఇది మహే జిల్లాలోని వారసత్వ వినోద ప్రదేశం. దీని వద్ద  నడవడానికి కాలి బాటలు, సందర్శకులు విశ్రాంతి తీసుకోవడానికి బెంచీలు, పర్యాటకులకు విశ్రాంతి మందిరాల సౌకర్యాలు ఉన్నాయి.  ఈ కొండ చారిత్రాత్మక లైట్ హౌస్ కలిగి ఉంది.ఇది ఒక సూర్యాస్తమయ వీక్షణానికి అనువైన స్థానం.[9]

మహే నది వద్ద నడక మార్గం

  • మహే నది ఒడ్డున నడిచే మార్గం ఇది ఒక పర్యాటక ఆకర్షణ. ఈ నడక మార్గంలో మహే పట్టణం చుట్టూ ప్రకృతి దృశ్యం చూడవచ్చు.  మహే నది అందాలను విశ్రాంతి ఆస్వాదించడానికి నడక దారిలో  పార్కులలో బెంచీలు ఉన్నాయి.[10]

అజిముఖం నది

  • అజిముఖం మహ నది అరేబియా సముద్రం తీరంలో కలిసింది. ఇక్కడ ఒక చిన్న ఠాగూర్ పార్కు ఉంది.ఇది నది ఒడ్డున  2 కిలోమీటర్ల దూరంలో సముద్రపు పాయ నుండి మాహే వంతెన వైపుకు జోడించింది.[11]

భౌగోళిక స్థానం

మూలాలు

వెలుపలి లంకెలు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.