చంద్రబోస్ (రచయిత)
తెలుగు సినిమా పాటల రచయిత From Wikipedia, the free encyclopedia
Remove ads
చంద్రబోస్, తెలుగు సినిమా పాటల రచయిత. 1995లో వచ్చిన తాజ్ మహల్ చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశాడు.[1] ఇంజనీరింగ్ పట్టభద్రుడైనా ఈయన చిన్నప్పటి నుండి పాటల మీద మక్కువ పెంచుకొని సినీరంగంలోకి అడుగుపెట్టాడు. ఈయన పాటల రచయితనే కాక నేపథ్యగాయకుడు కూడా.
చంద్రబోస్ సాహిత్యం అందించిన ‘నాటు నాటు’ పాట 2023 మార్చి 13 న ఉత్తమ ఒరిజినల్ సాంగ్ గా ఆస్కార్ అవార్డు గెలుచుకుంది.[2][3][4]
69వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్‌లో కొండపొలం (2021) సినిమాలోని ధమ్ ధమ్ ధమ్ పాటకు జాతీయ ఉత్తమ గీత రచయితగా జాతీయ అవార్డును ఎంపికయ్యాడు.[5]
Remove ads
బాల్యం
చంద్రబోస్ స్వస్థలం వరంగల్ జిల్లా, చిట్యాల మండలం, చల్లగరిగె అనే కుగ్రామం. తండ్రి నర్సయ్య ఉపాధ్యాయుడు. తల్లి మదనమ్మ గృహిణి. వారికి మొత్తం నలుగురు సంతానం. వారిలో చంద్రబోస్ ఆఖరి వాడు.[6] తల్లి మదనమ్మ 2019 మే 20 న మరణించింది.[7]
వారి గ్రామంలో అప్పుడప్పుడూ ఒగ్గు కథలు, చిందు భాగవతాలు, నాటకాలు వేసేవారు. తల్లితో కలిసి వాటిని చూసి చంద్రబోస్ పద్యాలు, పాటలపై ఆసక్తి పెంచుకున్నాడు. ఇంటి పక్కనే ఉన్న గుడిలో జరిగే భజనల్లో పాటలు పాడేవాడు. తరువాత ఆ ఊర్లోకి సినిమా హాలు రావడంతో సినిమాలు వీక్షించడం అలవాటైంది.
Remove ads
విద్య
చంద్రబోస్ ముందు డిప్లోమా, ఆ తరువాత ఇంజనీరింగ్ చదివాడు. చదువు పూర్తయ్యే సమయంలో పాటలపై ఆసక్తి కలిగింది. ఒక స్నేహితుని సాయంతో సినీ ప్రముఖుల దగ్గరికి వెళ్ళేవాడు.
సినీ ప్రస్థానం
దర్శకుడు ముప్పలనేని శివ చంద్రబోస్ పాటలను నిర్మాత రామానాయుడుకి చూపించడంతో తాజ్‌మహల్ సినిమాలో మంచుకొండల్లోన చంద్రమా అనే పాట రాయడానికి అవకాశం వచ్చింది. ఆ పాట బాగా ప్రజాదరణ పొందింది. అదే సమయానికి ఇంజనీరింగ్ కూడా పూర్తయింది. ఉద్యోగమా, సినీరంగంలో రెండో దాన్నే ఎంచుకుని తల్లిదండ్రులను కూడా అందుకు ఒప్పించాడు. ఆ తరువాత కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన పెళ్ళిసందడి సినిమాలో కూడా అవకాశం వచ్చింది. ఆ సినిమా సంగీత పరంగా కూడా విజయం సాధించడంతో ఆయనకు వరుసగా అవకాశాలు వచ్చాయి. 800 సినిమాల్లో 3300 పాటల్లో పాటలు రాశాడు.
పాటల రకాలు
- స్ఫూర్తిదాయక పాటలు: బడ్జెట్ పద్మనాభం చిత్రంలోని 'ఎవరేమి అనుకున్నా నువ్వుండే రాజ్యాన' అనే పాట మొదటి స్ఫూర్తిదాయక పాట. ఓమారియా ఓమారియా (చూడాలనివుంది), కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి (ఠాగూర్), నవ్వేవాళ్లు నవ్వని ఏడ్చేవాళ్లు ఏడ్వనీ (చెన్నకేశవరెడ్డి), లక్కీ లక్కీ ఎంతెంతో లక్కీ (డాడీ), చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని (నేనున్నాను), ఇంతే ఇంతింతే, లేలేలే ఇవ్వాళే లే (గుడుంబా శంకర్), అభిమాని లేనిదే హీరోలు లేరులే,
- స్నేహం గురించిన పాటలు: ట్రెండు మారినా ఫ్రెండ్ మారడు (ఉన్నది ఒకటే జిందగీ), ఎగిరే ఎగిరే (కొచెం ఇష్టం కొచెం కష్టం)
- తల్లిదండ్రులపై పాటలు: పెదవే పలికిన మాటల్లోనే (నాని), లాలి లాలి జోలాలి (ఢమరుకం), కనిపెంచిన మా అమ్మకే అమ్మయ్యానుగా (మనం), చీరలోని గోప్పదనం (పల్లకిలో పెళ్ళికూతురు)
- అన్నాచెల్లెలి పాటలు: మరుమల్లి జాబిల్లి (లక్ష్మీనరసింహా), అన్నయ్య అన్నాంటే (అన్నవరం)
- ప్రేమపాటలు: నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి (ఆది), కలలోనైన కలగనలేదే నువ్వొస్తావని (నువ్వొస్తావని), నువు చూడూ చూడకపో (ఒకటో నెంబర్ కుర్రాడు), నువ్వే నా శ్వాస (ఒకరికొకరు), పోయే పోయే లవ్వే పోయే (ఆర్య2), పంచదార బొమ్మాబొమ్మా (మగధీర)
- కళాశాల పాటలు: ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి (స్టూడెంట్ నెంబర్ వన్)
- దేవుని పాటలు: జైజై గణేషా (జై చిరంజీవా)
- తెలుగు భాషపై పాటలు: తెలుగు భాష తియ్యదనం తెలుగు జాతి గొప్పతనం (నీకు నేను నాకు నువ్వు) తెలుగంటే గోంగూర (సుబ్రమణ్యం ఫర్ సేల్),
- ఇతర పాటలు: బ్రాండ్ల పేరుతో 'చీరలోని గొప్పదనం' (పల్లకిలో పెళ్ళికూతురు), షాప్ బోర్డు పేర్లతో 'గంగా ఏసి వాటర్' (సై), టెలిఫోన్ డైరెక్టరీతో 'ఎక్కడున్నావమ్మా' (ఒకరికొకరు), సెల్ ఫోన్ నెంబర్లతో 'నీది 98490 నాది 98480' (ఒకటో నెంబర్ కుర్రాడు), డబ్బుల గురించి 'రెలుబండిని నడిపేది' (నువ్వొస్తావని), నవ్వు గురించి 'ఒకచిన్ని నవ్వేనవ్వి యుద్ధాలేన్నో ఆపొచ్చు' (అశోక్), అమ్మాయి పేర్లతో 'నాపేరు చెప్పుకోండి' (పల్లకిలో పెళ్ళికూతురు), దేవున్నే పిలిచావంటే రాడురాడు ఎంతో బిజీ (లక్ష్మీనరసింహా), జ్ఞాపకాలపై 'గుర్తుకొస్తున్నాయి' (నా ఆటోగ్రాఫ్), భార్యపై 'సమయానికి తగు సేవలు' (సీతయ్య)
Remove ads
వివాహం
పెళ్ళిపీటలు సినిమాకు పనిచేస్తుండగా నృత్య దర్శకురాలు సుచిత్రా చంద్రబోస్ పరిచయమైంది. అది ప్రేమగా మారి ఇద్దరూ ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్ళి చేసుకున్నారు.
ఇతర వివరాలు
- నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ కు సాంస్కృతిక రాయబారిగా (6సంవత్సరాలుగా) ఉన్నారు.
పాటల సంకలనం
- డ్రింకర్ సాయి (2024)
- అలనాటి రామచంద్రుడు (2024)
- అహింస (2023)
- విరాట పర్వం
- పెళ్లిసందD (2021)
- రంగస్థలం (2018)
- ఝుమ్మంది నాదం (2010)
- నాగవల్లి (2010)[8]
- కేక (2008)
- ఒక్క మగాడు (2007)
- అన్నవరం (2006)
- ఖతర్నాక్ (2006)
- సైనికుడు (2006)
- బొమ్మరిల్లు (2006)
- విక్రమార్కుడు (2006)
- రణం (2006)
- హ్యాపి (2006)
- జై చిరంజీవ (2005)
- భగీరథ (2005)
- ఛత్రపతి (2005)
- అల్లరి బుల్లోడు (2005)
- ఆంధ్రుడు (2005)
- అందరివాడు (2005)
- అతనొక్కడే (2005)
- సుభాష్ చంద్రబోస్ (2005)
- చక్రం (2005)
- బాలు (2005)
- శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్. (2004)
- సై (2004)
- గుడుంబా శంకర్ (2004)
- నా ఆటోగ్రాఫ్ (2004)
- సాంబ (సినిమా) (2004)
- నాని (2004)
- ఆర్య (సినిమా) (2004)
- నేనున్నాను (2004)
- అతడే ఒక సైన్యం (2004)
- అంజి (2004)
- లక్ష్మీనరసింహా (2004)
- అభిమన్యు (2003)
- ఠాగూర్ (సినిమా) (2003)
- జానీ (2003)
- దిల్ (2003)
- అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి (2003)
- గంగోత్రి (సినిమా) (2003)
- పెళ్ళాం ఊరెళితే (2003)
- నాగ (2002)
- చెన్నకేశవరెడ్డి (2002)
- ఆది (2002)
- ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు (2002)
- టక్కరి దొంగ (2002)
- హనుమాన్ జంక్షన్ (సినిమా) (2001)
- స్టూడెంట్ నంబర్ 1 (2001)
- ముత్యం (2001)
- డాడీ (సినిమా) (2001)
- ఖుషి (2001)
- శివుడు (2001)
- శ్రీ మంజునాథ (2001)
- మృగరాజు (2001)
- బడ్జెట్ పద్మనాభం (2001)
- మురారి (2000)
- ఆజాద్ (2000)
- జయం మనదేరా (2000)
- తమ్ముడు (1999)
- ఇద్దరు మిత్రులు (1999)
- ప్రేమంటే ఇదేరా (1998)
- పెళ్ళిసందడి (1997)
- పెళ్ళి చేసుకుందాం (1997)
- బావగారూ బాగున్నారా? (1998)
- చూడాలని వుంది (1998)
- మాస్టర్ (సినిమా) (1997)
- లింగబాబు లవ్‌స్టోరీ" (1995)
- జోకర్ (1993)
- తాజ్ మహల్
Remove ads
అవార్డులు, నామినేషన్లు
- రౌద్రం రణం రుధిరం (2022)లో "నాటు నాటు" కోసం ఉత్తమ ఒరిజినల్ పాటకు అకాడమీ అవార్డు
- క్రిటిక్స్ ఛాయిస్ మూవీ అవార్డ్స్
- రౌద్రం రణం రుధిరం (2022)లో "నాటు నాటు" కోసం ఉత్తమ పాటకు క్రిటిక్స్ ఛాయిస్ మూవీ అవార్డ్
- రౌద్రం రణం రుధిరం (2022)లో "నాటు నాటు" కోసం ఉత్తమ ఒరిజినల్ పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు[9]
- రౌద్రం రణం రుధిరం (2022)లో ఉత్తమ ఒరిజినల్ సాంగ్ "నాటు నాటు" కోసం గోల్డ్ డెర్బీ ఫిల్మ్ అవార్డు
- ఆది (2002)లోని "నీ నవ్వుల తెల్లదనాన్ని"కి ఉత్తమ గీత రచయిత
- నేనున్నాను (2004)లో "చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని"కి ఉత్తమ గీత రచయిత
- ఉత్తమ గీత రచయిత – మనం (2014)లో "కనిపించిన మా అమ్మ" కోసం తెలుగు[11]
- ఉత్తమ గీత రచయిత – తెలుగు రంగస్థలం (2018)లో "ఎంత సక్కగున్నావే"కి
- ఉత్తమ గీత రచయిత – మనం (2014) నుండి "కనిపించిన మా అమ్మ" కోసం తెలుగు
- ఉత్తమ గీత రచయిత – రంగస్థలం (2018) నుండి "ఎంత సక్కగున్నావే"కి తెలుగు[12]
- ఉత్తమ గీత రచయిత – పుష్ప: ది రైజ్ (2022) నుండి "శ్రీవల్లి"కి తెలుగు[13]
- సంతోషం ఫిల్మ్ అవార్డ్స్
- పుష్ప కోసం ఉత్తమ గీత రచయిత: ది రైజ్ (2022)
Remove ads
సన్మానం
ఆస్కార్ పురస్కారాన్ని గెలుచుకున్నఅనంతరం కీరవాణి, చంద్రబోస్‌లను 2023 ఏప్రిల్ 09న హైదరాబాద్‌లోని శిల్పా కళావేదికలో తెలుగు నిర్మాతల మండలి, ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలంగాణ ప్రభుత్వం తరపున రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, వి. శ్రీనివాస్ గౌడ్, ఎఫ్‌డీసీ ఛైర్మన్ అనిల్ కుర్మాచలం సన్మానించారు.[14][15]
చెప్పుకోదగ్గ పాటలు
- "మంచు కొండల్లోన చంద్రమా" - తాజ్ మహల్ (1995)
- "చాయ్ చటుక్కున తగరా భాయ్" - మృగరాజు (2001)
- "ఎవరేమి అనుకున్నా" - బడ్జెట్ పద్మనాభం (2001)
- "ఎక్కడ పుట్టి ఎక్కడో పెరిగి" - విద్యార్థి నం.1 (2001)
- "నీ నవ్వుల తెల్లదనాన్ని" - ఆది (2002)
- "నువ్వు చూడు చూడకపో" - ఒకటో నంబర్ కుర్రాడు (2002)
- "తెలుగు భాష తీయదనం" - నీకు నేను నాకు నువ్వు (2003)
- "కొడితే కొట్టాలి రా సిక్స్ కొట్టాలి" - ఠాగూర్ (2003)
- "చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని" - నేనున్నాను (2004)
- "పెదవే పలికిన" - నాని (2004)
- "నమస్తే నమస్తే నీకు నమస్తే" - సాంబ (2004)
- "చీరలోని గొప్పతనం తెలుసుకో" - పల్లకిలో పెళ్లికూతురు (2004)
- "మౌనంగానే ఎదగమని" - నా ఆటోగ్రాఫ్ (2004)
- "ఇంతే ఇంతింతే ఇంతింతే" - బాలు (2005)
- "జై జై గణేశా జై కొడతా గణేసా" - జై చిరంజీవ (2005)
- "పంచధార బొమ్మ బొమ్మ" - మగధీర (2009)
- "దేశమంటే మఠం కాదోయ్" - ఝుమ్మంది నాదం (2010)
- "ఆకాశం అమ్మాయితే" - గబ్బర్ సింగ్ (2012)
- "సాయి అంటే తల్లి" - షిరిడి సాయి (2012)
- "లాలీ లాలీ జో లాలీ" - డమరుకం (2012)
- "సయోనారా సయోనరా" - 1: నేనొక్కడినే (2014)
- " జిగేలు రాణి " - రంగస్థలం (2018)
- "ఈ సెట్టితోన్" - రంగస్థలం (2018)
- " నాటు నాటు " - రౌద్రం రణం రుధిరం (2022)
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads