సంహితము
From Wikipedia, the free encyclopedia
Remove ads
సంహిత అనగా బాగా మేలు చేసేది అనిఅర్ధం. ప్రతి వేదంలోకూడా సంహిత ఉంటుంది. ప్రతి వేదంలోనూ నాలుగు విభాగాలుంటాయి. (1) సంహిత (2) బ్రాహ్మణాలు (3) అరణ్యకాలు (4) ఉపనిషత్తులు
Remove ads
వేదశాస్త్రం
"సంహితం భవతి హ్యక్షరిణి ధనం ప్రతిష్ఠాయై" - అనగా తరగని సంపదను కలిగించునది సంహితము. "సంధి" అనే అర్ధంలో కూడా సంహితను వివరిస్తారు. వేదము లోని శాస్త్రమును సంధించునది సంహితము. (సంహితమ్ = కూడుకొనునది). వేద సంహిత అంటే మంత్రాల, సూక్తాల కూర్పు మాత్రమే. రచన కాదు. అంటే వేద ద్రష్టలైన ఋషులు వీటిని రచించలేదు (వేదాలు "అపౌరుషేయాలు"). వీటిని దర్శించి, స్మరించి, కూర్చారు (సంకలనం చేశారు) [1]
సంహిత అర్థం
- "సంహిత" అంటే మంత్రాల సంకలనం. నాలుగు వేదాలకు నాలుగు సంహితలున్నాయి. అసలు వేదం అంటే సంహితా విభాగమే. అంటే మంత్రాల సముదాయం. ఋక్సంహితలోని మంత్రాలను ఋక్కులు అంటారు. యజుర్వేదంలో యజుస్సులు, సామవేదంలో సామాలు, అధర్వవేదంలో అంగిరస్‌లు అనబడే మంత్రాలుంటాయి. యజ్ఞంలో నలుగురు ప్రధాన ఋత్విజులు ఉంటారు. ఋగ్వేద మంత్రాలను పఠించే ఋషిని "హోత" అని, యజుర్మంత్రాలు పఠించే ఋషిని "అధ్వర్యుడు" అని, సామగానం చేసే ఋషిని "ఉద్గాత" అని, అధర్వాంగిరస్సులను పఠించే ఋషిని "బ్రహ్మ" అని అంటారు. ఈ నలుగురూ యజ్ఞ వేదికకు నాలుగు వైపుల ఉంటారు.
- వేద సంహితలలో యజుస్సంహితలో మాత్రమే గద్యభాగం ఎక్కువగా ఉంది. ఋక్సంహిత, సామ సంహిత పూర్తిగా గద్యభభాగమే అయినా వాటిని కూడా మంత్రాలలా పఠిస్తారు.[2]
Remove ads
చతుర్వేద సంహితలు
- ఋగ్వేద సంహిత దేవతల గుణగణాలను స్తుతిస్తుంది.
- యజుర్వేద సంహిత వివిధ యజ్ఞాలను నిర్దేశిస్తుంది.
- సామవేద సంహిత దేవతలను ప్రసన్నులను చేసుకొనే గానవిధిని తెలుపుతుంది.
- అధర్వవేద సంహిత బ్రహ్మజ్ఞానం సహితంగా అనేకానేక లౌకిక విషయాలను వివరిస్తుంది.
- యజుర్వేద సంహితలో మళ్ళీ రెండు భాగాలున్నాయి. (1) వాజసనేయ మాధ్యందిన శుక్ల యజుర్వేద సంహిత (2) కృష్ణ యజుర్వేద తైత్తరీయ సంహిత.
అనంతర సంహితలు
వేదాల అనంతరం వచ్చిన క్రింది గ్రంథాలు కూడా 'సంహిత" పేరుతో ప్రసిద్ధమయ్యాయి.
- ఘేరండ సంహిత
- చరక సంహిత
- కశ్యప సంహిత
- అష్టావక్ర సంహిత
- భృగు సంహిత
- యాజ్ఞవల్క్య సంహిత
- బ్రహ్మ సంహిత
- గర్గ సంహిత
- దేవ సంహిత
ఇవి కూడా చూడండి
మూలాలు
బయటి లింకులు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads