2010

From Wikipedia, the free encyclopedia

Remove ads

2010 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంఘటనలు

జనవరి 2010

  • జనవరి 4: కామన్వెల్త్ దేశాల స్పీకర్ల సమావేశం ఢిల్లీలో ప్రారంభమైనది.
  • జనవరి 5: తెలంగాణ విషయంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన 8 రాజకీయ పార్టీల నాయకులతో ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరిగింది.
  • జనవరి 5: ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ జనక్రాంతి పేరిట కొత్త పార్టీని స్థాపించాడు.
  • జనవరి 6: సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నాయకుడు అమర్‌సింగ్ పార్టీ పదవులకు రాజీనామా సమర్పించాడు.
  • జనవరి 8: పబ్లిక్ అక్కౌంట్స్ కమిటి చైర్మెన్‌గా భారతీయ జనతా పార్టీకు చెందిన గోపీనాథ్ ముండా నియమితుడైనాడు.
  • జనవరి 11: క్రోయేషియా అధ్యక్షుడిగా ఇవో జోసిపోలిక్ ఎన్నికయ్యాడు.
  • జనవరి 12: హైతీలో భారీ భూకంపం సంభవించి వేలాది మంది మృతిచెందారు.
  • జనవరి 13: ఉత్తర ప్రదేశ్ విధానమండలి ఎన్నికలలో బహుజన్ సమాజ్ పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకుంది.
  • జనవరి 13: భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్‌ల మధ్యజరిగిన ముక్కోణపు క్రికెట్ టోర్నమెంటు ఫైనల్లో శ్రీలంక భారత్‌పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
  • జనవరి 16: 8 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు నియమించబడ్డారు.
మరింత సమాచారం రాష్ట్రము, కొత్త గవర్నరు పేరు ...

ఫిబ్రవరి 2010

  • ఫిబ్రవరి 3: ఆంధ్రప్రదేశ్ తాజా రాజకీయ పరిణామాలను సమిక్షించడానికి శ్రీకృష్ణ అధ్యక్షతన నలుగురు సభ్యుల కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమించింది.
  • ఫిబ్రవరి 8: కోస్టారికా అధ్యక్షురాలిగా లారా చిన్‌చిల్లా ఎన్నికైనది.
  • ఫిబ్రవరి 10: ఉక్రేయిన్ అధ్యక్ష ఎన్నికలలో విక్టర్ యనుకోవిచ్ విజయం సాధించింది.
  • ఫిబ్రవరి 10: జాతీయ దర్యాప్తు సంస్థ డైరెక్టర్‌గా శరత్ చంద్ర సిన్హా నియమితుడైనాడు.
  • ఫిబ్రవరి 11: ఇరాన్ అధ్యక్షుడు అహ్మదీ నెజాద్ ఇరాన్‌ను అణ్వస్త్ర దేశంగా ప్రకటించుకున్నాడు.
  • ఫిబ్రవరి 13: పూణె నగరంలో బాంబుపేలుడు సంభవించి 9మంది మృతి చెందారు.
  • ఫిబ్రవరి 15: పశ్చిమ బెంగాల్లో మావోయిస్టుల మెరుపుదాడిలో 24మంది జవాన్లు మృతి చెందారు.
  • ఫిబ్రవరి 15: 12 గురు ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుల రాజీనామాలను స్పీకర్ ఆమోదించాడు.
  • ఫిబ్రవరి 19: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ నిసార్ అహ్మద్ కక్రూ ప్రమాణ స్వీకారం చేశాడు.
  • ఫిబ్రవరి 22: ఎన్డీఏ కార్యనిర్వాహక చైర్మెన్‌గా లాల్‌కృష్ణ అద్వానీ ఎన్నికయ్యాడు.
  • ఫిబ్రవరి 27: చిలీలో కంసెప్స నగరంలో భూకంపం సంభవించి వందలాది ప్రజలు మరణించారు.

మార్చి 2010

ఏప్రిల్ 2010

మే 2010

  • మే 9: కోస్టారికా తొలి మహిళా అధ్యక్షురాలిగా లారా చిన్ చిలా ప్రమాణస్వీకారం చేసింది.
  • మే 12: బ్రిటన్ ప్రధానమంత్రిగా కన్జర్వేటివ్ పార్టీకి చెందిన డేవిడ్ కామెరాన్ ప్రమాణస్వీకారం చేశాడు.
  • మే 12: భారత సుప్రీంకోర్టు 38వ ప్రధాన న్యాయమూర్తిగా హెచ్.ఎస్.కపాడియా ప్రమాణస్వీకారం చేశాడు.
  • మే 15: జి-15 దేశాల నూతన అధ్యక్షుడిగా శ్రీలంక అధ్యక్షుడు మహేంద్ర రాజపక్సే ఎన్నికయ్యాడు.
  • మే 22: మంగళూరు విమానాశ్రయంలో విమానం కూలి 158 మంది మృతిచెందారు.

జూన్ 2010

జూలై 2010

  • జూలై 3: ఢిల్లీలోని ఇందిరాగాంధి అంతర్జాతీయ విమానాశ్రయంలో 9000 కోట్ల రూపాయల్ పెట్టుబడితో నిర్మించిన 3వ టెర్మినల్ (టీ3)ను ప్రారంభించారు.
  • జూలై 3: కిర్గిస్తాన్ అధ్యక్షురాలిగా ఎన్నికైన ఒటుంబయెవా (మధ్య ఆసియాలో అధ్యక్షురాలి హోదా చేపట్టిన తొలి మహిళ).
  • జూలై 5: శ్రీకృష్ణ దేవరాయల పట్టాభిషేకం జరిగి 500 సంవత్సరాలు అయిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఘనంగా 3 రోజుల పాటు, ఆ ఉత్సవాన్ని జరుపుతుంది. రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఈ ఉత్సవాన్ని ప్రారంభించారు.
  • జూలై 5: ధరల పెరుగుదలకు నిరసనగా ప్రతిపక్షాలు 'భారత్ బంద్'ని నిర్వహించాయి.
  • జూలై 27: ఒక్క తిండి గింజ కూడా వృధా చేసినా నేరమే అని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వానికి తెలియచేసింది. తిండి గింజలను కుళ్ళబెట్టే బదులు పేదలకు ఇవ్వవచ్చుకదా అన్నది. బీదరికంలో లేని వారికి తిండి గింజలలో రాయితీలు ఎందుకు అన్నది.
  • జూలై 28: పాకిస్తాన్‌లో ఇస్లామాబాద్ సమీపంలోని కోడప్రంతంలో ఉదయం పది తంటల సమయంలో కోడను ఢీకొని పేలిపోయింది. 155మంది సిబ్బందితో సహా మరణించారు.
  • జూలై 28: 22 లేదా 23 ఆగష్టు నెలలో ఇంజినీరింగ్ కౌన్సెలింగు జరుగుతుంది అన్నారు.
  • జూలై 28: ప్రధాన ఎన్నికల కమిషనరుగా (సీ.ఈ.సీ)గా షాహాబుద్దీన్ యాకుబ్ ఖురేషీని నియమించారు. ప్రస్తుతమున్న నవీన్ చావ్లా 2010 జూలై 29 గురువారం పదవీ విరమణ చేస్తాడు. 63 సంవత్సరాల వయసు ఉన్న ఖురేషీ రెందు సంవత్సరాలు ఈ పదవిలో కొనసాగుతాడు.
  • జూలై 30: 12 శాసనసభ నియోజక వర్గాలకు జరిగిన ఉప ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి 11 స్థానాలలో, భారతీయ జనతా పార్టీ 1 స్థానం (నిజామాబాద్ అర్బన్ ) గెలుచుకున్నాయి. నియోజక వర్గాలు : 1.సిర్పూరు, 2.చెన్నూరు, 3.మంచిర్యాల, 4.నిజామాబాద్ అర్బన్ (బా.జ.పా), 5.ధర్మపురి, 6.వేములవాడ, 7. సిద్ధిపేట, 8.వరంగల్ (పశ్చిమ), 9. హుజూరాబాద్, 10.సిరిసిల్ల, 11.కోరుట్ల, 12.ఎల్లారెడ్డి.
  • జూలై 30 : శ్రీకృష్ణ దేవరాయలు, సింహాచలం అప్పన్నకు ఇచ్చిన 16 బంగారు అభరణాలను, ప్రజలు చూడటానికి, కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య, ప్రదర్శనకు పెట్టారు.

ఆగష్టు 1

  • పాకిస్తాన్ వాయవ్య ప్రాంతం మొత్తం వర్షాల వలన జలమయం అయ్యి మహా సముద్రంలా కనిపిస్తుంది 800 మంది మరణించారు. 10లక్షల మంది నీడ కొల్పోయారు.

సెప్టెంబర్ 2010

అక్టొబర్ 2010

నవంబర్ 2010

డిసెంబర్ 2010

Remove ads

మరణాలు

Thumb
జ్యోతిబసు
Remove ads

అవార్డులు

  • మూర్తిదేవి అవార్డు -- ఎం.వీరప్ప మొయిలీ.

ఇవి కూడా చూడండి

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads