2006 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
మిల్టన్ ఫ్రీడ్మాన్
మార్చి 26 : దుక్కిపాటి మధుసూదనరావు , సినీ నిర్మాత . (జ.1917)
ఏప్రిల్ 12 : రాజ్‌కుమార్ , భారత చలనచిత్ర నటుడు, గాయకుడు. (జ.1929)
ఏప్రిల్ 19 : సర్దార్ గౌతు లచ్చన్న , ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ కు రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, ఆంధ్ర రాష్ట్ర మంత్రి,స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1909)
ఏప్రిల్ 29 : జాన్ కెన్నెత్ గాల్‌బ్రెత్ , ఆర్థికవేత్త. (జ.1908)
మే 6 : తిక్కవరపు పఠాభిరామిరెడ్డి , రచయిత, సినిమా నిర్మాత. (జ.1919)
జూన్ 4 : బూదరాజు రాధాకృష్ణ , భాషావేత్త. (జ.1932)
జూలై 1 : కొరటాల సత్యనారాయణ , ఆంధ్ర కమ్యూనిస్ట్ ఉద్యమ నేత. (జ.1923)
జూలై : గడియారం రామకృష్ణ శర్మ , మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన సాహితీవేత్త. (జ.1919)
జూలై 8 : రాజారావు , ఆంగ్ల నవలా, కథా రచయిత. పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత. (జ.1908)
ఆగష్టు 4 : నందిని సత్పతీ , ఒరిస్సా మాజీ ముఖ్యమంత్రి (జ.1931)
ఆగష్టు 12 : మల్లవరపు జాన్ , తెలుగు కవి. (జ.1927)
ఆగష్టు 15 : జి. వి. సుబ్రహ్మణ్యం , వైస్ ఛాన్సలర్, ఆచార్యుడు. (జ.1935)
ఆగష్టు 18 : కొండపల్లి పైడితల్లి నాయిడు , 11వ, 12వ, 14వ లోక్‌సభ లకు ఎన్నికైన పార్లమెంటు సభ్యుడు. (జ.1930)
ఆగష్టు 28 : డి.వి. నరసరాజు , రంగస్థల, సినిమా నటుడు, రచయిత, దర్శకుడు. (జ.1920)
సెప్టెంబరు 28 : ఎస్.వి.ఎల్.నరసింహారావు , న్యాయవాది, స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1911)
అక్టోబర్ 3 : ఇ.వి.సరోజ , 1950, 60 వ దశకపు తమిళ, తెలుగు సినిమా నటి, నాట్య కళాకారిణి. (జ.1935)
అక్టోబర్ 13 : హీరాలాల్ మోరియా , పత్రికా రచయిత, నవలా రచయిత, సమరయోధుడు. (జ.1924)
నవంబరు 11 : కప్పగంతుల మల్లికార్జునరావు , కథా, నవలా, నాటక రచయిత . (జ.1936)
నవంబర్ 16 : మిల్టన్ ఫ్రీడ్మన్ , అమెరికాకు చెందిన ఆర్థికవేత్త, నోబెల్ బహులతి గ్రహీత. (జ.1912)
నవంబర్ 22 : అసీమా చటర్జీ , భారతీయ మహిళా రసాయన శాస్త్రవేత్త. (జ.1917)
నవంబర్ 26 : జి.వరలక్ష్మి , తెలుగు సినిమానటి. (జ.1926)
డిసెంబర్ 30 : పేకేటి శివరాం , తెలుగు సినిమా నటుడు. (జ.1918)