హిందూధర్మశాస్త్రాలు
From Wikipedia, the free encyclopedia
Remove ads
హిందుత్వం అనేది ఇది ఒక మతం కాదు.ఇది సనాతన ధర్మం. హిందు ధర్మం అంటే జ్ఞాన మార్గం. మానవుడిని మంచి మార్గంలో నడిపించే జీవన విధానం. మతం అంటే అంతరించేది. ధర్మం అంటే నిరంతరం కొనసాగేది. చాల మంది వ్యక్తులు ఇది ఒక మతంగా భావిస్తారు. కాని ధర్మం అంటే ఏమిటో అని ఎవ్వరూ అన్వేషించరు.అందువల్లే హిందూ సనాతన ధర్మంలో ధర్మో రక్షతి రక్షితః అంటారు. ధర్మాన్ని మనం రక్షిస్తే, ధర్మం మనల్ని రక్షిస్తుంది, అంటారు.
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
![]() | ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. (July 2021) |
హిందూధర్మానికి సంబంధించిన ఆధారాలు, నియమాలు, సిద్ధాంతాలు, తత్వాలను వివరించేవి హిందూ ధర్మశాస్త్రాలు. ఇవి ప్రధానంగా సంస్కృత భాషలో ఉన్నాయి.ఈ విధమైన సంస్కృత సాహిత్యమును ధర్మం పరంగా ఆరు విభాగాలు, మతాలతో సంబంధం లేకుండా నాలుగు విభాగాలుగా పరిగణిస్తారు.
Remove ads
ప్రధాన విభాగాలు
చతుర్వేదాలు (శృతులు)
"శ్రుతి" అనగా "వినిపించింది". అంటే ఈ విధమైన శాస్త్రాలు సామాన్యమైన వ్యక్తులచే రచింపబడలేదు. "మంత్రద్రష్ట" లైన ఋషులకు అవి "వినిపించినవి". చతుర్వేదాలు - అనగా ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అధర్వణవేదం - ఇవన్నీ శ్రుతులు.ఇవి మనుష్యులచే రచింపబడలేదు గనుక వీటిని "అపౌరుషేయాలు" లేదా "నిత్యాలు" అని కూడా అంటారు. ఇవి హిందూ ధర్మానికి మౌలికమైన ప్రమాణికాలు. ఒక్కొక్క వేదంలో భాగాలైన సంహిత, ఆరణ్యకం, బ్రాహ్మణం, ఉపనిషత్తులు కూడా శ్రుతులేఅగును.
ఉపవేదాలు
నాలుగు ఉపవేదాలు ఉన్నాయి. అవి:
- ఆయుర్వేదం - (వైద్య సంబంధం)
- గాంధర్వవేదం - (సంగీత సంబంధం)
- ధనుర్వేదం - (యుద్ధ సంబంధం),
- స్థాపత్యవేదం - (శిల్ప విద్యకు సంబంధించింది)
వేదాంగాలు
వేదాంగాలు ఆరు. అవి:
స్మృతులు
"స్మృతి" అనగా "స్మరించింది" అనగా "గుర్తు ఉంచుకుంది". ఇవి శ్రుతుల తరువాతి ప్రమాణ గ్రంథాలు. విధి, నిషేధాల (మానవులు, సంఘం ఏవిధంగా ప్రవర్తించాలి, ఏవిధంగా ప్రవర్తించ కూడదు అనే విషయాలు) గురించి స్మృతులు వివరిస్తాయి.
ఇతిహాసాలు
పురాణాలు
ఆగమాలు
- దేవాలయాలు నిర్మాణం, విగ్రహలను చేయుట, ఆలయ ప్రతిష్ఠ, పూజా విధానాలు వంటి విషయాలు ఆగమాలలలో ప్రస్తావించబడినవి. ఇవి రెండు ప్రధాన వర్గాలు
- శైవాగమాలు - 28 కలవందురు.
- వైష్ణవాగమాలు - పాంచరాత్రం, వైఖానసం
దర్శనాలు
- దర్శనాలలో పరిశీలింపబడిన కొన్ని ప్రశ్నలు - మరణానంతరం శరీరంనుండి విడివడిన జీవుడేమగును? మోక్షస్వరూపం ఎలాంటిది? జీవుడు లోకాంతరాలకి వెళ్ళు మార్గం ఏమిటి? ఇలా జీవితం, ధర్మం, మోక్షం వంటి కొన్ని క్లిష్టమైన తాత్వికసమస్యలకు పలువిధాలైన సమాధానాలు వివిధ తత్వవేత్తలచే ప్రతిపాదింపబడినవి. వారి ప్రతిపాదనలే దర్శనాలు. వాటిలో ఆరు ముఖ్యమైనవాటిని షడ్దర్శనాలు అంటారు. అవి
మతంతో సంబంధంలేని విభాగాలు
Remove ads
మూలాలు
వెలుపలి లంకెలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads