2026 ఫిఫా ప్రపంచ కప్
From Wikipedia, the free encyclopedia
2026 లో జరిగే ఫిఫా ప్రపంచ కప్, ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచ కప్ పోటీల్లో 23 వది. ఇది ఫిఫా సభ్య దేశాల జాతీయ జట్లు పోటీ చేసే చతుర్వార్షిక అంతర్జాతీయ పురుషుల ఫుట్‌బాల్ ఛాంపియన్షిప్. ఈ టోర్నమెంటును ఉత్తర అమెరికా ఖండం లోని మూడు దేశాలు - కెనడా, మెక్సికో, అమెరికా - లోని 16 నగరాలు సంయుక్తంగా నిర్వహించనున్నాయి. క్వార్టర్ ఫైనల్స్ నుండి జరిగే మ్యాచ్ లన్నీ అమెరికా లోనే జరుగుతాయి. అమెరికా మొత్తం అరవై మ్యాచ్‌లను నిర్వహిస్తుంది. కెనడా, మెక్సికోలు చెరొక 10 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇస్తాయి. మూడు దేశాలు కలిసి ఆతిథ్యం ఇచ్చే తొట్టతొలి ఫుట్‌బాల్ ప్రపంచ కప్పు ఇది. [1] [2] ఈ టోర్నమెంటులో మొత్తం 48 జట్లు పాల్గొంటాయి. 48 జట్లు ఆడే ఫుట్‌బాల్ ప్రపంచ కప్పు పోటీలు కూడా ఇవే. [3] మాస్కోలో జరిగిన 68వ FIFA కాంగ్రెస్‌లో ఈ మూడు దేశాలు మొరాకో ను ఓడించి ఆతిథ్య హక్కును గెలుచుకున్నాయి. 2002 తర్వాత ఒకటి కంటే ఎక్కువ దేశాలు ఆతిథ్యమిస్తున్న తొలి ప్రపంచ కప్పు గాను, రెండు కంటే ఎక్కువ దేశాలు నిర్వహించే తొలి ప్రపంచ కప్పు గానూ ఇది నిలిచింది. 1970, 1986 లలో జరిగిన టోర్నమెంటులకు ఆతిథ్యమివ్వడంతో, మెక్సికో మూడుసార్లు పురుషుల ప్రపంచ కప్‌కు ఆతిథ్యమిచ్చిన లేదా సహ-ఆతిథ్యం ఇచ్చిన మొదటి దేశంగా అవతరించింది. అమెరికా ఆతిథ్యమిచ్చిన చివరి ప్రపంచ కప్ 1994 లో జరిగింది. కెనడా, పురుషుల టోర్నమెంటుకు ఆతిథ్యమివ్వడం ఇదే మొదటిసారి.
కెనడా/మెక్సికో/అమెరికా 2026 | |
---|---|
టోర్నమెంటు వివరాలు | |
ఆతిథ్య దేశాలు | కెనడా మెక్సికో అమెరికా |
తేదీలు | 2026 జూన్–జూలై |
జట్లు | 48 (6 కాన్ఫెడరేషన్ల నుండి) |
వేదిక(లు) | 16 (16 ఆతిథ్య నగరాల్లో) |
← 2022 2030 → |