దుండిగల్ పురపాలకసంఘం
From Wikipedia, the free encyclopedia
Remove ads
దుండిగల్ పురపాలకసంఘం, తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ.[1] దుండిగల్ పట్టణం దీని ప్రధాన పరిపాలన కేంద్రం. ఈ పురపాలక సంఘం మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గం లోని కుత్బుల్లాపూర్ శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.[2]
Remove ads
చరిత్ర
మేజర్ గ్రామ పంచాయితీగా ఉన్న దుండిగల్, తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018, ఆగస్టు 2న పురపాలక సంఘంగా ఏర్పడింది.[3] దుండిగల్ గండిమైసమ్మ మండలం లోని దుండిగల్, గగిలాపూర్, మల్లంపేట్, దొమ్మర పోచంపల్లి, బహదూర్‌పల్లి, బౌరంపేట్ మొదలైన గ్రామ పంచాయితీలు కలిపి పురపాలకసంఘంగా ఏర్పాటుచేశారు.
భౌగోళికం
దుండిగల్ 65.00 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోఉంది. ఇది 17.578°N 78.427°E అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది.
జనాభా గణాంకాలు
2011 భారత జనాభా లెక్కల ప్రకారం, పురపాలక సంఘం పరిధిలో ఉన్న జనాభా మొత్తం 40817 మంది కాగా, అందులో 21266 మంది పురుషులు, 19551 మంది మహిళలు ఉన్నారు. 8632 గృహాలు ఉన్నాయి ఇది పరిపాలనా పరంగా మునిసిపాలిటీ 28 రెవెన్యూ వార్డులుగా విభజించబడింది.[4]
పౌర పరిపాలన
పురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి దీనిని 6 ఎన్నికల వార్డులుగా విభజించారు. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తారు. 2020 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో చైర్‌పర్సన్‌గా, వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనారు.[5] వీరు ఎన్నికైననాటినుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.
వార్డు కౌన్సిలర్లు
- కుంటి అరుణ
- అమరం గోపాల్‌రెడ్డి
- జక్కుల కృష్ణ యాదవ్
- జక్కుల విజయ
- ఆనంద్ కుమార్
- బొంగునూరి రమాదేవి
- ముదిమల రాముగౌడ్
- కోల సాయి యాదవ్
- మహేందర్ యాదవ్
- బొంగునూరి సవిత
- మైసిగారి సుజాత
- శివనూరి నవనీత
- సత్యనారాయణ
- తుడుం పద్మారావు
- నర్సింగం భరత్
- నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి
- పిసారీ బాలమణి
- పాల్పునూరి మౌనిక
- బెంబాడి వనిత
- నాచారం సునిత
- అంబారీ లక్ష్మి
- శామీర్‌పేట సంధ్య
- మదాస్ వెంకటశం
- అర్కాల అనంత స్వామి
- సుంకరి కృష్ణవేణి
- సుంకరి కృష్ణ
- కొర్రా శంకర్ నాయక్
- తనగుండ్ల జోస్విన్
Remove ads
మూలాలు
వెలుపలి లంకెలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads