నాగవల్లి (2010 సినిమా)

పి.వాసు దర్శకత్వంలో 2010లో విడుదలైన తెలుగు చిత్రం From Wikipedia, the free encyclopedia

నాగవల్లి (2010 సినిమా)
Remove ads

నాగవల్లి 2010, డిసెంబరు 16 న విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీ సాయిగణేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై బెల్లంకొండ సురేశ్ నిర్మాణ సారథ్యంలో పి. వాసు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దగ్గుబాటి వెంకటేష్,అనుష్క, కమలినీ ముఖర్జీ, ఎమ్మెస్ నారాయణ, బ్రహ్మానందం, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, శరత్ బాబు తదితరులు నటించగా, గురుకిరణ్ సంగీతం అందించాడు. 2005లో వచ్చిన చంద్రముఖి తమిళ సినిమాకి కొనసాగింపు సినిమా ఇది.[1]

త్వరిత వాస్తవాలు దర్శకత్వం, నిర్మాణం ...

2010లో కన్నడలో విష్ణువర్ధన్, అవినాష్, విమలా రామన్ నటించిన ఆప్తరక్షక సినిమాకి రిమేక్ సినిమా ఇది. 2011లో జామ్‌జామ్ ప్రొడక్షన్స్, రాయల్ ఫిల్మ్ కంపెనీ సంయుక్తంగా ఈ సినిమా మేరా బద్లా: రివేంజ్ పేరుతో హిందీలోకి అనువదించబడింది.

Remove ads

కథా నేపథ్యం

చంద్రముఖి చిత్రపటం గాలిలో కొట్టుకుంటూ వచ్చి చిత్రకారుడు (డి.ఎస్. దీక్షితులు) కు దొరుకుతుంది. దాన్ని ఇంటికి తీసుకెళ్ళి తన గదిలో పెట్టుకుంటాడు. దానిని అమ్మి కుటుంబాన్ని పోషించమని భార్య (సన) అడిగితే, తనదికాని దానిని అమ్మడానికి నిరాకరిస్తాడు. తెల్లారేకల్లా అతను చనిపోవడంతో ఆ చిత్రపటాన్ని ఎవరికైనా ఇవ్వమని భార్య చుట్టుపక్కల వారికి చెబుతుంది. విజయనగర సంస్థానదీశుల వారసులైన (శంకర్ రావు) శరత్‌బాబు కుమార్తె (గాయత్రి) కమలినీ ముఖర్జీకి నాట్యశాస్త్ర పోటీల్లో బహుమతిగా ఆ చిత్రపటాన్ని ఇస్తారు. దాన్ని తీసుకొని వస్తుండగా తను ప్రేమించిన వ్యక్తి యాక్సిండెంట్‌లో చనిపోతాడు. అలా ఆ చిత్రపటం ప్యాలెస్‌కు చేరుతుంది. ఆ తరువాత, శరత్‌బాబు ప్యాలెస్‌లో ఒక్కొక్కరు చనిపోతుంటాడు. ఆ ప్యాలెస్‌లో 34 అడుగుల పాము ఉందని తెలుసుకున్న శరత్ బాబు, ఆచార్య రామచంద్ర సిద్ధాంతి (అవినాష్) దగ్గరకు వెళ్ళగా అతను ప్యాలస్ సమస్యను పరిష్కరిస్తానని చెప్పి, అలాంటి సమస్యను సాల్వ్‌ చేసేవారు డా. ఈశ్వర్‌ (రజనీకాంత్‌) అతని శిష్యుడు విజయ్‌ (వెంకటేష్‌) పేర్లు సూచిస్తాడు.

ఈశ్వర్‌ విదేశాలకు వెళుతున్నందువల్ల విజయ్‌ను ఆ ప్యాలెస్‌కు వస్తాడు. విజయ్ తన మానసిక శాస్త్రం ప్రకారం అక్కడున్న ఒక్కో సమస్యను పరిష్కరిస్తుంటాడు. శంకర్ రావు, పార్వతి దేవి (ప్రభ )ల ముగ్గురు కుమార్తెల్లో (రిచా గంగోపధ్యాయ్, శ్రద్ధా దాస్, కమలినీ ముఖర్జీ) ఒకరికి చంద్రముఖి ఆవహించిందని గుర్తించి, ఆ తర్వాత సమస్యను మరింత లోతుగా పరిశీలించడానికి లైబ్రరీకి వెళ్ళి విజయనగరం జిల్లా రామచంద్రాపురం రాజు చరిత్రను చదివి తెలుసుకుంటాడు. తన గురువు ఈశ్వర్ చెప్పినట్టుగా శ్రీ నాగ భైరవ రాజశేఖర రాజు చూడ్డానికి అచ్చం విజయ్ లాగే వుంటాడు.

పక్కరాజ్యంపై దండెత్తి ఆ రాజును చంపి అక్కడి నాట్యగత్తె చంద్రముఖి (అనుష్క) అందానికి దాసుడై ఆమెను తన రాజ్యానికి తీసుకొస్తాడు. కానీ, తన ప్రియుడిని తప్ప ఎవరినీ ఊహించుకోలేనని చంద్రముఖి చెప్తుంది. దొంగచటుగా వచ్చిన చంద్రముఖి ప్రియుడిని ఆమె కళ్ళముందే చంపేయడంతోపాటు, తనను మోసం చేసిందనే కక్షతో చంద్రముఖిని కూడా సజీవదహనం చేస్తాడు. తన ప్రియుడిని, తనను చంపినందుకు నాగభైరవుడిపై ప్రతీకారం తీర్చుకుంటానని చెప్పి చంద్రముఖి చనిపోతుంది. చనిపోయిన చంద్రముఖి ఆత్మ చావకుండా పగతో అలా తిరుగుతూ ఉంటుంది. ఇక నాగభైరవ రాజు ఊరిలోని ఎవర్నిచూసినా చంద్రముఖే కన్పిస్తుందని మంత్రికి చెప్పడంతో ఊరంతా కలిసి రాజును తరిమేస్తారు. అలా కొండపైకి వెళ్ళి ధ్యానం చేసి 130 ఏళ్ళు జీవిస్తూ అఘోరాగా మారిపోతాడు. అతన్ని డా. విజయ్‌ ఎలా కనిపెట్టాడు, చంద్రముఖి సమస్య ఏవిధంగా తీరిందనేది మిగతా కథ.[2][3]

Remove ads

నటవర్గం

Remove ads

సాంకేతిక సిబ్బంది

పాటలు

ఈ చిత్రానికి గురుకిరణ్ సంగీతం అందించగా, చంద్రబోస్ పాటలు రాశాడు. ఆదిత్యా మ్యూజిక్ ద్వారా పాటలు విడుదలయ్యాయి. 2010, నవంబరు 16న హైదరాబాదులోని శిల్పకళా వేదికలో నాగవల్లి సినిమా పాటలు విడుదలయ్యాయి. ఈ కార్యక్రమానికి సినీ నిర్మాతలు డా. డి. రామానాయుడు, కె.ఎల్.నారాయణ, సినీ దర్శకులు ఎస్.ఎస్. రాజమౌళి, పూరీ జగన్నాథ్, వి.వి. వినాయక్, సినీ నటులు రానా, నాని, నటిమణులు ఇలియానా, ప్రణీత, చిత్రబృందం పాల్గొన్నారు. ఘిరాని ఘిరాని, ఓంకార పాటల ట్యూన్స్ కన్నడ సినిమా నుండి తీసుకున్నారు.

మరింత సమాచారం సం., పాట ...
Remove ads

విడుదల - స్పందన

2010, డిసెంబరు 16న విడుదలైన ఈ చిత్రం అనుకూల స్పందనలు అందుకుంది.

రేటింగ్

  • 123తెలుగు.కాం: 3/5[4]
  • గ్రేట్ ఆంధ్ర: 3.25/5[5]
  • ఐడెల్ బ్రెయిన్: 3/5[6]

బాక్సాఫీస్

ఈ సినిమా తొలివారం 10కోట్ల రూపాయలు వసూలు చేసింది.[7]

టివి హక్కులు

ఈ చిత్ర తెలుగు, హిందీ వెర్షన్ల టెలివిజన్ హక్కులను జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ (జీ తెలుగు వెర్షన్ తెలుగు వెర్షన్, జీ సినిమా హిందీ వెర్షన్) సొంతం చేసుకుంది.

మూలాలు

బయటి లింకులు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads