న్యూ ఢిల్లీ
భారతదేశ రాజధాని నగరం, న్యూ ఢిల్లీ జిల్లా ముఖ్యపట్టణం From Wikipedia, the free encyclopedia
Remove ads
న్యూ ఢిల్లీ, ఇది భారత కేంద్రపాలిత ప్రాంతం, రాజధాని నగరం, ఢిల్లీ రాష్ట్రం లోని న్యూ ఢిల్లీ జిల్లా ముఖ్యపట్టణం, మహానగరం.
Remove ads
చరిత్ర
రాజధాని నగరం కొత్త ఢిల్లీ
క్రొత్త ఢిల్లీ ఇది భారతదేశపు రాజధాని. దీని విస్తీర్ణం 42.7 చదరపు కి.మీ. క్రొత్త ఢిల్లీ, ఢిల్లీ మెట్రోపాలిత ప్రాంతంలో ఉంది. ఇది భారత ప్రభుత్వ కేంద్రపాలిత ప్రాంతం పరిధిలో ఉంది.ఈ నగరాన్ని 20వ శతాబ్దంలో యునైటెడ్ కింగ్ డంకు చెందిన ఎడ్విన్ లుట్‌యెన్స్ నిర్మాణ నమూనా తయారుచేశాడు. ఈ నగరం తన విశాల మార్గాలు, వృక్ష-వరుసలు, అనేక సౌధాల కొరకు ప్రసిద్ధి.

ఆంగ్లేయుల పాలనా కాలమందు 1911 డిసెంబరు వరక భారత రాజధాని కలకత్తా నగరం వుండేది. ఆ తరువాత రాజధాని ఢిల్లీకి మార్చబడింది. కానీ ప్రాచీనకాలం నుండి ఢిల్లీ రాజకీయ కేంద్రంగా వుంటూ వస్తుంది. ప్రత్యేకంగా మొఘల్ సామ్రాజ్య కాలం నుండి మరీ ముఖ్యంగా 1799 నుండి 1849 వరకూ ఢిల్లీ కేంద్రంగా ఉంటూ వచ్చింది. 1900 ప్రారంభంలో బ్రిటిష్ పరిపాలనా కాలంలో భారత రాజధానిని, కలకత్తా నుండి ఢిల్లీకి మార్చాలనే ప్రతిపాదన వచ్చింది. కలకత్తా భారత్ కు ఈశాన్య దిశలోనూ, భారత్‌కు చెందిన అనేక ప్రాంతాలకు చాలా దూరంగా వుండేది. ఈ కారణాన బ్రిటిష్ రాజ్ పరిపాలనా సౌలభ్యం కొరకు రాజధానిని ఢిల్లీకి మార్చడమే ఉత్తమమని భావించింది. అప్పటి భారత చక్రవర్తి 5వ జార్జి, యునైటెడ్ కింగ్డం, భారత రాజధాని, కలకత్తా నుండి ఢిల్లీకి మార్చాలని ప్రకటించాడు.[6]
షాజహాన్ చే నిర్మింపబడిన పాతఢిల్లీకి దక్షిణాన క్రొత్త ఢిల్లీ ఉంది. క్రొత్త ఢిల్లీ ఏడు ప్రాచీన నగరాల ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతంలోనే "యంత్ర మందిరం" లేదా జంతర్ మంతర్, లోధీ గార్డెన్స్ మొదలగునవి ఉన్నాయి.

భారత స్వాతంత్ర్యం తరువాత, 1947 లో, కొద్దిపాటి స్వయం ప్రతిపత్తినిచ్చి, భారత ప్రభుత్వంచే నియమించబడ్డ ప్రధాన కమీషనర్ కు పరిపాలనాధికారాలు ఇవ్వబడ్డాయి. 1956 లో ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటింపబడింది, అలాగే ప్రధాన కమీషనర్ స్థానే లెఫ్టినెంట్ గవర్నరును నియమించారు. భారత రాజ్యాంగ (69వ సవరణ - 1991) ప్రకారం, పూర్వపు జాతీయ రాజధాని ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చారు.[7] డయార్కీ వ్యవస్థను పరిచయం చేశారు. ఈ వ్యవస్థలో ఎన్నికైన ప్రభుత్వానికి విశాలాధికారాలు ఇవ్వబడ్డాయి, లా ఆర్డర్ అధికారాలు మాత్రం కేంద్రప్రభుత్వ చేతులలో వుంటాయి. అసలు లెజిస్లేషన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ మాత్రం 1993 నుండి అమలులోకి వచ్చింది.
Remove ads
భౌగోళికం

క్రొత్త ఢిల్లీ మొత్తం వైశాల్యం 42.7 కి.మీ.2, ఢిల్లీ మెట్రోపాలిటన్ ప్రాంతంలోని ఒక చిన్న భాగం,[8] ఇండో-గంగా మైదానంలో గలదు. క్రొత్త ఢిల్లీ పొరుగు ప్రాంతాలు ఒకానొకప్పుడు ఆరవళీ పర్వతాలకు చెందినవి. కాని ప్రస్తుతం ఢిల్లీ రోడ్డులో ఉన్నాయి.. యమునా నది వరదప్రాంతంగానూ పరిగణింపబడుతుంది. క్రొత్త ఢిల్లీ యమునానదికి పశ్చిమభాగాన ఉంది. యమునా నదికి తూర్పు భాగాన షాహ్ దారా అను అర్బన్ ప్రాంతం ఉంది. క్రొత్త ఢిల్లీ భూకంప జోన్-IVలో ఉంది. పెద్ద పెద్ద భూకంపాలొచ్చే ప్రాంతంగా గుర్తించబడింది.[9]
క్రొత్తఢిల్లీ, సమశీతోష్ణ మండల వాతావరణంతో ఉంటుంది. సముద్రతీరం దూరంగా వుండడం కారణంగా పర్వతప్రాంతాల మధ్య ఉన్న కారణంగా ఇచ్చటి వేసవి వాతావరణం అత్యుష్ణ మండల ఉష్ణోగ్రతలా 40 డిగ్రీల సెల్సియస్, శీతాకాలంలో 4 డిగ్రీల సెల్సియస్ వుంటుంది.[10] ఢిల్లీ వాతావరణం వేసవి, శీతాకాల ఉష్ణోగ్రతలలో పెద్ద వ్యత్యాసం కానవస్తుంది. వేసవి ఏప్రిల్ నుండి అక్టోబరు వరకు, శీతాకాలం నవంబరు నుండి జనవరి వరకు వుంటాయి. సంవత్సర సరాసరి ఉష్ణోగ్రత 25 - °C (77 °F); నెలల సరాసరి ఉష్ణోగ్రత 14 °C నుండి 33 °C (58 °F నుండి 92 °F) వుంటుంది.[11] సగటు వార్షిక వర్షపాతం దాదాపు 714 మి.మీ. (28.1 అంగుళాలు), వర్షపాతం దాదాపు మాన్సూన్ కాలంలో జూలై నుండి ఆగస్టు వరకు వుంటుంది.[12]
Remove ads
ప్రభుత్వం
2005 లో, క్రొత్త ఢిల్లీ పురపాలక మండలి ఒక ఛైర్‌పర్సన్ ను, ముగ్గురు కొత్త ఢిల్లీ శాసనసభ నియోజకవర్గ సభ్యులను, ఢిల్లీ ముఖ్యమంత్రిచే నామినేట్ చేయబడిన ఇద్దరు సభ్యులను, కేంద్ర ప్రభుత్వంచే నామినేట్ చేయబడిన ఐదుగురు సభ్యులను, తన మండలిలో సభ్యత్వమిచ్చింది. ప్రస్తుతం ఢిల్లీ ముఖ్యమంత్రి "అరవింద్ కేజ్రీవాల్ ".[13]
క్రొత్త ఢిల్లీ తన పురపాలక మండలిచే నిర్వహింపబడుతుంది, దీనినే క్రొత్త ఢిల్లీ పురపాలక మండలి అని వ్యవహరిస్తారు. ఇతర నగర ప్రాంతాలు, ఢిల్లీ మెట్రోపాలిటన్ ప్రాంతాలు, ఢిల్లీ నగర పాలిక నియంత్రిస్తుంది, ఈ ప్రాంతాలను "రాజధాని నగర" ప్రాంతాలుగా పరిగణించరు, కానీ మొత్తం ఢిల్లీ మెట్రోపాలిటన్ ప్రాంతం క్రొత్త ఢిల్లీగా పరిగణింపబడుతుంది.
నగర ఆకృతి

క్రొత్త ఢిల్లీ లోని దాదాపు అనేక ప్రాంతాలు 20వ శతాబ్దపు బ్రిటిష్ ఆర్కిటెక్ట్ ఎడ్విన్ ల్యుట్‌యెన్స్ చే రూపకల్పన చేయబడ్డాయి. అందుకే ఢిల్లీకి "ల్యుట్‌యెన్స్ ఢిల్లీ" అని కూడా పిలిచేవారు. ఈ నగర సౌధాలన్నీ బ్రిటిష్ శైలి, నమూనాలు కలిగివున్నాయి. ఈ నగరం ప్రధానంగా రెండు మార్గాలు రాజ్‌పథ్, జనపథ్ కలిగివున్నాయి. రాజ్‌పథ్ లేదా "రాజ మార్గం' రాష్ట్రపతి భవన్ నుండి ఇండియా గేట్ వరకూ వుంది. జనపథ్, (పూర్వపు "రాణి మార్గం") కన్నాట్ సర్కస్ వద్ద ప్రారంభమై శాంతిపథ్ వరకు సాగుతుంది. శాంతిపథ్ లో 19 విదేశీ దౌత్యకార్యాలయాలు గలవు, భారత్ లోని పెద్ద "దౌత్యకార్యాలయాల ప్రాంతం"గా దీనిని అభివర్ణించవచ్చును.[14]
ఈ నగర గుండెభాగాన రాష్ట్రపతి భవన్ (పూర్వపు వైస్రాయ్ హౌస్) వుంది, ఇది రాయ్‌సినా కొండ శిఖరభాగాన గలదు. మంత్రాలయం లేదా సెక్రటేరియేట్, ప్రభుత్వ మంత్రిత్వశాఖల పరిపాలనా భవనం దీని దగ్గరలోనే గలదు. హెర్బర్ట్ బేకర్ చే డిజైన్ చేయబడిన పార్లమెంటు భవనం సంసద్‌మార్గ్ లో గలదు, ఈ సంసద్‌మార్గ్ రాజ్‌పథ్ మార్గానికి సమాంతరంగా గలదు. కన్నాట్ ప్లేస్ క్రొత్తఢిల్లీ లోని, ఓ పెద్ద వృత్తాకార వాణిజ్య ప్రదేశం. ఈ కేంద్రం ఇంగ్లాండు లోని రాయల్ క్రెసెంట్ నమూనాగా నిర్మింపబడింది. ఈ కన్నాట్ ప్లేస్కు వివిధ మార్గాలనుండి 12 రహదారులు గలవు, ఇందులో ఒకటి జనపథ్.
Remove ads
రవాణా సౌకర్యాలు
క్రొత్తఢిల్లీ ఒక రూపకల్పన గావింపబడ్డ విశాలమైన నగరం, ఇందులో అనేక మార్గాలు సరైన రీతిలో నిర్మించబడ్డాయి. అందుకు ఉదాహరణలు రాజ్‌పథ్, జనపథ్, అక్బర్ రోడ్డు,లోక్ కళ్యాణ్ మార్గ్ ఉదహరించదగ్గవి. 2005లో, ఢిల్లీ మెట్రోపాలిటన్ ప్రాంతానికి అవసరమైన రవాణా సౌకర్యాలను ప్రైవేటు వాహనాలు కల్పిస్తున్నాయి.[15] భూగర్భ సబ్-వేలు సాధారణంగా కానవస్తాయి. 2008 నాటికి, 15 భూగర్భ సబ్-వేలు నడుస్తున్నాయి.[16] 1971 లో, ఢిల్లీ రవాణా సంస్థ (DTC) అధికారాలు ఢిల్లీ నగర పాలిక నుండి భారత ప్రభుత్వానికి బదిలీ చేయబడ్డాయి. 2007 లో క్రొత్త ఢిల్లీలో 2700 బస్-స్టేషన్లు గలవు[17]
ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (Delhi Metro Rail Corporation (DMRC)), వివిధ మెట్రోపోలిస్ ప్రాంతాలను కలుపుతుంది.[18] NDMC కూడా బహుళ-స్థాయి పార్కింగ్ విధానాన్ని DMRC సహకారంతో అనేక మెట్రో-స్టేషన్ల వద్ద నిర్మిస్తోంది.[19]
Remove ads
జనగణన


2001 జనాభా గణాంకాల ప్రకారం, క్రొత్తఢిల్లీలో జనాభా 3,02,363, అలాగే జాతీయ రాజధాని ప్రదేశ జనాభా 98.1 లక్షలు.[20] భారత్ లో ముంబై తరువాత రెండవ అతిపెద్ద మెట్రోపాలిటన్ ప్రాంతం.[21] జాతీయ రాజధాని ప్రదేశంలో 1000 మంది పురుషులకు 925 స్త్రీలు వున్నారు, అక్షరాస్యతా రేటు 81.67%.[22]
హిందువులు 82% ముస్లింలు 11.7%, సిక్కులు 4.0%, జైనులు 1.1%, క్రైస్తవులు 0.9%, ఢిల్లీలో ఉన్నారు.[23] ఇతర మైనారిటీలు పారసీలు, బౌద్ధులు, యూదులు.[24]
హిందీ ప్రధాన భాష, ఇంగ్లీషు వ్రాయడానికి ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇతర భాషలు ఉర్దూ, పంజాబీ. భారత్ కు చెందిన అనేక ప్రాంతాల ప్రజల భాషలు వాడుకలో ఉన్నాయి. ఉదాహరణకు మైధిలి, హర్యానవి, కన్నడ, తెలుగు, బెంగాలీ, మరాఠీ, తమిళం.
Remove ads
సంస్కృతి
క్రొత్తఢిల్లీ ఒక విశ్వజనీయ నగరం, ఇందులో అనేక జాతులు, మతాలు, కులాలు, సంస్కృతులు, భాషలు కానవస్తాయి. క్లుప్తంగా బహుసంస్కృతుల సమ్మేళణం ఈ నగరం. జాతీయ పండుగల రోజున దీనిని చూడాలి, విభిన్న సంస్కృతులను ఒకే చోట ఒకే సమయంలో చూసే అపురూప సుందర దృశ్యం వర్ణణాతీతం. స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవం, గాంధీ జయంతి ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. స్వాతంత్ర్యదినోత్సవం నాడు, భారత ప్రధానమంత్రి దేశాన్ని ఉద్దేశించి ఎర్రకోట నుండి ప్రసంగిస్తారు. ఢిల్లీవాసులు స్వాతంత్ర్యం సూచనగా గాలిపటాలు ఎగురవేసి ఆనందోత్సాహంతో గడుపుతారు.[25] రిపబ్లిక్ డే పెరేడ్ ఓ పెద్ద సాంస్కృతిక ప్రదర్శన, మిలిటరీ పెరేడ్ అందు ఒక భాగమే.
ఈ ఉత్సవాలు భారత్‌లోని భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రకటిస్తుంది.[26][27] మత సంబంధ పండుగలు దీపావళి, దుర్గాపూజ, హోలీ, లోహ్‌రీ, మహాశివరాత్రి రంజాన్ బక్రీదు క్రిస్ట్‌మస్, బుద్ధ జయంతి.[27] కుతుబ్ ఉత్సవం ఒక సాంస్కృతిక ఉత్సవం, ఈ ఉత్సవంలో సంగీతకారులు, నృత్యకారులు భారతదేశం నలుమూలలనుండి విచ్చేసి తమ కళాప్రదర్శనను ప్రదర్శిస్తారు. ఈ సందర్భాన ఈ ఉత్సవానికి బ్యాక్-గ్రౌండ్ గా కుతుబ్ మినార్ను ఉండేటట్లు ఏర్పాట్లు చేస్తారు.[28] ఇతర ఉత్సవాలు, ఉదాహరణకు గాలిపటాలు ఎగురవేయడం, అంతర్జాతీయ మామిడి ఉత్సవం, వసంత పంచమి ప్రతి సంవత్సరం జరుపుకుంటారు.
Remove ads
విద్యాసంస్థలు
- అటల్ బిహారీ వాజ్‌పేయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్
- నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా
- జాతీయ విద్యా ప్రణాళిక, నిర్వహణ సంస్థ (NIEPA)
- నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ
- జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం
- ఢిల్లీ విశ్వవిద్యాలయం
- ఇంద్రప్రస్థ ఇన్స్టిట్యూట్ సమాచారం టెక్నాలజీ
- అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ
- ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
ఆర్థికం
రాజీవ్ చౌక్, దీనికి పూర్వపుపేరు కన్నాట్ ప్లేస్, ఉత్తర భారతదేశం నకు చెందిన అతిపెద్ద వాణిజ్యకేంద్రం, ఆర్థిక కేంద్రం, ఈ ప్రదేశం ఢిల్లీకి గుండెభాగాన గలదు.
ఈ ప్రాంతానికి ఆనుకొనివున్న బారాఖంబా, చాణక్యపురి కూడా ప్రముఖ వాణిజ్యప్రదేశాలే. ప్రభుత్వపు, పాక్షిక-ప్రభుత్వ సంస్థలు ఇచ్చటి ప్రాథమిక యాజమాన్యాలు.
ఈ ప్రాంతం విశ్వజనీయ, ప్రపంచ-వాణిజ్య విలువలు గలిగిన నిపుణులు, ఆంగ్లభాషలో వ్యవహరింపగలిగిన నేర్పరులు గలిగిన ప్రదేశమని ప్రతీతి. ఈ నగరపు సేవారంగం అనేక బహుళజాతి సంస్థల అభిమానాన్ని చూరగొన్నది. ప్రముఖ సేవారంగాలలో ఇన్‌ఫర్మేషన్-టెక్నాలజీ, టెలీకమ్యూనికేషన్స్, హోటళ్ళు, బ్యాంకింగ్, మీడియా, పర్యాటకం రంగాలు.
జాతీయ రాజధాని ప్రాంతపు ప్రభుత్వం, క్రొత్తఢిల్లీ ఆర్థిక లెక్కలు చూపించదు గానీ, అధికారిక సాంవత్సరిక ఆర్థిక నివేదికలు ఢిల్లీ మొత్తానికి ముద్రిస్తుంది. "ఢిల్లీ ఆర్థిక సర్వే" ప్రకారం, ఈ మెట్రోపోలిస్ ప్రాంతం రొక్కం స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్టు (SDP) రూపాయలలో 83,085 కోట్లు (2004–05 ఆర్థిక సంవత్సరానికి) అని నివేదించింది.[29] తలసరి ఆదాయం రూ. 53,976.[29] టెర్షియరీ పారిశ్రామిక రంగం ఢిల్లీ మొత్తం ఎస్.డి.పి.లో 78.4% ఉన్నత పారిశ్రామిక రంగం 20.2%, ప్రాథమిక పారిశ్రామిక రంగం 1.4% తమ వంతు కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి.[29]
ప్రముఖులు
- మృణాళిని శర్మ: భారతీయ మోడల్, బాలీవుడ్ నటి.
మూలాలు
బయటి లింకులు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads