2009

From Wikipedia, the free encyclopedia

Remove ads

2009 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము. 2009లో స్థానికంగా, జాతీయంగా, అంతర్జాతీయంగా ఎన్నో ముఖ్యమైన పరిణామాలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ ఎన్నికలలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారం చేపట్టడం, కొద్దిరోజులకే వై.ఎస్.రాజశేఖరరెడ్డి మరణించడం, రోశయ్య నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం జరిగాయి. అక్టోబరు మొదటివారంలో కృష్ణా, తుంగభద్ర వరదల వలన వందలాది గ్రామాలు, మంత్రాలయం, కర్నూలు లాంటి పట్టణాలు నీటమునిగాయి. జాతీయంగా జరిగిన ముఖ్యపరిణామాలలో కేంద్రంలో మళ్ళీ యు.పి.ఏ.అధికారంలో కొనసాగింది. స్వైన్ ఫ్లూ వ్యాధి దేశమంతటా హడలెత్తించింది. మహారాష్ట్ర, హర్యానా, అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో మూడింటిలోనూ కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను పొందినది. ప్రత్యేక తెలంగాణ కోసం తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు ఆమరణ దీక్ష చేపట్టడం, కేంద్రం ప్రత్యేక తెలంగాణా ఏర్పాటుకు సుముఖం వ్యక్తం చేయడం, ఆ తరువాత ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో అల్లర్లు, మళ్ళీ కేంద్రం మాటమార్చడంతో తెలంగాణ పోరాటాల అగ్ని గుండంగా మారింది.

Remove ads

సంఘటనలు

జనవరి 2009

  • జనవరి 5: జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణస్వీకారం.
  • జనవరి 6: బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా షేక్ హసీనా ప్రమాణస్వీకారం.
  • జనవరి 9: సత్యం కంప్యూటర్స్ మాజీ చైర్మెన్ బి.రామలింగరాజు అరెస్టు.
  • జనవరి 9: ప్రపంచ తెలుగు సమాఖ్య 8వ ద్వైవార్షిక సమావేశాలు విజయవాడలో ప్రారంభమయ్యాయి.
  • జనవరి 9: లోక్‌సత్తా అధ్యక్షుడిగా జయప్రకాశ్ నారాయణ్ ఎన్నికైనాడు.
  • జనవరి 16: 2008-09 రంజీట్రోఫిని ముంబాయి జట్టు చేజిక్కించుకుంది.
  • జనవరి 31: సోమాలియా అధ్యక్షుడిగా షేక్ షరీఫ్ అహ్మద్ ఎన్నికయ్యాడు.
  • జనవరి 31: ఆస్ట్రేలియన్ ఓపెన్ బాలుర విభాగంలో భారత్‌కు చెందిన యుకీ భాంబ్రీ టైటిల్ నెగ్గి ఆస్ట్రేలియన్ ఓపెన్ జూనియర్ టైటిల్ పొందిన తొలి భారతీయుడిగా అవతరించాడు.

ఫిబ్రవరి 2009

  • ఫిబ్రవరి 1:ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత్‌కు చెందిన మహేశ్ భూపతి, సానియా మీర్జా జంట విజయం సాధించింది.
  • ఫిబ్రవరి 1:ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల టెన్నిస్ టైటిల్‌ను స్పెయిన్‌కు చెందిన రఫెల్ నాథల్ కైవసం చేసుకున్నాడు.
  • ఫిబ్రవరి 9: దులీప్ ట్రోఫి క్రికెట్‌లో వెస్ట్ జోన్ కైవసం చేసుకుంది.
  • ఫిబ్రవరి 9: చండీగఢ్లో జరిగిన పంజాబ్ గోల్డ్ కప్ హాకీ టోర్నమెంటు ఫైనల్లో నెదర్లాండ్స్ భారతజట్టుపై నెగ్గి ట్రోఫీ సాధించింది.
  • ఫిబ్రవరి 11: బంగ్లాదేశ్ అధ్యక్షుడిగా జిల్లూర్ రెహమాన్ ఎంపికయ్యాడు.
  • ఫిబ్రవరి 11: జింబాబ్వే ప్రధానమంత్రిగా మోర్గాన్ సాంగిరాయ్ ఎన్నికయ్యాడు.
  • ఫిబ్రవరి 23: 91వ అకాడమీ అవార్డులలో భారతదేశానికి చెందిన ఏ.ఆర్.రెహమాన్‌కు రెండు ఆస్కార్ అవార్డులు లభించాయి.
  • ఫిబ్రవరి 25: అక్రమ ఆస్తుల కేసులో మాజీ కేంద్ర మంత్రి సుఖ్‌రాంకు ఢిల్లీ హైకోర్టు మూడేళ్ళ జైలు శిక్ష విధించింది.
  • ఫిబ్రవరి 25: బంగ్లాదేశ్లో బంగ్లాదేశ్ రైఫిల్స్ దళం తిరుగుబాటు. 73 మంది సైనికులు మృతిచెందారు.

మార్చి 2009

ఏప్రిల్ 2009

  • ఏప్రిల్ 12: థాయిలాండ్ లోని పట్టాయ నగరంలో ఆసియాన్ దేశాల కూటమి శిఖరాగ్ర సమావేశం ప్రారంభమైనది.
  • ఏప్రిల్ 13: మలేషియాలో జరిగిన అజ్లాన్ షా హాకీ టోర్మమెంటులో భారత్ 3-1 స్కోరుతో మలేషియాపై విజయం సాధించి టైటిల్ గెలుచుకుంది.
  • ఏప్రిల్ 14: మహీంద్రా గ్రూపునకు చెందిన టెక్ మహీంద్రా సత్యం సాప్ట్‌వేర్ సంస్థను టేకోవర్ చేసుకుంది.
  • ఏప్రిల్ 15: భారతదేశ సార్వత్రిక ఎన్నికలు: దేశవ్యాప్తంగా 124 లోక్‌సభ స్థానాలలో ఎన్నికలు జరిగాయి.
  • ఏప్రిల్ 19: భారతదేశపు మొట్టమొదటి రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించింది.
  • ఏప్రిల్ 21: భారతదేశపు ప్రధాన ఎన్నికల కమీషనర్‌గా నవీన్ చావ్లా బాధ్యతలు చేపట్టాడు.
  • ఏప్రిల్ 21: అమెరికాలోని ప్రవాసాంధ్రుల సంఘం (తానా) తదుపరి అధ్యక్షుడిగా తోటకూర ప్రసాద్ ఎన్నికయ్యాడు.
  • ఏప్రిల్ 30: 9 రాష్ట్రాల పరిధిలోని 107 లోక్‌సభ నియోజకవర్గాలలో ఎన్నికలు జరిగాయి.

మే 2009

  • మే 12: మేఘాలయా ముఖ్యమంత్రిగా డి.డి.లపాంగ్ నియమితులయ్యాడు.
  • మే 21: జర్మనీ అధ్యక్షుడిగా హర్ట్స్ కొహ్లర్ రెండోసారి ఎన్నికయ్యాడు.
  • మే 23: ఐపిఎల్-2 విజేతగా హైదరాబాద్ దక్కన్ చార్జర్స్ నిలిచింది.
  • మే 26: ఉత్తర కొరియా రెండోసారి అణుపరీక్షలు నిర్వహించింది.
  • మే 28: ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి మహిళా హోంమంత్రిగా సబితా ఇంద్రారెడ్డి ప్రమాణస్వీకారం.
  • మే 28: భారత వైమానిక దళ కొత్త అధిపతిగా వి.వి.నాయక్ బాధ్యతలు చేపట్టాడు.

జూన్ 2009

జూలై 2009

ఆగష్టు 2009

  • ఆగష్టు 2: బ్రిటన్ పౌరసత్వం పొందడానికి నివాసకాల వ్యవధిని గతంలో ఉన్న 5 సం.ల నుంచి 10 సం.లకు పెంచారు.
  • ఆగష్టు 4: భారతదేశంలో తొలి స్వైన్ ఫ్లూ మరణం మహారాష్ట్రలోని పూణెలో నమోదైంది.
  • ఆగష్టు 5: టర్కీ అధ్యక్షుడిగా మహ్మద్ అలీ సహేన్‌ను ఆ దేశ పార్లమెంటు ఎన్నుకొంది.
  • ఆగష్టు 7: ఉత్తరాఖండ్ గవర్నర్‌గా మార్గరేట్ ఆల్వా ప్రమాణస్వీకారం.
  • ఆగష్టు 10: ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పోటీలు హైదరాబాదులో ప్రారంభమయ్యాయి.
  • ఆగష్టు 10: పంజాబ్ ఉప-ముఖ్యమంత్రిగా సుఖ్‌బీర్ సింగ్ ప్రమాణస్వీకారం చేశాడు.
  • ఆగష్టు 11: భారత ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మెన్‌గా సి.రంగరాజన్ నియమించబడ్డాడు.
  • ఆగష్టు 12: ప్రపంచంలో ఏ ప్రాంతాన్నైనా వీక్షించగలిగే సాంకేతిక పరిజ్ఞానం 'భువన్'ను ఇస్రో శాస్త్రవేత్తలు రూపొందించారు.
  • ఆగష్టు 13: ఇండియన్ క్రికెట్ లీగ్ ఆటగాళ్ళు ఐపిఎల్‌లో ఆడడానికి బిసిసిఐ అంగీకరించింది.
  • ఆగష్టు 15: భారత విప్లవ వీరుడు భగత్ సింగ్ 18 అడుగుల కాంస్య విగ్రహాన్ని పార్లమెంటు హౌస్ కాంప్లెక్స్‌లో ఆవిష్కరించబడింది.
  • ఆగష్టు 30: చైనీస్ గ్రాండ్‌ప్రి టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయ జోడిగా దిజు, గుత్తాజ్వాలా రికార్డు సృష్టించారు.
  • ఆగష్టు 31: నెహ్రూ కప్ ఫుట్‌బాల్‌ను భారత జట్టు గెలుచుకుంది. ఫైనల్లో సిరియాను 6-5 గోల్స్ తేడాతో ఓడించింది.
  • ఆగష్టు 31: భారత నౌకాదళ ప్రధానాధికారిగా నిర్మల్ వర్మ పదవీ బాధ్యతలు చేపట్టాడు.

సెప్టెంబర్ 2009

అక్టోబరు 2009

నవంబర్ 2009

డిసెంబర్ 2009

Remove ads

మరణాలు

Thumb
2009 జనవరి 28న మరణించిన భారత మాజీ రాష్ట్రపతి ఆర్.వెంకటరామన్
Thumb
2009 సెప్టెంబరు 2న మరణించిన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి
Remove ads

అవార్డులు / పురష్కారాలు

  • మ్యాన్ ఆఫ్ బుకర్ అంతర్జాతీయ పురస్కారం: ఎలిన్ మన్రో (కెనడా)
  • ఇందిరాగాంధీ శాంతిబహుమతి: ఎల్ బదారీ.
  • విశిష్ట హిందీ సేవా సమ్మాన్: యార్లగడ్డ లక్ష్మీప్రసాద్.
  • బుకర్ బహుమరి: హిలరీ మాటెల్ (బ్రిటన్ రచయిత్రి)

నోబెల్ బహుమతులు

Thumb
2009 నోబెల్ శాంతిబహుమతి గ్రహీత బరాక్ ఒబామా
  • శాంతి: బరాక్ ఒబామా.
  • అర్థశాస్త్రం: ఇలినార్ ఆస్ట్రమ్, ఆలివర్ విలియంసన్.
  • సాహిత్యం: హెర్టా ముల్లర్.
  • రసాయనశాస్త్రం: వెంకటరామన్ రామకృష్ణన్, థామస్-ఏ-స్టీల్జ్, అడా-ఇ-యోమత్.
  • భౌతికశాస్త్రం: చార్లెస్-కె-కావొ, విల్లార్డ్-ఎస్-బాయిల్, జార్జి-ఇ-స్మిత్.
  • వైద్యం: ఎలిజబెత్ బ్లాక్‌బర్న్, కరోల్ గ్రీడర్, జాక్ జోస్టక్.
Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads