అల్ ఘజాలి
From Wikipedia, the free encyclopedia
Remove ads
అబూ హామిద్ మొహమ్మద్ ఇబ్న్ మొహమ్మద్ అల్-ఘజాలీ Abu Hāmed Mohammad ibn Mohammad al-Ghazzālī (1058-1111) (పర్షియన్ : ابو حامد محمد ابن محمد الغزالی ), టర్కిష్ : İmâm-ı Muhammed Gazâlî, అల్-గాజెల్ గా కూడా ప్రసిద్ధి. పర్షియా లోని ఖోరాసాన్లో జన్మించాడు. ముస్లిం పండితుడు, ధార్మిక తత్వవేత్త.[3]
Remove ads
కార్యాలు

అల్-ఘజాలి ప్రకారం ప్రభుత్వాధినేతకు కావలసిన లక్షణాలు
అల్-ఘజాలి "నసీహత్ అల్-ములూక్" లేదా "రాజులకు హితబోధలు" సెల్జూఘ్ ఖలీఫా కొరకు వ్రాశాడు. ఇతని ప్రకారం దశ హితబోధలు రాజుకు తనరాజ్యపరిపాలన కొరకు కనీసం వుండవలసిన సూత్రాలని సూచించాడు.
- తన భుజస్కంధాలపై ఉంచబడిన బాధ్యతల ప్రాముఖ్యాన్ని, అపాయాన్ని, రాజు గ్రహించవలెను. అధికారం ఒక వరం, ఈ అధికారాన్ని ధర్మబధ్ధంగా చెలాయిస్తే ఇటు రాజుకూ అటు ప్రజకూ అనంత సుఖఃసంతోషాలు కలుగును, లేనిచో ఇటు రాజూ అటు ప్రజలూ దుఖః పాతానికి లోనౌతారు.
- రాజు ఎల్లప్పుడూ ధార్మిక పండితులకు సంప్రదించడానికి తహతహలాడాలి, వీరి సలహాలు తీసుకొని రాజ్యాన్ని సుబిక్షంగా పాలించాలి.
- పరస్త్రీవ్యామోహాన్ని తానూ త్యజించాలి తన అధికారవర్గం త్యజించాలి. అన్యాయాన్ని తానూ తన అధికారగణం సహించకూడదు. రాజు తన స్వంత జీవనచర్యల న్యాయాన్యాయాలను విచారించాలి, అలాగే తన అధికారగణ జీవనచర్యల న్యాయాన్యాయాలను విచారించాలి, అన్యాయాలుంటే శిక్షించాలి.
- రాజు నిగర్విగాను, కోపతాపాలకు దూరంగానూ, పగ ద్వేషాలకు అతీతంగానూ ఉండాలి. కోపము జ్ఞానుల శత్రువుగా గుర్తించాలి. తనపాలనలో శాంతి, క్షమా, దయా కారుణ్యాలపట్ల తనూ తలొగ్గాలి ఇతరులనూ తలొగ్గేలా చేయాలి. క్షమాగుణాలను అలవర్చుకొనేలాచేయాలి.
- ప్రతివిషయ సన్నివేశంలో రాజు తనకు తాను ప్రజగా భావించి ప్రజలకు అధికారులుగా భావించి కార్యక్రమాలు చేయాలి. తనకొరకు ఏమికోరుకుంటాడో ఇతరులకూ అవే అందజేయాలి. ఇలా చేస్తేనే తన అధికారాలను సద్వినియోగం చేస్తున్నట్లు.
- రాజు న్యాయస్థానంలో ఫిర్యాదు దారుల ఫిర్యాదులను స్వయంగా పరిశీలించవలెను. ఫిర్యాది యొక్క సాధక బాధకాలను తెలుసుకోవడం రాజు యొక్క విద్యుక్తధర్మం. అన్యాయానికి తావు లేకుండా చూడవలసిన బాధ్యతకూడా రాజుదే.
- రాజు అలంకారాలకు మోజులకు వ్యామోహాలకు బానిస కారాదు. అసలు వీటి జోలికే పోరాదు. హుందాగావుంటూ రాజ్యానికి మకుటంలా ఉండాలి గాని, అహంకారానికి పోయి రాజ్యానికి చీడ తేకూడదు.
- రాజు మృదువుగా మెలగడం అలవర్చుకోవాలి, క్రూరంగాను, అసభ్యంగాను, హింసించువాడు గాను ఉండకూడదు.
- రాజును ప్రజలందరూ మెచ్చుకొనేలా రాజు మసలుకోవాలి. ప్రజలను గదమాయించి తనను పొగిడేలా చేసుకొనే రాజు అత్యల్పుడు. ప్రజలలో తనపట్లగల భావాలను ఎప్పటికప్పుడు తెలుసుకొంటూ తన తప్పులున్నయెడల వాటిని తెలుసుకొని దిద్దుకుంటూ ప్రజలనోటిలో నాలుకలా మెలగాలి.
- అల్లాహ్ ను సంతుష్టుడిని చేసేందుకు ప్రతికార్యం సలపాలి. ఓ ప్రజ దగ్గర మెప్పు కోసం అల్లాహ్ ను వ్యతిరేకిగా చేసుకోరాదు. ఒకరిని అసంతుష్టుడిని చేసి అల్లాహ్ ను సంతుష్టుడిని చేయడం ఉత్తమం. ఒకరిని సంతుష్టుడిని చేసి అల్లాహ్ ను అసంతుష్టుడు చేయడం జరగరాదు.
Remove ads
ఘజాలీ ప్రభావం
రచనల జాబితా
నోట్స్
మూలాలు
బయటి లింకులు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads