దసరా బుల్లోడు

1971 సినిమా From Wikipedia, the free encyclopedia

దసరా బుల్లోడు
Remove ads

దసరా బుల్లోడు సినిమా 1971, జనవరి 13వ తేదీన సంక్రాంతి కానుకగా విడుదలయ్యింది. జగపతి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై వి. బి.రాజేంద్రప్రసాద్ నిర్మించి, దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు వాణీశ్రీ, చంద్రకళ ముఖ్య పాత్రలు పోషించారు. సంగీతం కె వి మహదేవన్ సమకూర్చారు .

త్వరిత వాస్తవాలు దర్శకత్వం, నిర్మాణం ...
Remove ads

తారాగణం

సాంకేతిక వర్గం

దర్శకుడు: వి బి రాజేంద్రప్రసాద్

సంగీతం: కె వి మహదేవన్

నిర్మాణ సంస్థ: జగపతి ఆర్ట్ పిక్చర్స్

సాహిత్యం:ఆచార్య ఆత్రేయ

గానం:ఘంటసాల, పి సుశీల, పిఠాపురం ,ఎస్ జానకి

విడుదల:01:13:1971.

పాటలు

  1. అరెరెరెరె.... ఎట్టాగో వున్నాది ఓలమ్మీ ఏటేటో అవుతుందే చిన్నమ్మి - ఘంటసాల, పి.సుశీల
  2. ఓ మల్లయ్యగారి ఎల్లయ్యగారి కల్లబొల్లి బుల్లయ్యో అయ్యా బుల్లయ్యా - ఘంటసాల, పిఠాపురం బృందం
  3. చేతిలో చెయ్యేసి చెప్పుబావా చేసుకున్న బాసలు చెరిగిపోవనిమరచి పోనని - పి.సుశీల, ఘంటసాల
  4. చేతిలో చెయ్యేసి చెప్పుబావా చేసుకున్న బాసలు చెప్పుకున్న ఊసులు చెరిపివేస్తానని మరిచిపొతాననీ- పి.సుశీల
  5. నల్లవాడే అమ్మమ్మో అల్లరి పిల్లవాడే చిన్నవాడే అయ్యయ్యో మనచేత - పి.సుశీల, ఎస్.జానకి, ఘంటసాల
  6. నల్లవాడే అమ్మమ్మో అల్లరి పిల్లవాడే చిన్నవాడే ఓయమ్మా రాధకే చిక్కినాడే - పి.సుశీల, ఎస్. జానకి
  7. పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్లోయి నీ పైటకొంగు జారిందే గడుసుపిల్లా - ఘంటసాల, పి.సుశీల
  8. వినరా సూరమ్మ వీరగాధలు వీనులవిందుగా - ఘంటసాల, పిఠాపురం బృందం
  9. వెళ్ళిపోతున్నావా అమ్మా ఇల్లు విడిచి నన్ను మరచి వెళ్ళిపోతున్నావా - ఘంటసాల
  10. స్వార్ధమే తాండవించు ఈ జగతిలోన మంచి ఇంకను కలదని మనకు తెలుప (సాకీ) - ఘంటసాల

విశేషాలు

  • ఈ సినిమాను జితేంద్ర హీరోగా, రేఖ, షబానా అజ్మీలు నాయికలుగా హిందీలో "రాస్తే ప్యార్ కే" అనే పేరుతో పునర్మించారు.

వనరులు

  • ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి.
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads