ప్రతిఘటన

From Wikipedia, the free encyclopedia

ప్రతిఘటన
Remove ads

ప్రతిఘటన టి. కృష్ణ దర్శకత్వంలో 1986 లో విడుదలైన ఒక విజయవంతమైన సినిమా.[1][2] ఇందులో విజయశాంతి, చంద్రమోహన్, రాజశేఖర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా మూడు నంది పురస్కారాలను అందుకుంది. విజయశాంతికి ఉత్తమ నటిగా, ఎస్. జానకికి ఉత్తమ గాయని గా, హరనాథ రావుకు ఉత్తమ మాటల రచయితగా ఈ పురస్కారాలు దక్కాయి. ఉషాకిరణ్ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మించింది.

త్వరిత వాస్తవాలు ప్రతిఘటన, దర్శకత్వం ...
Remove ads

కథ

కాళి అనే గుండా, మంత్రి కాశయ్య కలిసి అందరిపై అరాచకాలు చేసేవాడు. ఝన్సీ అనే లెక్చరర్, సత్యమూర్తి ఇద్దరూ భార్యా భర్తలు. సత్యమూర్తి భయస్తుడు. ఝాన్సీ ధైర్యవంతురాలు. ఎస్సై ప్రకాష్ కాళిని అరెస్ట్ చేస్తాడు. కాళి, ప్రకాష్ ని నడి రోడ్డు పై హత్య చేసాడు. ఈ దారుణం చూసిన ఝాన్సీ, కాళిపై పొలీసుకేసు పెడుతుంది. భర్త, అత్తమామలు ఈ విషయంలో ఆమెను తప్పు పడతారు.పగబట్టిన కాళి, నడివీదిలో ఝాన్సీని వివస్త్రను చేస్తాడు. కాళి వల్ల అన్యాయానికి గురి అయిన ఝాన్సీకి, నాగమ్మ ఇంటిలో ఆశ్రయం దొరికుతుంది. ఝాన్సీ పనిచేసే కాలేజిలో చదువు కోసం వచ్చే విద్యార్థులు కంటే చౌకబారు రౌడీ ల సంఖ్య ఎక్కువ. వారిని అందరిని మారుస్తుంది ఝాన్సీ. కాళి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడు. ఎన్నికల ప్రచారంలో కాళి తరుపున ప్రచారం చేస్తానని ఝాన్సీ ముందుకు వస్తుంది. మొదట అనుమానించినా, తరువాత నమ్మతాడు కాళి. నాగమ్మ, స్టూడెంట్స్ అందరూ ఆమెను అపార్థం చేసుకుంటారు. కాళికి వ్యతిరేకంగా ఎన్నకల ప్రచారం చేసిన శ్రీశైలం ను కాళీ.చంపేస్తాడు. రిగ్గింగ్ చేసీ, భయపెట్టి కాళి ఎమ్మెల్యే గా భారీ మెజారిటీతో గెలుస్తాడు. విజయోత్సవ సభలో ఆనందంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్న కాళిని, గొడ్డలితో నరికి చంపేస్తుంది ఝాన్సీ.

Remove ads

నిర్మాణం

దర్శకుడు టి. కృష్ణ ప్రధాన పాత్రను విజయశాంతి చేతనే వేయించాలనుకున్నాడు. అప్పట్లో ఈ చిత్రంలో నటించడానికి విజయశాంతికి సమయం చిక్కనప్పటికీ అదే సమయంలో ఆమె నటిస్తున్న ఇతర చిత్రాల నిర్మాతలతో మాట్లాడి ఈ సినిమా కోసం సమయాన్ని కేటాయించగలిగింది. ఈ సినిమా నిర్మాణం నెలరోజులలో పూర్తయింది. కన్నడ సినిమాల్లో అప్పటిదాకా కథానాయకుడి పాత్రల్లో నటిస్తున్న చరణ్‌రాజ్ ఈ సినిమాలో ప్రతినాయకుడిగా నటించడానికి అంగీకరించాడు.[3]

తారాగణం

అవార్డులు

  • ఉత్తమ నిర్మాతగా రామోజీరావుకు ఫిలింఫేర్ పురస్కారం.
  • ఈ దుర్యోధన దుశ్శాసన పాటకు గాను ఎస్. జానకి ఉత్తమ నేపథ్య గాయనిగా నంది పురస్కారాన్ని అందుకుంది.
  • విజయశాంతి ఉత్తమ నటిగా నంది పురస్కారం, ఫిలిం ఫేర్ పురస్కారాలు అందుకుంది.
  • సంభాషణల రచయిత ఎం. వి. ఎస్. హరనాథ రావుకు నంది పురస్కారం లభించింది.

పాటలు

  1. ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో - రచన: వేటూరి సుందరరామమూర్తి; గానం: ఎస్. జానకి
  2. వయసు - రచన: వేటూరి సుందరరామమూర్తి; గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం, ఎస్. జానకి
  3. హెచ్చరికో హెచ్చరిక - రచన: వేటూరి సుందరరామమూర్తి, గానం: ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads