నటుడవ్వాలని వచ్చి నిర్మాతగా స్థిరపడ్డ వి.బి.రాజేంద్రప్రసాద్ జగపతి పిక్చర్స్, జగపతి ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత. అరవై, డెబ్బై దశకాలలో విజయవంతమైన చిత్రాలు నిర్మించి ఆనాటి మేటి చిత్ర నిర్మాతలలో ఒకరిగా నిలిచారు. ఆయన నిర్మాత, దర్శకుడు కూడా. తెలుగు, తమిళ హిందీ భాషలలో 32 సినిమాలు నిర్మించి 19 సినిమాలకు దర్శకత్వం వహించారు.[2]

త్వరిత వాస్తవాలు వి.బి.రాజేంద్రప్రసాద్, జననం ...
వి.బి.రాజేంద్రప్రసాద్
Thumb
జననంనవంబర్ 4, 1932
మరణం2015 జనవరి 12(2015-01-12) (వయసు 82)[1]
మరణ కారణంఅనారోగ్యం
పిల్లలుజగపతి బాబు
మూసివేయి

బాల్యం, విద్యాభ్యాసం

శ్రీ వి.బి.రాజేంద్రప్రసాద్ 1932 నవంబర్ 4 వ తేది, న కృష్ణా జిల్లాలోని డోకిపర్రు (కృష్ణా జిల్లా) గ్రామంలో, వ్యవవసాయ కుటుంబానికి చెందిన జగపతి చౌదరి, లక్ష్మీనరసమ్మ దంపతులకు జన్మించారు. ఆయన పాఠశాల విద్యాబ్యాసం డోకిపర్రు గ్రామంలోనూ, కళాశాల విద్యాబ్యాసం కాకినాడ లోనూ జరిగింది. అక్కడ వారికి ఏడిద నాగేశ్వరరావుతో పరిచయమైంది.' రాఘవ కళాసమితి' అనే సాంస్కృతిక సంస్థను ప్రారంభించి ఇన్‌స్పెక్టర్ జనరల్ వంటి[3] వంటి పలు నాటకాలు ప్రదర్శించడమే కాకుండా స్త్రీ పాత్రలో నటించి ఉత్తమ కథానాయిక బహుమతిని గెలుచుకున్నారు. కొన్నాళ్ళు విజయవాడ లో, కొంతకాలం బందరులో వ్యాపారాలు నిర్వహించారు.

సినీ జీవితం

నటుడవ్వాలని మద్రాస్ కి వచ్చారు వి.బి.రాజేంద్రప్రసాద్. అక్కడ ఆయనకు అక్కినేని నాగేశ్వరరావుతో పరిచయం కలిగింది. అది రాజేంద్రప్రసాద్ జీవితంలో ఒక మలుపు. అక్కినేని నాగేశ్వరరావు, వి.బి. రాజేంద్రప్రాద్ ను చాలా ప్రోత్సహించారు. వి.బి.రాజేంద్రప్రసాద్ ను అక్కినేని, ప్రముఖ నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావుకు పరిచయం చేసారు. కానీ నటుడిగా అవకాశాలు దొరకలేదు. దానితో నాగేశ్వరరావు ప్రోత్సాహంతో తండ్రిగారి పేరిట జగపతి సంస్థ స్థాపించి అన్నపూర్ణ చిత్రంతో చిత్ర నిర్మాణం ప్రారంభించారు. దసరా బుల్లోడు చిత్రంతో దర్శకుడిగా మారారు. వారి సంస్ధలలో నిర్మించిన చిత్రాలకేకాకుండా అందరూ దొంగలే సినిమాకు దర్శకత్వం వహించారు. ఎనభై దశకం నుండి చిత్ర విజయాలు తగ్గాయి. క్రమంగా చిత్రనిర్మాణాన్ని తగ్గించారు.

పురస్కారాలు

చిత్రరంగానికి నిర్మాతగా, దర్శకునిగా వి.బి.రాజేంద్రప్రసాద్ అందించిన సేవలను గుర్తించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2003వ సంవత్సరానికి ప్రతిష్ఠాత్మకమైన రఘుపతి వెంకయ్య పురస్కారంతో సత్కరించింది.

సినిమాలు

నిర్మాతగా (14 సినిమాలు)
  1. కిల్లర్ (1991)
  2. ఖత్రోన్‌కీ కిలాడీ (1988)
  3. భార్యాభర్తల సంబంధం (1988)
  4. కెప్టెన్ నాగార్జున (1986)
  5. బెరార్ (1983)
  6. ఎస్.పి.భయంకర్ (1983)
  7. రాస్తె ప్యార్ కీ (1982)
  8. దసరా బుల్లోడు (1971)
  9. అక్కా చెల్లెలు (1970)
  10. అదృష్టవంతులు (1969)
  11. ఆస్తిపరులు (1966)
  12. అంతస్తులు (1965)
  13. ఆత్మబలం (1964)
  14. ఆరాధన (1962)
దర్శకునిగా (14 సినిమాలు)
  1. భార్యాభర్తల సంబంధం (1988)
  2. కెప్టెన్ నాగార్జున (1986)
  3. బెరార్ (1983)
  4. ఎస్.పి.భయంకర్ (1983)
  5. రాస్తె ప్యార్ కీ (1982)
  6. పట్టక్కట్టి బైరవన్‌ (1979)
  7. రామకృష్ణులు (1978)
  8. బంగారు బొమ్మలు (1977)
  9. ఉత్తమన్‌ (1976)
  10. పిచ్చిమారాజు (1975)
  11. మంచి మనుషులు (1974)
  12. ఎంగల్ తంగ రాజ (1973)
  13. బంగారు బాబు (1972)
  14. దసరా బుల్లోడు (1971)
రచయితగా (1 సినిమా)
  1. కెప్టెన్ నాగార్జున (1986) (కథ, కథనం)

అవార్డులు

జాతీయ అవార్డులు

అంతస్తులు (1965) - ఉత్తమ ప్రాంతీయ చిత్రం

ఫిలింఫేర్ అవార్డులు
  1. అంతస్తులు (1965)- ఉత్తమ చిత్రం
  2. ఆస్తిపరులు (1966)- ఉత్తమ చిత్రం
నంది అవార్డులు

రఘుపతి వెంకయ్య జీవన సాఫల్య పురస్కారం (2003)

ఇతర అవార్డులు

కె.వి. రెడ్డి మొమోరియల్ పురస్కారం

మరణం

ఈయన తీవ్రమైన అస్వస్థతకు గురై హైదరాబాద్ లోని ఇషా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2015, జనవరి 12 సోమవారం రోజున మరణించారు. మరణానికి ముందు ఫిల్మ్ నగర్ లో దేవాలయ నిర్మాణానికి నడుంకట్టి, దైవసన్నిధానాన్ని ఏర్పాటు చేసాడు.


మూలాలు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.