![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/a/af/Medchal_Malkajgiri_in_Telangana_%2528India%2529.svg/langte-640px-Medchal_Malkajgiri_in_Telangana_%2528India%2529.svg.png&w=640&q=50)
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా
తెలంగాణలోని జిల్లా / From Wikipedia, the free encyclopedia
మేడ్చల్ - మల్కాజ్గిరి జిల్లా, తెలంగాణలోని 33 జిల్లాలలో ఒకటి.[2]
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/7/74/Malkajgiri_District_Revenue_divisions.png/320px-Malkajgiri_District_Revenue_divisions.png)
త్వరిత వాస్తవాలు మేడ్చెల్-మల్కాజ్గిరి జిల్లా, దేశం ...
మేడ్చెల్-మల్కాజ్గిరి జిల్లా | |
---|---|
![]() తెలంగాణ పటంలో మేడ్చెల్-మల్కాజ్గిరి జిల్లా స్థానం | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
ముఖ్య పట్టణం | మేడ్చల్ |
మండలాలు | 15 |
Government | |
• లోకసభ నియోజకవర్గాలు | 1 (మల్కాజ్గిరి) |
• శాసనసభ నియోజకవర్గాలు | 9 |
విస్తీర్ణం | |
• మొత్తం | 1,084 km2 (419 sq mi) |
జనాభా (2011) | |
• మొత్తం | 24,40,073 |
• జనసాంద్రత | 2,300/km2 (5,800/sq mi) |
• Urban | 22,30,245 |
జనాభా వివరాలు | |
• అక్షరాస్యత | 82.49 |
• లింగ నిష్పత్తి | 957 |
Vehicle registration | TS–08 [1] |
ప్రధాన రహదార్లు | 3 జాతీయ రహదారులు, 2 రాష్ట్ర రహదారులు |
Website | అధికారిక జాలస్థలి |
మూసివేయి
2016 అక్టోబరు 11న జరిగిన పునర్య్వస్థీకరణలో ఏర్పడిన ఈ కొత్త జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు (మల్కాజ్గిరి, కీసర), 14 రెవెన్యూ మండలాలు, నిర్జన గ్రామాలు 6తో కలుపుకొని 162 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.పునర్య్వస్థీకరణలో 6 కొత్త మండలాలు ఏర్పడ్డాయి.[2] ఈ జిల్లాలోని అన్ని మండలాలు పూర్వపు రంగారెడ్డి జిల్లా లోనివే. జిల్లా పరిపాలనా కేంద్రం షామీర్పేట్.[3] షామీర్పేట్ మండలం, అంతయపల్లి గ్రామంలో నిర్మించిన మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సమీకృత కలెక్టరేట్‌ను 2022 ఆగస్టు 17న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రారంభించాడు.