ఇంద్రజిత్ సింగ్ బింద్రా స్టేడియం

From Wikipedia, the free encyclopedia

ఇంద్రజిత్ సింగ్ బింద్రా స్టేడియం
Remove ads

ఇంద్రజిత్ సింగ్ బింద్రా స్టేడియం పంజాబ్‌లోని మొహాలీలో ఉన్న క్రికెట్ మైదానం. ఇది మొహాలి స్టేడియంగా ప్రసిద్ధి చెందింది. పంజాబ్ జట్టుకు నిలయంగా ఉన్న ఈ స్టేడియం గీతాంశు కాల్రా నిర్మించాడు. స్టేడియం నిర్మాణానికి సుమారు 3 సంవత్సరాలు, 25 కోట్ల సొమ్మూ ఖర్చైంది.[1] అధికారికంగా స్టేడియం సామర్థ్యం 26,950.[2] ఈ స్టేడియంను అరుణ్ లూంబా అండ్ అసోసియేట్స్ రూపొందించగా, చండీగఢ్‌లో ఉన్న RS కన్‌స్ట్రక్షన్ కంపెనీ నిర్మించింది. [3] ఇంద్రజిత్ సింగ్ బింద్రా స్టేడియం పంజాబ్ క్రికెట్ జట్టు, పంజాబ్ కింగ్స్ (ఐపీఎల్ ఫ్రాంచైజీ) కి నిలయం. ఈ స్టేడియంకు బీసీసీఐ మాజీ అధ్యక్షుడు & పీసీఏ మాజీ అధ్యక్షుడు ఇందర్‌జిత్ సింగ్ బింద్రా పేరు పెట్టారు.

త్వరిత వాస్తవాలు Location, Owner ...

ఇతర క్రికెట్ స్టేడియాలతో పోలిస్తే ఇక్కడ ఫ్లడ్‌లైట్లు చాలా తక్కువ ఎత్తులో ఉంటాయి. సమీపంలోని చండీగఢ్ విమానాశ్రయం నుండి విమానాలు లైట్ స్తంభాలను ఢీకొనడాన్ని నివారించడానికి ఇలా చేసారు. స్టేడియంలో 16 ఫ్లడ్‌లైట్లు ఉండడానికి కారణం అదే. 2019 డిసెంబరు నాటికి, ఇక్కడ 13 టెస్టులు, 25 వన్‌డేలు, 5 T20Iలూ జరిగాయి.

Remove ads

చరిత్ర

ఈ స్టేడియంను మొహాలి స్టేడియం లేదా పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం అని కూడా అంటారు. ఇది భారతదేశంలో 19వ టెస్ట్ క్రికెట్ వేదిక. పిచ్ జీవంతో, పేస్ బౌలర్లకు మద్దతుగా ఉంటుందని పేరు పొందింది. అయితే నిదానంగా ఇది నెమ్మదించి, స్పిన్ బౌలింగ్‌కు కూడా సహాయపడుతోంది. ఇది 1993 నవంబరు 22న హీరో కప్ సందర్భంగా భారత దక్షిణాఫ్రికా ల వన్ డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌తో ప్రారంభమైంది.ఆ తరువాతి సీజన్‌లో, 1994 డిసెంబరు 10 న, ఇక్కడి మొదటి టెస్ట్ మ్యాచ్ భారత వెస్టిండీస్ ల మధ్య జరిగింది [4] 1996 ఫిబ్రవరిలో ఆస్ట్రేలియా, వెస్టిండీస్ మధ్య జరిగిన క్రికెట్ ప్రపంచ కప్ సెమీ-ఫైనల్ మ్యాచ్ ఈ మైదానంలో జరిగిన అత్యంత ప్రసిద్ధ వన్డే మ్యాచ్‌లలో ఒకటి. ఇంద్రజిత్ సింగ్ బింద్రా స్టేడియం 2011 ప్రపంచ కప్‌లో 3 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చింది. వాటిలో 2011 మార్చి 20 న భారత పాకిస్తాన్ మధ్య జరిగిన రెండవ సెమీ-ఫైనల్ మ్యాచ్‌ ఒకటి. ఈ మ్యాచ్‌కు భారత ప్రధాని మన్మోహన్ సింగ్, పాకిస్థాన్‌ ప్రధాని యూసఫ్ రజా గిలానీలు హాజరయ్యారు. క్రికెట్ దౌత్యానికి ఇదొక ఉదాహరణ. ఈ మ్యాచ్‌లో భారత్‌ విజయం సాధించింది.


ఫ్రీడమ్ ట్రోఫీ 2015 తొలి టెస్టు మొహాలీలో జరిగింది. ఆ టెస్ట్ సమయంలో, భారత స్పిన్నర్లకు పిచ్ నుండి భారీ మద్దతు లభించింది. ఆ మ్యాచ్‌లో భారత్ భారీ తేడాతో విజయం సాధించింది. మొహాలీలో పిచ్ నుండి స్పిన్నర్లకు పెద్ద ఎత్తున సహకారం లభించడం ఇదే మొదటి ఉదాహరణ.

2009 లో శ్రీలంకను భారత్ 6 వికెట్ల తేడాతో ఓడించిన మ్యాచ్‌తో ఈ మైదానంలో T20 అంతర్జాతీయ మ్యాచ్‌లు మొదలయ్యాయి. 2016 ICC వరల్డ్ ట్వంటీ20 లో 3 T20I మ్యాచ్‌లు ఇక్కడ జరిగాయి.

Thumb
A panorama of the stadium.

ఇందర్‌జిత్ సింగ్ బింద్రా స్టేడియానికి ప్రస్తుత పిచ్ క్యూరేటర్ దల్జిత్ సింగ్ [5]

Remove ads

గుర్తించదగిన సంఘటనలు

క్రికెట్ ప్రపంచ కప్ మ్యాచ్‌లు

స్టేడియంలో 4 ప్రపంచ కప్ మ్యాచ్‌లు జరిగాయి. 1996లో ఒక మ్యాచ్ (ఆస్ట్రేలియా, వెస్టిండీస్ ల మధ్య సెమీఫైనల్), 2011 ప్రపంచ కప్‌లో మూడు (భారత, పాకిస్తాన్ ల మధ్య సెమీఫైనల్‌తో సహా) ఇక్కడ జరిగాయి. 2016 ICC వరల్డ్ ట్వంటీ20లో 3 T20 మ్యాచ్‌లు కూడా ఈ స్టేడియంలో జరిగాయి,

1996 క్రికెట్ ప్రపంచ కప్ సెమీఫైనల్

మార్చి 14
స్కోరు
ఆస్ట్రేలియా 
207/8 (50 ఓవర్లు)
v
 వెస్ట్ ఇండీస్
202 (49.3 ఓవర్లు)
Stuart Law 72 (105)
Curtly Ambrose 2/26 (10 ఓవర్లు)
Shivnarine Chanderpaul 80 (126)
షేన్ వార్న్ 4/36 (9 ఓవర్లు)
ఆస్ట్రేలియా 5 పరుగులతో గెలిచింది
ఇందర్జిత్ బింద్రా స్టేడియం, మొహాలి
అంపైర్లు: B. C. Cooray, వెంకటరాఘవన్
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: షేన్ వార్న్ (Aus)

2011 క్రికెట్ ప్రపంచ కప్

2011 మార్చి 3
09:30
స్కోరు
South Africa 
351/5 (50 ఓవర్లు)
v
 Netherlands
120 (34.5 ఓవర్లు)
ఎబి డి విల్లియర్స్ 134 (98)
Ryan ten Doeschate 3/72 (10 ఓవర్లు)
Wesley Barresi 44 (66)
Imran Tahir 3/19 (6.5 ఓవర్లు)
South Africa won by 231 runs
ఇందర్జిత్ బింద్రా స్టేడియం, మొహాలి
అంపైర్లు: అశోక డిసిల్వా (SL), రిచర్డ్ కెటిల్‌బరో (Eng)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ఎబి డి విల్లియర్స్ (SA)
  • Netherlands won the toss and elected to field.

2011 మార్చి 11
09:30
స్కోరు
వెస్ట్ ఇండీస్ 
275 (50 ఓవర్లు)
v
 Ireland
231 (49 ఓవర్లు)
Devon Smith 107 (133)
Kevin O'Brien 4/71 (9 ఓవర్లు)
Ed Joyce 84 (106)
Sulieman Benn 4/53 (10 ఓవర్లు)
West Indies won by 44 runs
ఇందర్జిత్ బింద్రా స్టేడియం, మొహాలి
అంపైర్లు: అశోక డిసిల్వా (SL), షవీర్ తారాపూర్ (Ind)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: కీరన్ పొల్లార్డ్ (WI)
  • ఐర్లాండ్ టాస్ గెలిచి ఫీల్డింగు ఎంచుకుంది.

2011 క్రికెట్ ప్రపంచ కప్ సెమీఫైనల్

2011 మార్చి 30
14:30 (D/N)
స్కోరు
భారతదేశం 
260/9 (50 ఓవర్లు)
v
 Pakistan
231 (49.5 ఓవర్లు)
సచిన్ టెండూల్కర్ 85 (115)
Wahab Riaz 5/46 (10 ఓవర్లు)
Misbah-ul-Haq 56 (76)
Ashish Nehra 2/33 (10 ఓవర్లు)
ఇండియా 29 పరుగులతో గెలిచింది
ఇందర్జిత్ బింద్రా స్టేడియం, మొహాలి
అంపైర్లు: ఇయాన్ గౌల్డ్ (Eng), సైమన్ టఫ్నెల్ (Aus)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: సచిన్ టెండూల్కర్ (Ind)
  • ఇండియా టాస్ గెలిచి బ్యాటింగు ఎంచుకుంది

2016 వరల్డ్ ట్వంటీ20

మార్చి 22
19:30 (D/N)
స్కోరు
New Zealand 
180/5 (20 ఓవర్లు)
v
 Pakistan
158/5 (20 ఓవర్లు)
మార్టిన్ గప్టిల్ 80 (48)
మొహమ్మద్ సమీ 2/23 (4 ఓవర్లు)
Sharjeel Khan 47 (25)
ఆడం మిల్నే 2/25 (4 ఓవర్లు)
New Zealand won by 22 runs
ఇందర్జిత్ బింద్రా స్టేడియం, మొహాలి
అంపైర్లు: Richard Illingworth (Eng), నైజెల్ లాంగ్ (Eng)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: మార్టిన్ గప్టిల్ (NZ)
  • New Zealand won the toss and elected to bat.

మార్చి 25
15:00 (D/N)
స్కోరు
ఆస్ట్రేలియా 
193/4 (20 ఓవర్లు)
v
 Pakistan
172/8 (20 ఓవర్లు)
స్య్టీవ్ స్మిత్ 61* (43)
ఇమాద్ వసీం 2/31 (4 ఓవర్లు)
ఖాలిద్ లతీఫ్ 46 (41)
జేమ్స్ ఫాక్నర్ 5/28 (4 ఓవర్లు)
ఆస్ట్రేలియా 21 పరుగులతో గెలిచింది
ఇందర్జిత్ బింద్రా స్టేడియం, మొహాలి
అంపైర్లు: కుమార ధర్మసేన (SL), మారాయిస్ ఎరాస్మస్ (SA)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: జేమ్స్ ఫాక్నర్ (Aus)
  • ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగు ఎంచుకుంది.

మార్చి 27
19:30 (D/N)
స్కోరు
ఆస్ట్రేలియా 
160/6 (20 ఓవర్లు)
v
 భారతదేశం
161/4 (19.1 ఓవర్లు)
ఆరన్ ఫించ్ 43 (34)
హార్దిక్ పాండ్య 2/36 (4 ఓవర్లు)
విరాట్ కొహ్లి 82* (51)
షేన్ వాట్సన్ 2/23 (4 ఓవర్లు)
ఇండియా 6 వికెట్లతో గెలిచింది
ఇందర్జిత్ బింద్రా స్టేడియం, మొహాలి
అంపైర్లు: కుమార ధర్మసేన (SL), మారాయిస్ ఎరాస్మస్ (SA)
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: విరాట్ కొహ్లి (Ind)
  • ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగు ఎంచుకుంది.
Remove ads

రికార్డులు

పరీక్ష రికార్డులు

ODI రికార్డులు

  • అత్యధిక ODI మొత్తం: 393/3 – భారత్ vs. శ్రీలంక, 13 డిసెంబరు 2017
  • అత్యధిక వ్యక్తిగత ODI స్కోరు: 208 – రోహిత్ శర్మ, భారతదేశం vs శ్రీలంక, 13 డిసెంబరు 2017
  • ఉత్తమ ODI ఇన్నింగ్స్ బౌలింగ్ గణాంకాలు: 5/21 – మఖాయా ంటిని, సౌత్ ఆఫ్రికా vs. పాకిస్తాన్, 2006 ICC ఛాంపియన్స్ ట్రోఫీ, 27 అక్టోబరు 2006
  • అత్యధిక ODI భాగస్వామ్యం: 221 (3వ వికెట్‌కు) - హషీమ్ ఆమ్లా & AB డివిలియర్స్, దక్షిణాఫ్రికా vs. నెదర్లాండ్స్, 2011 క్రికెట్ ప్రపంచ కప్, 3 మార్చి 2011
  • వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రోహిత్ శర్మ (410 పరుగులు) రెండో స్థానంలో నిలిచాడు సచిన్ టెండూల్కర్ (366), ఎంఎస్ ధోని (363)
  • హర్భజన్ సింగ్ (11 వికెట్లు) అత్యధిక వికెట్లు పడగొట్టగా, గ్లెన్ మెక్‌గ్రాత్ (8), సక్లైన్ ముస్తాక్ (8) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

ట్వంటీ20 అంతర్జాతీయ రికార్డులు

IPL రికార్డులు [7]

Remove ads

ఇవి కూడా చూడండి

  • మహారాజా యదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం
  • సామర్థ్యం ఆధారంగా క్రికెట్ మైదానాల జాబితా

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads