గౌతమ్ గంభీర్
From Wikipedia, the free encyclopedia
Remove ads
1981 అక్టోబర్ 14 న ఢిల్లీ లోజన్మించిన గౌతమ్ గంభీర్ భారత క్రికెట్ ఆటగాడు. 2003 నుంచి వన్డేలలో, 2004 నుంచి టెస్టులలో భారత జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. దేశవాళీ క్రికెట్ లో రెండు డబుల్ సెంచరీలను సాధించి టెస్ట్ జట్టులో సెలెక్ట్ అయ్యాడు. స్వదేశంలో జరిగిన టూర్ గేమ్ లో డబుల్ సెంచరీ సాధించిన 4 వ భారతీయుడితను. ఇంతకు ముందు సునీల్ గవాస్కర్, దిలీప్ వెంగ్‌సర్కార్, సచిన్ టెండుల్కర్లు మాత్రమే ఈ ఘనత సాధించారు.
2000లో గంభీర్ బెంగుళూరు లోని నేషనల్ క్రికెట్ అకాడమీకి సెలెక్ట్ అయ్యాడు.[1] .2003లో బంగ్లాదేశ్తో జరిగిన టి.వి.ఎస్. కప్ లో మొదటి సారిగా వన్డే పోటీలను ఆడినాడు. అతని మూడవ మ్యాచ్ లోనే 71 పరుగులు సాధించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు పొందినాడు. 2005లో శ్రీలంక పై 97 బంతుల్లో 103 పరుగులు చేసి తన తొలి సెంచరీని నమోదుచేశాడు. 2004లో ఆస్ట్రేలియాతో జరిగిన నాల్గవ టెస్టులో గంభీర్ తన టెస్ట్ జీవితం ఆరంభించాడు. కాని ఆ టెస్టులో అతను ఏ మాత్రం ప్రతిభ కనబర్చలేకపోయాడు. 3, 1 పరుగు స్కోర్లకే ఔటైనాడు. అయిననూ అతని రెండో టెస్టులో దక్షిణాఫ్రికా పై 96 పరుగులు చేసి శభాష్ అనిపించుకున్నాడు. టెస్ట్ క్రికెట్ లో అతని తొలి శతకం 2004 డిసెంబర్లో బంగ్లాదేశ్ పై సాధించాడు. ఆ తర్వాత పాకిస్తాన్తో సిరీస్ లో మంచి శుభారంభం ఇచ్చిననూ 6 ఇన్నింగ్సులలోనూ కల్పి ఒకే అర్థ శతకం సాధించాడు. ఆ తర్వాత అదే సం.లో జింబాబ్వే పై 97 పరుగులు సాధించాడు. కాని శ్రీలంకతో జరిగిన సీరీస్ లో 30 పరుగుల స్కోరిను దాటలేకపోయాడు. తత్ఫలితంగా జట్టులో స్థానం కోల్పోయాడు. అతని స్థానంలో వసీం జాఫర్ జట్టులో స్థానం పొందాడు. 20, 30 పరుగులను పెద్ద స్కోర్లుగా మల్చే శక్తి లేదని విమర్శలు పొమ్దినాడు.
టెస్టు జట్టులో స్థానం కోల్పోయిన తర్వాత 2005, 2007 మధ్యలో వన్డే క్రికెట్ జట్టులో కూడా ఆడుతూ స్థానం కోల్పోతూ వచ్చాడు. 2007 ప్రపంచ కప్ క్రికెట్లో కూడా అతనికి స్థానం లభించలేదు. టాప్ ఆర్డర్ లో వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండుల్కర్, సౌరవ్ గంగూలీలు ఉండటంతో ఇతనికి అవకాశం ఇవ్వలేదు. కాని 2007 ప్రపంచ కప్ లో భారత జట్టు పేవలమైన ప్రదర్శనతో తొలి రౌండులోనే నిష్క్రమించడంతో ఆ తర్వాత జరిగిన బంగ్లాదేశ్ పర్యటించే వన్డే జట్టులో మళ్ళీ స్థానం సంపాదించాడు. ఆ సీరీస్ లో గంభీర్ తన రెండో శతకాన్ని నమోదుచేసి తదనంతరం ఐర్లాండ్ టూర్ కు ఎంపికైనాడు. తొలి మ్యాచ్ లోనే 80 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పొందినాడు.
గంభీర్ భారత్ తరఫున 54 టెస్టులు, 147 వన్డేలు, 37 టీ20లు ఆడాడు. 2007, 2011 ప్రపంచ కప్‌లను గెలుచుకున్న జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. అతని కెప్టెన్సీలో, కోల్‌కతా నైట్‌రైడర్స్ 2012, 2014లో ఛాంపియన్‌గా నిలిచింది.
Remove ads
రాజకీయ జీవితం
గౌతమ్ గంభీర్ 2019 మార్చి 22న భారతీయ జనతా పార్టీలో చేరి[2] 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా తూర్పు ఢిల్లీ నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి అర్విందర్ సింగ్ లవ్లీపై 3,90,391 ఓట్ల మెజారిటీతో తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా గెలిచాడు.[3][4]
బయటి లింకులు
- Cricinfo Profile: Gautam Gambhir Archived 2008-10-13 at the Wayback Machine
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads